విశ్వ విద్యాలయ విద్యాసంస్థలన్నింటిలోనూ చిత్ర రసాస్వాదన (Art
appreciation) పాఠ్య క్రమాలను ప్రవేశపెట్టాలని, చిత్రరచనను నేర్పడం మాత్రమే
కాకుండా చిత్రాన్ని ఆనందించటం నేర్పాలని "చిత్రం ఆనందించాలంటే" అన్న
వ్యాసంలో సంజీవదేవ్ రాశారు. ఇవేళ హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయ
తెలుగుశాఖలో Comparitive Aesthetics ప్రవేశపెట్టబడటంతో వారి కల నిజమైందని
చెప్పవచ్చును. -వెలిచాల కొండలరావు, డా|| ముదిగొండ