శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారు ఫోటో కర్టెసీ http://anantasahiti.org /నిన్న మొన్నటివరకూ శ్రీ ఏలూరిపాటి అనంత రామయ్యగారి ఫొటో మన వెబ్ ప్రపంచంలో దొరకాలంటే గగనం! కాని నిన్న మన బ్లాగ్ లోకంలో వెతుకుతుంటే నన్ను ఆశ్చర్యానందల్లో ముంచి వేసిన ప్రకటన ఒకటి. అనంతరామయ్య గారి భారతం ఉపన్యాసాలు రోజుకొకటి మనకు అందచేస్తామని వారి అబ్బాయి, ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం గారి వారి బ్లాగ్ [...]
ఒకరి అభిరుచి ఒకరికి బాగా తెలిసినవారవడం వల్లో లేక ఇద్దరివీ ఒకే ఆలోచనలవడం వల్లో ఏమో తెలీదు కానీ రాజమౌళి సినిమా అనగానే కీరవాణి గారి హార్మోనియం మాంచి క్యాచీ ట్యూన్స్ ని పలికిస్తుంటుంది. రాజమౌళి తీసిన 'సై' సినిమా కోసం కీరవాణి స్వరపరచిన ఒక చక్కనిపాట ఈరోజు మీకోసం.. ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : సై (2004)సంగీతం : కీరవాణిసాహిత్యం : శివశక్తి [...]
ఏప్రిల్‌ 8, 2014 నుంచి మైక్రోసాఫ్ట్‌ తన ‘విండోస్‌ ఎక్స్‌పీ’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి సర్వీసును నిలిపివేసింది. యూజర్లందరూ విండోస్‌ 7 లేదా విండోస్‌ 8కి అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు ‘ఎక్స్‌పీ’ని ఏ యాంటీవైరస్‌ ప్రోగ్రామ్‌ కూడా సపోర్ట్‌ చేయకుండా బగ్స్‌ బిగించేసింది. డేటా సెక్యూరిటీ కోసం యాంటీవైరస్‌ తప్పనిసరి కాబట్టి యూజర్లు విండోస్‌ కొత్త [...]
కవిమిత్రులారా,రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం.రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం.మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం.నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం.నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో [...]
కవిమిత్రులారా,పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా మహాభారతం నేను ప్రాతఃశ్లోకాలు చదువుతూ ఉన్నాను - ‘పుణ్య శ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః’ (నల మహారాజు పుణ్యచరితుడు, యుధిష్ఠిరుడు పుణ్య చరితుడు) ఇంతలో వికటకవి చిన్నాన్న వచ్చి అన్నాడు - అరే, ప్రొద్దున్నే ఈ వ్యర్థుల పేర్లు జపిస్తున్నావేమిటి? నేను - చిన్నాన్నా, ధర్మరాజు లాంటి సత్ఫురుషుని గురించి మీరిట్లా [...]
దీపావళి రోజు ఇంటి ముంగట మతాబులు పేలుళ్లు ఉంటే… వెచ్చగా ఇంటి లో ఉన్న ప్రదేశాలలో కి వచ్చి చేరే పాములు,క్రిమి కీటకాలు మతాబుల శబ్దాలకు ఇంటి చుట్టుపక్కల నుంచి వెళ్లి పోయి.., పొలాలలో నివాసాన్ని ఎరాపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయని మనకు తెలిసిందే … కాబట్టి మన ఇంటిలో ఈ కార్తిక మాసం లో దీపం పెట్టి ఒక మతబైనా కాల్చకుండా ఉండకండి ….. వివేకానంద భేరి నాదాల ను మన పిల్లలు [...]
జవాబులేని ప్రశ్నలు అంటూ ఉంటే అది ప్రయత్నలోపమే తప్ప తగినవిధంగా ప్రయత్నిస్తే సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదని నమ్మే క్యూరియస్ అండ్ డేరింగ్ మెడికో కార్తీక్. తను మెడికల్ కాంప్ లో భాగంగా సుబ్రహ్మణ్యపురం అనే చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఎంతో పురాతనమైన ఒక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంటుంది కానీ ఇటీవల మూసి వేయబడిన ఆ గుడి తలుపులు తెరవడానికి ఎవరు ప్రయత్నించినా అసలు ఆ గుడి [...]
నేస్తం....             ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎందుకో నా గతము నువ్వే , వాస్తవము నువ్వే , వర్తమానమూ నువ్వే అయిపోయావు.... భ్రమించే మనసు పరిభ్రమణము నీ చుట్టూనే నిర్విరామంగా..... మాటల మౌనాలు చెప్పని భావాలు నాకు సొంతమైతే.... చెప్పిన కబుర్లు వెంటనే మర్చిపోవడం నీ వంతు... అందరు బోలెడు సమస్యల వలయాలను ఛేదించే మార్గాలు అన్వేషిస్తుంటే నా సమస్యలన్నీ నీ వెంటే.... గతం చేయని గాయాలు వాస్తవంలో మానని [...]
వాన వానా వల్లప్పవల్లప్పకు ఆహాహా!దొరికినవీ కానుకలుకోకొల్లల వేడుకలు!  || తిరిగి తిరుగు ఆటలుతిరుగు తిరుగు ఆటలుతారంగం పాటలు! జలతరంగిణీ ఆటలు ॥  'వాన చుక్క టప్పు టప్పు!తడవకండి, తప్పు తప్పుపడిసెం, జలుబులు కలుగునుతడవకండి, తప్పు తప్పు' తప్పంటే ఆగేరాఈ అల్లరి పిల్లలు!?ఆనక ఆ పెద్దలేఅవుతారు పిల్లలుగా వాన వానా వల్లప్పవల్లప్పకు ఆహాహాదొరికినవీ కానుకలుకోకొల్లల వేడుకలు [...]
నిజానికి వ్యక్తికన్న వ్యవస్థ గొప్పది. కానీ వ్యవస్థ అవస్థల పాలవకుండా, ఒక కాపుకాచే నాయకత్వ పటిమ ఒక సమయంలో అనివార్యవౌతుంది. వ్యవస్థలో లోపాలను సవరించబూనే వ్యక్తిలో లోపాలు వుండవని కాదు. కానీ వాటిని విస్మరించి సమాదరించగల నేర్పును, చేవను, ఆచరణాత్మక ఫలితాలను ఆ వ్యక్తి చూపగలిగినప్పుడు సమాజం హర్షిస్తుంది.  మన నూతన ప్రధాని నరేంద్రమోడి ఒక డైనమోగా డా.వడ్డి విజయసారథి [...]
(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 26-10-2014, SUNDAY)ప్రపంచ జనాభాలో అత్యధికులను  ఓ మూడక్షరాల పదం వణికిస్తోంది. 'ఎబోలా' అనే వ్యాధి ఛాపకింది నీరులా వ్యాపిస్తోందని ఏకంగా ప్రపంచ  ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందంటే పొంచివున్న పెను ముప్పు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎబోలా అనే పేరు గల వ్యాధి ఒకటి  వుందని కొన్నేళ్ళ ముందువరకు అనేక దేశాలకు తెలియనే తెలియదు. ఇది సాధారణ వ్యాధి కాదనీ, చాలా [...]
సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళడానికి ఈరోజు ఎంత మంది సోదరులు ప్రయాణం కట్టారు...?? ఈ రోజు ప్రత్యేకతను తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి.... http://naalonenu-manju.blogspot.in/2013/11/blog-post_4.html
ప్రేమనగర్ సినిమాలోని ఈ పాట మొదట్లో వచ్చే మ్యూజిక్ బిట్ నాకు చాలా ఇష్టం. మిగిలిన వాయిద్యాలతో పాటు దువ్వెనపై పలికించినట్లుగా వినిపించే బిట్ గమ్మత్తుగా ఉంటుంది. ఇక పాటలోని ఆత్రేయ గారి సాహిత్యం గురించీ, మహదేవన్ గారి సంగీతం గురించీ, ఘంటసాల గారి గాత్రం గురించీ ఎంత చెప్పినా తక్కువే. ఈ అచ్చతెలుగు పాటను మీరూ వినీ చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు [...]
చిలకలపల్లిఅడవిలో పచ్చని చెట్లు విస్తారంగా ఉన్నాయి. వాటి మీద లెక్క లేనన్ని చిలకలు నివసిస్తూ ఉండేవి. అవి చేసే సందడి అంతా యింతా  కాదు ! తియ్య తియ్యని పండ్లను తింటూ, చిలుక పలుకులు పలుకుతూ అవి హాయిగా బ్రతుకుతూ ఉండేవి.     వాటిలో ఒక కొంటె చిలుక కూడా ఉండేది. దాని చిలిపితనం చెప్పతరం కాదు !ఎప్పుడూ ఏదో చిలిపి చేష్ట చేస్తూ,  తక్కిన వాటిని కడుపుబ్బా నవ్విస్తూ ఉండేది.  అది [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.
కవిమిత్రులారా,పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వేపుడు తిళ్ళుడా. జి వి పూర్ణచందు          బూరెలమూకుడుని కనుక్కొన్న రోజున ఇది మానవాళికి అపకారంగు చేసే వంటకాలను తయారు చేయగల మహమ్మారి అని ఊహి౦చి ఉండడు మనిషి. నరకలోకంలో పాపుల్ని వేయించటానికి నూనెని సలసలా కాచే౦దు కోసమని బూరెల మూకుడుని కనుగొని ఉంటారు. సలసలా నూనెని కాచి, సున్నిత మైన కూరగాయల్ని వేయించే౦దుకు భూలోకంలో ఆ బూరెల మూకుడుని ఉపయోగిస్తున్నాం! ఎవరయినా [...]
ఒక శంఖం: నిదురించే శిశువు వంటిది. దాని లేతెరుపు పిడికిలి వంటిది. నీ హృదయం వంటిది- మరి నీ హృదయాన్ని దాని హృదయం దగ్గరగా ఆన్చినప్పుడు నీకు వినవచ్చేదేమిటి? సముద్రపు తీరాలలో రాత్రుళ్ళల్లో కొట్టుకువచ్చే వెన్నెల నురగ. మెరిసే నక్షత్రాల అనంతాల దూరం. ఇంకా, ఇసుక సవ్వడీ, ఉప్పు వాసనా- మరి ఆ కన్నీళ్ళూ, ఆ ఉప్పదనమూ ఎవరిదీ అని అడగకు. కొన్నిసార్లు అది ఇసుకది కొన్నిసార్లు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు