ముసురుపట్టిన ఈ సాయంకాలం
పదే పదే మా ఊరిని గుర్తుకు తెస్తోంది.ఇలాంటి సాయంకాలాలంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఉండేది.
వర్షం మీద ఇష్టం కాదు.ముసురు పట్టిన సాయంకాలాల్లో మాత్రమే చేసే చింతపండు,ఆవపిండి తో చేసే ఘాటైన పులిహోర మీద ప్రేమ.ఇంకేమీ వండే వాళ్ళు కాదు.కంచం నిండా కావలసినంత పులిహోర,ఆవకాయ ముక్క.అంతే.అబ్బ! ఎంత బావుండేది.ముక్కులు ఎగపీల్చుకుంటూ వేడి వేడిగా తిటుంటే నా సామి [...]
