భీష్మ హిందు 6:18pm Aug 30 అందరూ వినాయక చవితికి పొస్టింగ్స్ మరియు చిత్ర విచిత్రమైన ఫొటోలు పెట్టారు. తమ తమ ఇళ్ళలో గణపతి పూజలు, బయట మన వీధులలో పెట్టబడిన వినాయక విగ్రహల వద్ద కూడా పూజలు చేసారు, వినాయక వ్రత కథలు చదువుకున్నారు. మరి వినాయక పూజలోని తత్వం ఎంతమందికి, ఎంతవరకు మనసుకి ఎక్కించుకున్నారు ??? వినాయకుడు పెద్ద పొట్ట కలవాడు, పెద్ద పెద్ద చెవులు కలవాడు అని చెబుతారు, తల్లి [...]
బ్రహ్మచారి మనసులో ఎలాంటి రసమయ భావాలున్నాయో తెలుసుకోవాలంటే అవి తన కలలకు ప్రతిరూపమైన కన్నెపిల్ల ఎదటపడినపుడు తమంత తామే ఆ భావాలు గుండెలోతుల్లోంచి పెల్లుబికి బయటపడతాయి. ఇరువురి చూపులు కలసిన వేళ కలిగిన పరస్పర రసస్పందనలు ఆ అబ్బాయి మనసును కవితామయం చేసి ఆ అమ్మాయి కులుకుల నడకలను, వలపుల తలపులను, నగవుల సొగసులను వర్ణిస్తూ అనురాగాన్ని ప్రస్ఫుటింపజేస్తాయి. 1952 లో విడుదలైన [...]
తొలిపూజలందుకునే  గణనాథుని అనుగ్రహంతో అందరికీ  సుఖసంతోషాలు ప్రాప్తిమ్చాలని స్వామిని వేడుకుంటున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
అమ్మ అనుగ్రహంతో   నిర్మాణమవుతున్న అన్నపూర్ణభిక్షాశాల కొరకై  మరో పదివేల నూటపదహారు రూపాయలు సమర్పించబడ్డాయి.మితృలు మధు అంకం గారు  భిక్షాశాల నిర్మణంలో ఉపయోగించమని కోరుతూ పదివేల నూటపదహారు రూపాయలు పంపించారు.ప్రస్తుతం  నిర్మాణం పనులు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి . తలుపులు,కిటికీలు  తయారు చేపించాలి బయట ఆవరణలో బండపరుపు  వేపించాలి వైరింగ్ చేయాలి.. ఆపై కట్టుబడి [...]
ఇది తెలియని మత్తులోనో, యాదృశ్చికంగానో జరిగిన పనికాదు. పైశాచికత్వం నరనరానా నిండిన వీళ్లకి శిక్ష చాలా కఠినంగా ఉండాలి. ముఖ్యమైన నేరస్తులకి ఉరిశిక్షవిధించాలి. బాధితులు స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు తాత్సారం చేయడానికి గల కారణాలేమిటి? ఇంతకు ముందు వీరిపై ఇలాంటి అనుమానాలు వచ్చినా పోలీసులు ఎవరూ కంప్లైంట్  ఇవ్వలేదని వారిని విచారించలేదట. ( లక్షల రూపాయల లంచం [...]
పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపంపూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే గ్రహాల రూపములో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను [...]
ఎంత అపచారం? వళ్ లుకొవ్వెక్కి ఉఛ్చనీచాలు తెలియని ఇలాంటి పిల్లలు తయారవ్వటానికి కారణం ఎవరు?కని పశువులను మేపినట్టుమేపి లోకంమీదకు వదిలిన తల్లిదండ్రులది కాదా ?అంతర్జాలంలో ఈచిత్రంచూసి గుండెమండి వ్రాస్తున్నాను.  సంస్కారహీనులైన పిల్లలవల్ల జాతి ఎలాదిగజారిపోతుందో మనలో ఓచర్చజరగటానికి దీన్నిక్కడుంచాను ,త్వరలో తొలిగిస్తాను.క్షమించు తండ్రీ..నందికేశ...
కరచరణ కృతంవా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసంవాపరాధం ! విహిత మవిహితం వా సర్వమే తత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహదేవ శంభో !!
ఘంటసాల మాస్టారు తన స్వీయ దర్శకత్వంలోను మరియు అన్య సంగీత దర్శకుల నేతృత్వంలోను పలురాగాలలో అద్భుతమైన గానసంపదను మనకందించారు. ఇదివరకు ఘంటసాల-రాగశాలలో హిందోళం, మలయమారుతం, దేశ్, ఫరజు, పటదీప్, చారుకేశి, పంతువరాళి, నాటకప్రియ,విజయానంద చంద్రిక, సింహేంద్రమధ్యమం గురించి,  రహస్యం చిత్రం కోసం మాస్టారు కూర్చిన గిరిజాకల్యాణం రాగమాలికల గురించి మిత్రులు చంద్రమౌళిగారు [...]
హనుమంతుని వేదాంత కథJuly 24, 2014   [surya  daily]ఒక రోజు శ్రీ రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా.దేహ,జీవ ,పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు అని కోరాడు .అదే శిరోధార్యంగా భావించిన పరమ భక్త శిఖామణి మారుతి శ్రీ రామా ! వేదాంత రహస్యము తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మను వేరువేరుగానే భావించాలి .దేహ [...]
శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయోధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనఃగదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిఃశరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయఃAll pervading Vishnu, embraced and surrounded by SrI, elder and guru of moving and unmoving, the subject matter of Vedas, the witness of minds, ever purified, the purifier, annihilator of daemons of darkness, of lotus eyes, holder of mace, conch shell and the discus, wearing amazingly pure garland of flowers, of established brightness, one who gives refuge and protection to seekers, lord of the worlds, kRSNa, be visible to / the subject matter of my (worldly) eyes. For full kRshNAsTakam: [...]
నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే || అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.  వివరణ : సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు.  ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు.  ఆమె శంఖచక్రగదాహస్త అయి, [...]
నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం | ప్రపద్యే వేకంటేశాక్యం తదేవ కవచం మమ || సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు| ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరి || ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు | దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః || సర్వత్ర సర్వ కాలేషు మంగాంబాజాని రీశ్వరః | పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||                     ఫల శృతి య యేతద్ వజ్రకవచ [...]
తెలుగు పాటల తోట బృందావనమ్మిదిమది పులకరించగాతెలుగు పాటల తోటలో తిరిగి వద్దామాచక్కని తెలుగు -మాటల పూల ఘుమఘుమల తేలి వద్దామా ||;అ ఆ- ల అచ్చులు,అనువైన కుంభము;క ఖ- ల హల్లులు;అందుంచు తీపి సుధ జలములు ||;అక్షరములకు తెలుసు అందించు భావాలు;మనిషి మనసుకు మంచి పాదు చేసేనుమంచి మనసుల మించు ప్రోది చేసేను  ||;కమ్మనైన తెలుగు భాష మనదే కదా!కొమ్మలూగే పువుల పుప్పొడులజల్లులు        [...]
నిరంకుశులైన తెల్లదొరలు నియంత్రించి పాలించిన భరతావనిలో వారి అరాచకాలను నిర్భయంగా ఎదిరించాం. బానిస బ్రతుకు కన్న మరణమే శరణమనుకున్నారంతా. అందరు ఐకమత్యంతో సన్నిహితులను సంఘటపరచుకుని క్రమశిక్షణతో పోరాడినందుకు ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరి కళ్ళలోను కొంగ్రొత్త ఆశ పొడచూపింది. అయితే ఇంత కష్టపడి తెచ్చుకున్న స్వరాజ్యపు విలువలను విస్మరించాం అందరం. [...]
మార్క్సిస్టు దృక్పథంతో కలం పట్టిన రచయిత్రి రంగనాయకమ్మగారు. ఆమె తాజా పుస్తకం ‘తత్వశస్త్రం, చిన్న పరిచయం‘. ఎవరికీ అర్థంకాని ఓ జటిల శాస్త్రాన్ని తేలికపాటి చిన్న పదాల్లో అతి సామాన్య ప్రజలకు ఈ పుస్తకం ద్వారా చేరువ చేశారు. ప్రకృతినీ, సమాజాన్నీ అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన శాస్త్రమిది. మార్క్స్, ఏంగెల్స్ లను ప్రభావితం చేసినవాడు … Continue reading →
దాస్యశృంఖలాలను తెంచుకున్న జాతి స్వతంత్రపతాకాన్నెగురవేసిన శుభదినం .అందరికీ శుభాకాంక్షలు
అది 1982  టి టి దే సంస్థ స్వర్ణజయంతి కి తయారవబోతూంది షేక్ మస్తాన్ వలి  అనే సాయబుగారు గుంటూరు జిల్లావాసి  స్వామి భక్తుడు  స్వామికోవెలలో దర్శనమునకువెళ్లి అర్చకుల వద్ద తన వొక చిన్న కోరిక వెలిబుచ్చేడు  అర్చకులు విబ్రమం చెంది కార్యనిర్వహణాధికారి వద్దకు పంపేరు వారు లోపల సభ్యులతో చాలా వ్యవహారములలో  నిమగ్నమయిన సమయం లో వొక సాయబుగారు  వారిని కలవడానికి [...]
మన నిత్యజీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి సంఘటనలు యాదృచ్చికమో లేక కాకతాళీయమో అయ్యొండొచ్చు.కాని మనలను చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ఇలాంటి రెండు సంఘటనలు నా జీవితంలో జరిగినవి చెప్తాను.ఈ మధ్యే అంటే 10 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన.రాఘవేంద్రస్వామి వారి శ్లోకం"పూజ్యా రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ| భజతాం కల్పవృక్షాయ [...]
 కలియుగ ప్రత్యక్ష దైవం ఆపదమొక్కులవాని సన్నిధిలో మరో అద్భుతం జరిగింది. భగవంతునిపై నానాటికీ క్షీణిస్తున్న భక్తి  విశ్వాసాల ను నిలుపుకునే అవకాశం ఈలీలద్వారా స్వామి లోకానికి ఇచ్చారు.  లండన్ లో నివసిస్తున్న దీపక్ అనే పుట్టూమూగ కుర్రవాడు  స్వామి సన్నిధిలో గోవిందనామస్మరణ చేసి   అబ్బురపరచిన విషయం నిన్న శనివారం అన్ని చానల్లు, ఈరోజు అన్ని పత్రికలు ప్రముఖంగా [...]
చిత్రం:     లక్ష్మీ కటాక్షం (1970) రచన:     చిల్లర భావనారాయణ  సంగీతం:  ఎస్.పి.కోదండపాణి గానం:     ఘంటసాల జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా! అందరికీ వరలక్ష్మి శుభాశీస్సులు Thanks to Krishna Vasishta for uploading the video to You Tube ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా! శ్రీమన్మహా సర్వలోక ప్రవృద్ధి 
మితృలు చల్లా  పెంచలరెడ్డిగారు ప్రస్తుతం. స్టేట్ మైక్రోలెవెల్ ఇరిగేషన్ ప్రాజక్ట్  లో డైరెక్టర్ గాఉన్నారు. వీరు గతంలో నెల్లూరు జిల్లపరిషత్ సి.ఏ.వో. గా ఉన్నప్పటినుండి పీఠం లో  ప్రతిష్ఠాకార్యక్రమసమయంనుండి పలుకార్యక్రమాలలో తమవంతుగా సహకారం అందిస్తూ వస్తున్నారు. అన్నపూర్ణభిక్షాశాలనిర్మాణం లో ఉపయోగించమని పదివేలరూపాయలను సమర్పించారు. ఈమాసం లో నిర్మాణం [...]
రచన: ఆది శంకరాచార్య నారాయణ నారాయణ జయ గోవింద హరే || నారాయణ నారాయణ జయ గోపాల హరే || కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ || 1 || ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || 2 || యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || 3 || పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || 4 || మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || 5 || రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || 6 || మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || 7 ||
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు