తమాషా గా రాశారు. మూడు వారల క్రితం డిల్లిలో సుబ్రమణ్య స్వామి ట్విటర్ ఫాలోయర్స్, ఒక సభ నిర్వహించి ఆయనకి షేర్ ఎ హింద్ అని బిరుదిచ్చారు. మరి ఈ ఫోట్ను చూసి మీరే కథ రాస్తారో!http://sriramugk.blogspot.in/2014/10/swamy.html
వారి సోదరులు ఆనంద గజపతి రాజు గారి గురించి చదివి/విని చాలా ఏళ్లయింది. భండారు వారికి తెలిస్తే చెప్పగలరు.
కథ ఎంత బాగుందొ దాని మీద అభిప్రాయాలు అంతకంటె బాగున్నాయి. thanks to all.
మోహనుడు తెల్ల వారిని సాహసమున తరిమి కొట్టె సత్యనిరతి తో నూహల చిక్కని నిజమగు నాహా నేటి జనములకు నార్యా! తలుపన్.
మిత్రులందఱకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, నమస్కారములు!||సీ||తంగేడు పూవులఁ దాంబాలమునఁ గుండ్ర....ముగ నందముగఁ బేర్చి, మురువు సూపువివిధమ్ములగు రంగులవి గునుగులఁ బేర్చి,....మందార, కట్ల, చేమంతుల నిడి,బంతిపూవులు పోకబంతిపూవులు వింత....సొబగుల నీనఁగాఁ జూపరులకుఁబ్రకృతి సోయగమంతఁ బండువు సేయంగ....బ్రతుకమ్మ నడుమ గౌరమ్మనుంచి,||గీ|ధగధగలతోడి పట్టుపీతాంబరములఁగట్టుకొనియును మెఱయుచు [...]
నిజమే. చాలా సార్లు అవతలి వారిలొ మనం ఉహించుకొన్న తప్పులు వాల్లతొ మాట్లాడిన తర్వాత తప్పులు గా కనిపించవు. మంచి కథ.
ఆత్మ పరి శీల నము మిన్న యన్న మనిషి కర్మ సూత్రము మనకున్న మర్మ మనుచునీతి సూత్రము లన్నియు నెరపి నిలువ శ్రీ మహాత్ముని శీలము స్థిరము నిలచెకొరుప్రోలు రాధా కృష్ణ రావు
ఆత్మ పరి శీల నము మిన్న యన్న మనిషి కర్మ సూత్రము మనకున్న మర్మ మనుచునీతి సూత్రము లన్నియు నెరపి నిలువ శ్రీ మహాత్ముని శీలము స్థిరము నిలచెకొరుప్రోలు రాధా కృష్ణ రావు
చాలా క్లిష్టమైన అంశాన్ని ఇచ్చారు గురువుగారు.
మల్లెల వారి పూరణలుకోమటి యయినను నేమయెసీమకు వెనుకకు తర్మెను, చేసియు పోరున్,నేమము నహింస, సత్యముతామల యస్త్రాలనుచును, తాతయు తానేసత్యమహింసల చేతను,నిత్యము రాట్నము గిరగిర, నేమము త్రిప్పాకృత్యముల, తెల్ల వారి, యకృత్యములను నాపి, తల్లి కిచ్చెను స్వేచ్ఛన్
రంగు రంగుల పూలతో రాజితముగభక్తితో బతుకమ్మల బలుతెరగులతీర్చి చక్కగ నొకచోట పేర్చి కొలచి పాట పాడుచు బతుకమ్మ యాట లాడి మడుగులోన జేసేరు నిమజ్జనంబు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,నా సూచనలను ఆమోదించినందుకు సంతోషం!*నాగరాజు రవీందర్ గారూ,‘ఎగిలివారంగ’ (గ్రామ్యమైనా మాండలిక జాతీయంగా గ్రాహ్యమే), ఎనుగు, గునుగు, కట్లపూల ప్రస్తావనతో తెలంగాణా పల్లెల్లోని బతుకమ్మ పండగను సాక్షాత్కరింపజేశారు. పద్యం చాలా బాగుంది. అభినందనలు.*శైలజ గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘ముదితలు గొలువన్’ అనండి. ‘చెరువులలో విడుతు రపుడు చేడియ లెల్లన్’ [...]
శైలజ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘తాతనున్’ అనండి.*గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.*అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,మీ ప్రయత్నం బాగుంది. కాని నియమోల్లంఘన జరిగింది. రెండు చోట్ల సరళాన్ని (ప్రజ, తేజ) ప్రయోగించారు. సవరించండి.*చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.*సహదేవుడు గారూ, అన్నపరెడ్డి వారు ‘ప్రజ’లతో [...]
గునుగు తంగేడు పూలెన్నొ యినుమడించగౌరి మాతను జేరిచి గౌరవమునభర్త, పిల్లల సేమము బడయ గోరివనిత లెల్లరు బతుకమ్మ పండుగనుచుసంబరంబుగఁ జేసెద రంబ పూజతాన మాడింత్రు చెరువులో తన్మయమున!
ఆల్బర్ట్ ఐనిస్టీన్ ఉవాచ :ఇలలో రక్తము మాంస మ్ములతోనిటువంటి కాయమొకటి పొలయగాతలమేనా యనుకొని చకి తులౌ నరులనంత వికసితోర్వి మహాత్మా
ప్రజల శక్తి మ్లేఛ్చులనెల్ల పాఱ తఱిమితెచ్చి స్వాతంత్ర్యము మనకు తేజ రిల్లెవిశ్వ విఖ్యాతి కలయట్టి విశ్వ నేతచాటి లేరు వాని కెవరు చరిత లోన
సహనమ్ము, సత్య పాలన,యహింస ,నిర్మల వచనము లనయము మెరయన్మహనీయ భారత పితా!యహమింతుము! తలచి మిమ్ము హర్షింతుమయా!
వరుసగ పూవులు బేర్చుచుమురియుచు బతుకమ్మ జేసి ముదితలు గొలుచున్వరముల నిమ్మని వేడుచుచెరువులలో కలిపి వేసి చేడియ లాడున్
ఎగిలివారంగనే లేచి యెలమి తోడ *‘నెనుగు ' నకు బూచిన విరులు **గునుగు దెచ్చి గుమ్మడాకుల నింటిలో గుమ్మరించి కట్లెపూలను గునుగును కట్టగట్టి వరుసగా బేర్చి పూలను బళ్ళెరమున నందముగ బతుకమ్మల పొందుపరచి పూజ జేసి ముంగిటనుంచి ముదముతోడ నమ్మలక్కలను గలిసి యాడిపాడి కొలనులోన వేసి బతుకమ్మలను తిరిగి వత్తు రింటికి పడతులు పాడుకొనుచు. * ఎనుగు = కంచె **గునుకు = అడవిపూలు
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు