వెనకటి నేను! - ఈ శీర్షికలో నేను గతంలో రాసిన కొన్ని – ప్రచురించనవీ, ప్రచురించినా పదిమంది కళ్ళా పడనివి – మళ్ళీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. వాటిమీద ఈనాటి నావ్యాఖ్యలు చేరుస్తాను అవసరమనుకున్నచోట. వెనకటి టపాలో ప్రస్తావించిన “కథానిలయం నాకు చేసినమేలు” కోవలోకే వస్తుంది ఇది. వారి సైటు చూసినప్పుడు నా ఉత్సాహం ఇనుమడించింది. అక్కడ…Read more ›
రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పెట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందాకా రేడియో పెట్టాను.. ఉత్కంఠభరితమైన అమితాబ్ గొంతు ఖంగుమని మోగింది.. గభాలున గుర్తుకొచ్చింది IFFI మొదలైన సంగతి. చేస్తున్న పనులు వదిలేసి వాల్యూమ్ పెంచి, ఆ స్పీచ్  వింటూ కూచుండి పోయాం ఇద్దరం..! ఎంతో ఉత్సాహభరితమైన, [...]
కథానిలయంగురించి నేను వేరే చెప్పఖ్ఖర్లేదు కానీ నాకు జరిగినమేలు మరోమారు చెప్పకుండా ఉండలేను. ఇది కేవలం నాకు ఎలాటి ఉపకారం జరిగిందో చెప్పినా మిగతావారు కూడా ఉపయోగించుకోగలరనుకుంటాను. నేను కథానిలయం 2002లో దర్శించినప్పుడు అదొక ఆర్కైవ్ మాత్రమే అయినా అద్భుతం అనిపించింది. కానీ నిజంగా నామీద ప్రభావం చూపింది ఇప్పుడు. అదెలా అంటే, కథానిలయంలో తెలుగుకథలు…Read more ›
కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయిదూకే జలపాతంలా..కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయినిఠారైన నిలువుగీతలా..కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయిబోలెడు చుక్కల మెలికల ముగ్గులా..కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయిస్తబ్దుగా నిశీధిలా.. కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి అచ్చంగా జీవితంలా..
శ్రీమతి&శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతి క సంస్థ                      ఒక ఆశయం మనిషి జీవితంలో   వెలుగును తెస్తుంది.కళారాధనకు కాసులు గ్రుమ్మరించ నక్కరలేదు,కాసులు ప్రోగుచేయనక్కర లేదు. సహృదయుల్ని నలుగుర్ని   ఆహ్వానించి సంతోషంగా ,సరదాగా కళామ తల్లికి సేవ చేయవచ్చు. కళాకారుల్ని గుర్తించి ప్రోత్స హిస్తే చాలు వారికి ఎనలేని బలం వస్తుంది.ఇటువంటి ఆశయం తోనే శింగరాజు ప్రసాదు,వారి [...]
రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది.  ఏ కావ్యకన్యక శిరోభాగముననో చెలువొందు కురుసంపదవలె గంగమ్మజాతరనాటి జనసందోహంవలె ఉక్కిరిబిక్కిరిగా గర్భకుహరాలలోకి విస్తరించిన వేళ్ళు ఇటువైపునా, [...]
పక్కమీంచి లేచీ లేవకముందే రాత్రి వచ్చిన కల గుర్తొచ్చి గుండె దడదడ కొ్ట్టుకుంది.  హడలిపోతూ పడగ్గదిలో చుట్టూ కలయచూసి, గబగబ హాల్లోకీ వంటింట్లోకీ కూడా వెళ్ళి చూసుకున్నాను. ఎక్కడి సామానక్కడే ఉంది. నా లాపుటాపూ, టీవీ, కొత్తగా కాపురానికొచ్చినప్పుడు తెచ్చుకున్న బూందీ చట్రాలు – నా అపూర్వ వస్తుసంచయం అంతా ఎక్కడిదక్కడే ఉంది. హమ్మయ్య. ఏం…Read more ›
పాఠకులకీ రచయితలకీ మధ్య గల అవినాభావసంబంధం. ఈవ్యాసం నేను మొదట ఇంగ్లీషులో 2003లో, తెలుగులో 2005లో రాసేను. ఈమధ్య ఇంగ్లీషువ్యాసం ఫేస్బుక్కులో పెడితే, మిత్రులొకరు తెలుగులో లేదా అని అడిగేరు. అంచేత ఈ పునఃప్రచురణ, చిన్న మార్పులతో. paThakulurevFiled under: వ్యాసాలు
నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ [...]
కారామాష్టారుగా, కథలమాష్టారుగా తెలుగు పాఠకులకి సుపరిచితులయిన శ్రీ కాళీపట్నం రామారావుగారు ఈనాడు జన్మదినం జరుపుకోడం తెలుగుకథకి కూడా హర్షదాయకం. 1997లో కథానిలయం ప్రారంభించి కథాయజ్ఞం చేపట్టిన సోమయాజిగా రాజిల్లుతున్న రామారావుగారు ఇలాగే కలకాలం తమ యజ్జాన్ని సాగించగలరని మనసారా కోరుకుంటున్నాను. తెలుగు సాహిత్యచరిత్రని పునఃప్రతిష్ఠించుకునే ప్రయత్నంలో కథానిలయం ఒక [...]
     మొన్న   మా బంధువులింటికి   వెళ్లి   వస్తు   వాకిట్లో    అటు ఇటు చూస్తె  ఒక చెట్టుకి    స్ట్రా బెర్రీస్    లాంటి ఎర్రటి   కాయలు   గుత్తులు గుత్తులు   గా కనిపించాయి  ఇవేమికాయలు   అని అడిగా  అప్పుడు వాళ్ళు చెప్పారు ఇవి సింధూరం  కాయలండీ అని. సింధూరం   చూసాగానీ    సింధూరం చెట్టు  కాయలు ఇంతవరకు   చూడలేదు . హనుమంతుడి   విగ్రహం ఎప్పుడు సింధూరము తో    నిండి వుంటుంది . అది ఎలా [...]
 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి [...]
JyothivalabojuChief Editor / Content Headప్రతీ నెల సరికొత్త అంశాలతో మిమ్మల్ని అలరిస్తోంది మాలిక  పత్రిక. ఈ నెల ప్రత్యేకంగా జడ అనే అంశం మీద వచ్చిన సరదా పద్యాలు మీకోసం... మమ్మల్ని ఆదరిస్తోన్న  పాఠకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నెల మాలిక పత్రికలోని వివిధ వ్యాసాలు:మీ రచనలు పంపవలసిన చిరునామా editor@maalika.org 01. జడమాలిక  02.  పదచంద్రిక - నవంబర్ 2014 03. ఆత్మీయం.. ఎగిరే పావురమా 04. మూడుపాయల [...]
​ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా ​​నిద్రలేచింది.​​ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక నవంబరు సంచికలో...  
ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) తులసీ స్తోత్రం:http://youtu.be/Dxptk_6cgss తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :http://youtu.be/cAvzwnc16Ag తులసీ వివాహం : https://www.youtube.com/watch?v=iWs142GBCVsతులసీ హారతి:http://youtu.be/T9JH9h0qL6M
పదచంద్రిక అక్టోబర్ 2014 ఫలితాలు::  ఈ నెల పదచంద్రికని పూరించి పంపినవారు శ్రీచెనెకల మనోహర్ (రెండు తప్పులతో),  శ్రీ దాతా రమేష్ (రెండు తప్పులతో), శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మి (ఒక తప్పుతో).  శ్రీమతి శుభావల్లభ గారు, శ్రీ మాచెర్ల హనుమంతరావు గారు సరిగా పూరించినారు.  అందరికీ అభినందనలు.  సరియైన సమాధానాలు కింద ఇచ్చాం.సత్యసాయి కొవ్వలి
ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. సందర్భానుసారం, పరిస్థితుల దృష్ట్యా అవి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని అతడు చేసే/చేసిన పనుల వల్ల అంచనా వెయ్యడం అనేది సబబు కాదు. అసలలా ఎందుకు చేసాడు అనే కారణాలను అన్వేషించడం, వాటిని తెలుసుకున్న తరువాత ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం సరైన పని అని ఈ నవల ద్వారా రచయిత తెలియపరుస్తారు. ప్రపంచమంతా కౄరుడు, నిర్దయుడు, పాషాణహృదయుడు, [...]
అపార్థం చేసుకోకండి. మాయరోగం అంటే తిట్టులా ఉంటుందనే బహువచనం చేసేను. మామూలుగా నేను వైద్యదర్శనాలకి సంసిద్ధురాలిని కాను. వైద్యో నారాణో హరిః అన్న సుజనవాక్కు విన్నాను కానీ నాకు అర్థం తెలీదు. వైద్యుడు నారాయణుడివంటివాడే అనా? వాడే వీడు అనా? రెండోదే నిజం అనుకుని, నారాయణుడిదర్శనానికి వెడలిపోయినప్పుడే వైద్యనిదర్శనం కూడా అయిపోతుందన్న నిర్ణయానికొచ్చేను తరుచూ వైద్యులని…Read [...]
బ్నింగారు జడ మీద పద్యాలు రాయమని అలా అన్నారో లేదో సునామీలా పద్యాలు అందునా కందాలు వెల్లువెత్తాయి. అన్నీ జడ మీదేనండోయ్.. పుస్తకానికి కావలసినవి తలా ఐదు పద్యాలైనా ఆ తర్వాత కూడా అద్భుతమైన పద్యాలు రాసారు ఎందరో కవిమిత్రులు. ఇంకా రాస్తూనే ఉన్నారు. పూలదండలోని పూల వాసన దారానికి తగలదా అన్నట్టు నాదో చిన్న ప్రయత్నం. కాని ఇంతోటి దానికి నన్ను శతకకర్తను చేసి సన్మానించారు.. [...]
అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ..(నిన్నటి తరువాయి.. )దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు [...]
Not everyone is as lucky as me to be blessed with a friend like you. Thank you so much for coming into my life and standing by my side through thick and thin. I wish you get all that you truly deserve. Happy Birthday My Friend.. May God Bless U with Health, Wealth and Success with more Smiles..
చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి  వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా [...]
            ఆధారం     నాలుగున్నర అవగానే శీను   టపాకాయలన్నీ   అరుగుమీద  పేర్చడం ప్రారంభించాడు.    ఇప్పుడే ఎందుకురా అవన్నీ  పరుస్తున్నావు? అంది  లక్ష్మి    "అమ్మా!"  అన్నీ   విడి విడిగా  పెట్టుకొంటున్నానే!  తీసుకొడం తేలిక,ఎన్ని కాల్చానో  ఎన్ని వున్నా యో తెలుస్తుంది.అన్నాడు శీను    లక్ష్మి దీపాలు వెలిగించడానికి   కొత్త ప్రమిదలు తెప్పించి  నిన్ననే   నీళ్ళలొ నానబెట్టింది.అలా [...]
ఇసుమంత వేసవికి ఎంతలేసి చూపులోపుట్టల్లో చీమల మాదిరి ఇళ్ళల్లో జీవులకిఆరేడు నెలలు ముడుచుకుని, మడతలు ముడుకులు కాచుకుంటూ.గోరువెచ్చని పొద్దు పొడవగానేవిత్తులు, నార్లు, మళ్ళు, నీళ్ళు, గొప్పులు, శాఖపాకాలు- భూభాషలుమిడ్ వెస్ట్ నేలలో పచ్చదనపు పరవళ్ళన్న మాటే!జూలై మాసపు ఆరంభం అంటే వెయ్యిన్నొక్క రైతుల కూటమి రాకఊరంతా శనివారపు సంత వేడుకముక్కోటి తిరనాళ్లు, మొజాంజాహీ మార్కెట్, [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు