మేము సిలిగురి లో ఉన్నప్పుడు అక్కడక్కడ ఇళ్ళల్లో ఉన్న అర్టై చెట్లు, వాటికి ఉన్న ఎర్రట్ అరటి పండ్ళ గెలలు చూస్తుంటే నాకు అరటి చెట్టు పెట్టుకోవాలని కోరిక కలిగింది. తెచ్చి పెట్టానో లేదో చుట్టుపక్కల వాళ్ళంతా ,అసలే మనం అడవిలో ఏనుగుల మధ్య ఉన్నాము అరటి చెట్టుకోసం ఏనుగులొచ్చి పడతాయి తీసేసేయ్ అని గోల పెట్టేసారు. ఊళ్ళో వాళ్ళు పెంచుకుంటున్నారు కదా అంటే వాళ్ళు కంచె వేసి, [...]