కొన్ని రోజుల క్రిందట ఒక వార్త తెలిసింది.(మా కుటుంబంలో వారు .. వైద్యులుగా చేస్తున్నారు. అలా ఈ విషయం తెలిసింది. ) హాస్పిటల్ కు వచ్చిన  14 సంవత్సరాల ఒక అబ్బాయికి వారి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవటమో? గీరటమో? జరిగిందట. ఇంట్లో పెంచుకుంటున్నదే కదా.. అని ఇంజక్షన్ చేయించుకోలేదట.  కొంతకాలానికి ఆ అబ్బాయికి కొన్ని వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళారట.  ఈ విషయం జరిగి [...]
1.   అంతరంగం అణు విస్ఫోటనమయ్యింది_మదిని తాకిన మాటల తూటాలకు....!! 2.   భావతరంగాల అంతర్మథనం_అనంతాకాశానికి చేరువగా...!! 3.   అక్షరాల్లో అలవోకగా ఒదిగిపోతాయి_మనసు దాయలేని భావాలన్నీ...!! 4.   ఫలించకున్నా గెలిచిన ప్రేమది_త్యాగానికి మరో రూపమై...!! 5.   పరిచితమే ఎప్పుడూ_అపరిమితమైన నీ జ్ఞాపకాలతో...!! 6.  ఎద నిండిన జ్ఞాపకమైతే చాలు_ఏళ్ళ తరబడి నిలిచిపోవడానికి....!! 7.   ఒడిజేరని ఓదార్పది_కలానికందని [...]
వదిన చెప్పిన సలహాల గురించి తెలియాలంటే...చదవండి.. వదినా మజాకానా!
ఆత్మీయంగా పంచుకున్న అనుభవాల కబుర్లు, జీవితపు ఒడిదుడుకులు ఇలా అన్నీ కలిసి కాసేపు కాలాన్ని మనకప్పజెప్పినట్టుంది కదా రాణి అక్కా.. థాంక్యూ సో మచ్ నా పై నీ నమ్మకానికి...నీ సహచర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు.... ఇన్నేళ్ళ తరువాత మనల్ని మళ్ళీ ఇలా కలిపిన నా రాతలకు, ఈ ముఖ పుస్తకానికి ధన్యవాదాలు...
          ఇదంతా చెప్పడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10వ పుట్టినరోజు. 2009 జనవరిలో అంతర్జాలంలో అక్షరాలతో మొదలైన నా రాతల గురించి, నా గురించి కొన్ని కబుర్లు.ఓపిక ఉంటే చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. సద్విమర్శలకు సదా స్వాగతం...                       నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం లోనికి అడుగు పెట్టింది. 2009 జనవరి నుండి ఇప్పటి వరకు నేను [...]
                           " అంతర్లోచనాలు...అందరి ఆలోచనల సమాహారం"              నవ్యాంధ్ర రచయితల సంఘం, భువన విజయం, తెలుగురథం సంయుక్తంగా విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంధాలయంలోలో నిర్వహించిన " అంతర్లోచనాలు " పుస్తక ఆవిష్కరణ సభ కాస్త ఆలశ్యంగా మొదలైనా ఆద్యంతమూ నవ్వుల చతురోక్తుల మధ్యన దిగ్విజయంగా జరిగింది.           నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, నవ మల్లెతీగ సంపాదకులు, " [...]
అంతరంగ అంతర్మథనమే యామిని అక్షర శరాలు..!!           తెలుగు సాహిత్యంలో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక తరంలో ఎందరి మనసులనో తడుముతున్న భావాలను రాస్తున్న ఈ తరం కవయిత్రులలో యామినీదేవి కోడె ఒకరు. మూడు వాక్యాలలో ముచ్చటగా త్రిపదాల్లో పొందు పరచినా, తన మనసు స్పందించిన భావాన్ని కవితగా అక్షరీకరించినా, ఎంతోమందిని  తన భావజాలంతో కట్టిపడేస్తున్న యామిని దేవి కోడె [...]
నవమాసాలు మెాయకున్నా రక్తం పంచివ్వని బంధమైనా మమతలకు నెలవై మానవత్వానికి మరో రూపమై జీవకారుణ్యమే జీవిత ధ్యేయంగా ఓరిమికే ఓదార్పుగా శాంతి సహనాలకు చిరునామాగా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా దివి నుండి భువికి ఏతెంచిన అమృతమూర్తి ఈ అమ్మ సకల మానవాళికి ఆదర్శమే...!!
నా అంతర్లోచనాలు పుస్తక ఆవిష్కరణ గురించి ఈ రోజు గోదావరి పత్రికలో...పత్రిక యాజమాన్యానికి, యడవల్లి శ్రీనివాస్ గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు అంతర్లోచనాలు పుస్తకంపై అద్భుతమైన సమీక్ష రాసిన కత్తిమండ ప్రతాప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
నేను రెండు కొత్త పుస్తకాలు వేసాను. ప్రస్తుతం హైద్రాబాదులో నడుస్తున్న బుక్ ఫేర్ లో ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వెళ్ళి కొనుక్కుందుకు కుదరనివారు నాకు వారి  కామెంట్ పెడితే నా మైల్ ఐ డి ఇస్తాను. వారి అడ్రసుకి బుక్స్ పంపిస్తాను. .
బుల్లి బుల్లి ఆశలు చందమామకు ;మన అల్లిబిల్లి జాబిలికి ;  ||;పొన్నచెట్టు, కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు; నిలువెల్లా క్రిష్ణమ్మను చూడాలని ;చెప్పలేని తహతహలు జాబిల్లికి ;  ||;రేపల్లెల గోపెమ్మల కొంగులందు దోబూచి ఆటలాడు క్రిష్ణయ్య ;తనతోటి కూడా ఆడాలని :చెప్పలేని తహతహలు జాబిల్లికి ;  ||;===============,;bulli bulli ASalu camdamaamaku ;mana allibilli jaabiliki ;  ||;ponnacheTTu, kommalalO ;daaginaaDu krishNuDu; niluwellaa krishNammanu cuuDAlani ; ceppalEni tahatahalu jaabilliki ; ||;rEpallela [...]
ఈ వీడియో.. full QUALITY తో చూడాలంటే ఇక్కడ........ క్లిక్ చేయండి..
ఇది అలనాటి మాయాబజార్ సినిమాలో ఒక అందమైన సన్నివేశం. ఇక్కడ రచయిత పెండ్యాల నాగేంద్రరావు గారు హిడింబ చేత "అలమలం" అనిపిస్తారు. ఈ మాట విండానికి నవ్వుతెప్పించేటట్టుగా ఉండి, అదేదో అర్ధంలేని మాటగానో లేదా అర్ధంకాని ఆటవిక పదజాలం గానో పొరపడే ప్రమాదముంది. నిజానికి ఇది ఎంతో అందమైన సంస్కృతపదం. అలం అంటే సంస్కృతంలో "చాలు" అని అర్ధం. అలమలం అంటే "చాలుచాలు" అని అర్ధమన్నమాట. ఇప్పుడీ [...]
మనలో చాలా మంది “యథారాజా తథా ప్రజాః” అనే నానుడి విని ఉంటాం. అయితే ఇది ఒక మంచి సంస్కృత నీతి శ్లోకంలో చివరి అర్ధభాగమని ఎంతోమందికి తెలియక పోవచ్చు. ఇదిగో మరి ఆ శ్లోకం.రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః, పాపేపాపా-స్సమే సమాః ।లోకాస్త మనువర్తంతే, యథారాజా తథాప్రజాః ।।రాజు ధర్మంగా నడుచుకుంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజు పాపి అయితే ప్రజలూ పాపప్పనులే చేస్తారు. రాజు పాపపుణ్యాలు [...]
కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారుండేవారట, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈయన పద్యాలు మంచి సరదాగానూ, తెలివిగానూ చెప్పేవారు. సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.ముందు చెప్పినట్టు [...]
ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడాబ్రాహ్మడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడకదీనుల జంపక దేశంబు నొంపక -- [...]
మానాన్న నిర్దోషని బల్లగుద్ది ఋజువుచేసి,బూచాడమ్మా బూచాడని బడిపంతుల్నే మురిపించి,పదహారేళ్ళ వయసులో సిరిమల్లె పువ్వుగావిరిసి, పంటచేనులో పాలకంకిలా నవ్వి,వేటగాడితో ఆకుచాటుపిందెగా దోబూచులాడి,జాబిలితో చెప్తానని బెదిరించి, పరుగెత్తించి,బుర్రిపాలెం బుల్లోడిని ఘరానాదొంగ చేసి,కార్తీకదీపపు వెలుతుర్లో గోరింక పిలిస్తేముద్దుల చిలకమ్మగా ఓయని పలికి,హిమ్మతువాలాని [...]
C/o Kancharapalem చూసేరా? బాగుంది కదూ! ఇంకా చూడలేదా! ఐతే వెంటనే వెళ్ళి చూసెయ్యండి. మిగతా తెలుగు సినిమాలలాగా గందరగోళమైన పాటలూ, తొంభై శాతం బట్లరింగ్లీషూ, మిగతా పదిశాతం మహమూద్ హిందీతో కలిసిన తెలుగుతో నాటకఫక్కీలో చెప్పే మాటలూ, ఇవేమీ లేకుండా, మామూలు మనుషులతో మన చుట్టుపక్కల జరిగే విషయాలతో కథనల్లి దాన్ని సినిమాగా చూపించేరు. ఇందులో అనవసరమైన అలౌకిక దెబ్బలాటల్లేవు. చెత్త ఇంగ్లీషుతో [...]
తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితుడైన మాటల రచయిత, దర్శకుడు, తెలుగంటే ప్రత్యేకమైన అభిమానమున్నవాడూ అయిన త్రివిక్రమ శ్రీనివాస్ (త్రివిక్రమ్) కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక సభలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, సాహిత్య విలువలున్న పాటలకి అంతగా అవకాశం లేని ఉత్త వ్యాపారాత్మకమైన తెలుగు సినిమాలలో కూడా తన సాహిత్య భరిత కవిత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తారో [...]
అవలోకనమంటే చూడడం. ప్రత్యేకించి వెనక్కి లేదా క్రిందకి చూడ్డం.  దీనికి వ్యతిరేక పదం ఆలోకనం. అంటే ముందుచూపన్నమాట. సింహం తనదారిలో నడుస్తూ మధ్యలో ఆగి ఒక్కసారి అలా వెనక్కి చూస్తుంది. తనకి సంబంధించని వాళ్ళెవరైనా తనని రహస్యంగా అనుసరిస్తున్నారా, తనువెళ్లే దారి సరైనదేనా, ఇలాటి కారణాలవల్ల. అలాగే మనుష్యులు కూడా తామేదైనా చదవడమో , వ్రాయడమో, బొమ్మ గీయడమో, శిల్పం చెక్కడమో, లేదా [...]
తేది: 30-11-2018, శనివారము నాడు విజయవాడ లోని ఎం.బి.విజ్ఞాన కేంద్రం లో జరిగిన "బాలల రంగస్థలం" పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సంకలనంలో... నా రచనలు.. నాలుగు.. 1) తెలుగు భాష (ఏకపాత్ర) 2) నేనూ చదువుకుంటా (నాటిక) 3) బాలకార్మికా బడి బాట పట్టరా (అభ్యుదయ గీతం) 4) పల్లె-పట్నం (జానపద గేయం) ... ప్రచురితమయ్యాయి. అమరావతి బాలోత్సవ్ కమిటీ వారు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ నాలుగు అంశాలలో.. జరిగిన ఈ పోటీలలో నాలుగు
వీడియో క్లిప్ ఆఫ్ ... పికినిక్ వీడియో క్లిప్ ఆఫ్ ... పికినిక్
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు