సంచిక పత్రికలో ప్రచురించబడిన హాస్య కథ.. వదిన - వంటల షో
కాజాల్లాంటి బాజాలు-14-పాఆఆపం
'మాస్తి కన్నడిగులు ఆస్తి' అని కర్ణాటకలో ఒక వాడుక. మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జన్మించిన రెండు నెలల తర్వాత మైసూరు సంస్థానంలోని తమిళ బ్రాహ్మణ కుటుంబలో జన్మించిన మాస్తి వేంకటేశ అయ్యంగార్ కి ఆధునిక కన్నడ కథా రూపశిల్పిగా పేరుంది. 'చిక్కవీర రాజేంద్ర' నవలా రచనకు గాను ప్రతిష్ఠాత్మకమైన 'జ్ఞానపీఠ' బహుమతిని పొందారు. కన్నడ ప్రభుత్వం మాస్తి పేరిట ఒక సాహిత్య అవార్డుని [...]
ఏ సచ్ హై యా సప్నా...మే 26, 2000.రాత్రి మూసీశర్మ ను కలిసి నల్లకుంట నుండి ఇంటికి వెళ్తున్నా. చార్మినార్ బస్ ఎక్కి ఎంట్రెన్స్ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో ఒక పక్కగా కూర్చున్నా. ప్రశాంతంగా ఉన్న నాలో .. తక్షక్ సినిమాలోని .. ఔర్ దూర్ కహీఁ రోషన్ హువా ... ఏక్ చెహెరా... అన్న పాట చరణం మాటిమాటికీ గిరికీలు కొడ్తున్నది.బస్ ఫీవర్ ఆస్పత్రి దగ్గర ఆగింది. ఇద్దరెక్కారు. తరువాత ఎక్కినవాడు ఫుట్ బోర్డు [...]
సాహిత్య అకాడమీ చేస్తున్న మంచిపనుల్లో ఒకటి 'భారతీయ సాహిత్య నిర్మాతలు' అనే సిరీస్ లో ప్రముఖ రచయితలు, రచయిత్రుల మోనోగ్రాఫ్స్ వెలువరించడం. ఈ క్రమంలో వచ్చిన పుస్తకం విఖ్యాత రచయిత కె.యెన్.వై. పతంజలి ని గురించి కథా, నవలా రచయిత చింతకింది శ్రీనివాసరావు చేత రాయించిన మోనోగ్రాఫ్. పతంజలి పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడే కాక, పతంజలి వీరాభిమానీ మరియు ఆ పరంపరకి [...]
"సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచ స్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు.." అంటారు సుప్రసిద్ధ కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య (ఎస్. ఎల్) భైరప్ప తన నవల 'ఆవరణ' కి [...]
మూడున్నర  దశాబ్దాల పాటు అప్రతిహతంగా కథలూ, సాహిత్య విమర్శా చేసిన రచయిత ఉన్నట్టుండి బ్రేక్ తీసుకోడంలో విశేషం లేదు. కానీ, ఆ విరామం పుష్కర కాలం పాటు సాగడమూ, అనంతరం కలంపట్టి ఒకే ఏడాదిలో ఏకంగా 22 కథలూ, వంద వ్యాసాలూ రాసేయడం మాత్రమే కచ్చితంగా విశేషమే. 'విహారి' అనే కలంపేరుతో ప్రసిద్ధులైన ఆ రచయిత పేరు జె.ఎస్. మూర్తి. ఒకే ఏడాది (2007) లో రాసిన 22 కథల నుంచి 15 కథల్ని ఎంచి 'కొత్తనీరు' [...]
తెలుగు రంగస్థలంతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికీ కూడా స్థానం నరసింహారావుని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. "మీరజాలగలడా నా యానతి, నటవిధాన మహిమన్ సత్యాపతి" పాటని జ్ఞాపకం చేస్తే చాలు, సత్యభామ ఠీవీ ఆ వెనుకే ఆ పాత్రకి రంగస్థలం మీద ప్రాణం పోసిన స్థానం నటనా గుర్తొచ్చేస్థాయి. ఆయన నాటకాలని నేరుగా చూసిన వాళ్లకి మాత్రమే కాదు, వాటిని గురించి పరోక్షంగా విన్నవారికి కూడా [...]
చాసోకి శిష్య సమానుడూ, 'ఓన్లీ పతంజలి'కి గురు సమానుడూ అయిన ఉత్తరాంధ్ర కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు. రాసిన కథలు నాలుగు పుంజీలకి మించకపోయినా, వాసికెక్కిన కథలవ్వడం చేత అనేకానేక కథా సంకలనాల్లో చోటు సంపాదించేసుకున్నాయి. కథలన్నీ విజయనగరం నేపథ్యంలోనూ, వాటిలో సింహభాగం క్షత్రియ కుటుంబాల్లోని పాత్రలతోనూ సాగుతాయి. 'దివాణం సేరీ వేట,' 'కుక్కుట చోరులు' తో పాటుగా నాకిష్టమైన మరో [...]
ముగ్గురు రచయితలు కలిసి ఓ గొలుసు నవల రాశారు. ఆ రచన 'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా వచ్చింది, ఇప్పటికి సరిగ్గా యాభయ్ ఏళ్ళ క్రితం. దయగల ప్రచురణ కర్తలు ఓ రెండేళ్ల క్రితం ఆ నవలని మళ్ళీ ప్రచురించారు, నాటి మరియు నేటి పాఠకుల కోసం. నవల పేరు 'ఇడియట్.' రాసిన ముగ్గురూ సాహిత్య జీవులే కాక వేర్వేరు రంగాల్లో పేరు సంపాదించుకున్న వాళ్ళు కావడం విశేషం. పత్రికా సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య [...]
కుక్క తప్పిపోయింది(కథ)ఫోన్ గణ గణ మోగింది !జ్యోతి పరుగు పరుగున వెళ్లి ఫోన్ అందుకుని “హలొ...” అంది ఆదుర్దాగా."నమస్కారం అండి" అట్నుంచి ఎవరిదో గొంతు !"నమస్కారం. ఎవరు?”"మీరు కుక్క తప్పిపొయింది అని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా!"“అవును. కానీ అది కుక్క కాదండీ. టామీ. మా ప్రాణం....”“...”“...టామీ మా కన్న కూతురు కంటే ఎక్కువండీ. అది కనపడకుండా పోయినప్పటి నుంచీ నాకూ మావారికీ నిద్రాహారాలు [...]
   కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది  ఉన్న  వీడియో!దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను.  ‘ఇళయనిలా  పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో  ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది.  సినిమా పేరు ‘మధుర గీతం’.     వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా అనూహ్యంగా , అప్పటికప్పుడు జరిగిన [...]
దీర్ఘమైన చలికాలం ఒంటరిగా గడిచింది. ముఖ్యంగా నాలాంటి పన్నెండేళ్ళ అబ్బాయికి.  మా నాన్నగారి హఠాన్మరణం నాలో రగిలించిన దుఃఖ జ్వాల ఆరనే లేదు.  ఆయన మరణించి రెండేళ్ళవుతూంది.  మా అమ్మ అంతకు   మునుపే ఆయన నుండి విడిపోయి పాత కార్ల వ్యాపారం చేసే ఓ పంజాబీ పెద్దమనిషిని వివాహం చేసుకోవడం కూడా పెద్ద దెబ్బ నాకు.  మూడు నెలల నిరాసక్త శీతాకాలం ముగిసాక షింలా లోని మా బోర్డింగ్ [...]
సొగసు చూడ తరమా?....... ఈ కృతి ఆణిముత్య0!అమ్మాయి తిన్నగా వెలుతూ.....కాలి పట్టీలు గడ్డి మొక్కకు తగులుకొని, కాలు చిక్కుకు0దనుకొ0డి.... కొ0చె0 చిరు కోప0గా , వ0గి కురులు సవరి0చుకొని, చిక్కు విప్పుతు0ది కదా, అప్పుడు .....ఆ సొగసు చూడ తరమా?పిల్లలు స్కూలుకి వెల్లే ము0దు, దొ0గ ఎత్తు వేస్తున్న చ0టివాడిని , సిగమొలతోనే, నీటి కు0డీ పక్కనే నీళ్లు [...]
                       అక్షర భావాలను మెరిపించి మెప్పించిన " వాన వెలిశాక..."         సాహిత్యం, కళారంగాలలో విశిష్ట సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించినా పరిచయం అక్కర్లేకుండా సామాన్యునిగానే అందరికి 'సు'పరిచితులు కళారత్న బిక్కి కృష్ణ రాసిన వా"న వెలిశాక..."    చెదిరిన రంగుల కల కవితలో గద్దదలను తరిమేసి కాకులకు పట్టం కట్టడం, ఏడాదికోపాలి కలలు ఎండమావులని  పండుగలు చేసుకోవడం [...]
ఆ ఉదయంపొగమంచు వేసినిన్ను మాయం చేసిందిబ్రహ్మనింపిన ఆదినాదంభానుడి వెలుగుకిరణంఆ ఉదయంపొగమంచు వేసిదోచివేసిందితెలవారిందినిన్నటి వెలుగుపులుగుఈనాడు బల్లెంలాగుండెల్లో దిగిందివెలుగులో నిశీధివెచ్చదనంలో అతిశీతలస్నిగ్ధతనీ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోమారుమోగిన శృతిలయలుఆగితే నిశ్శబ్దపుమౌనం చెవులకుచిల్లులు పెడుతుందిఆ ఉదయంపొగమంచు వేసినిన్ను మాయం చేసిందిఆ మంచుపొర [...]
నచ్చిన, నచ్చకున్న - సుత నచ్చిన వానికి కట్టబెట్టి, తానిచ్చయె తీరనందులకు నించుక దూరము నుండు తండ్రినిన్మెచ్చు జగంబు! కాని ఇటు మీరిన ద్వేషము తోడ అల్లునిన్మ్రుచ్చులతో వధించుమను మూర్ఖ పిత న్నురి దీయగావలెన్!ప్రణయ్ హత్యోదంతాన్ని నిరసిస్తూ ...- డా. ఆచార్య ఫణీంద్ర
ప్రతి వినాయక చవితికి కొంత కాలం ప్రత్యెక వ్యాసాలను వ్రాశాను. ఒకటి రెండు సంవత్సరాలు వ్రాయలేదు. ఈ సంవత్సరం, వ్యాసం వ్రాయనవసరం లేకుండా ఒక చక్కటి వీడియో దొరికింది. వెర్రి మొర్రి భక్తితో వినాయకుడు ఎంతగా ఆవేదన చెందుతున్నాడో, ఈ వీడియోలో చక్కగా వ్యక్తపరిచారు. ఈ వీడియో చూడటమే కాదు, అందులో చెప్పిన విషయాల గురించి ఆలోచించి,  వినాయక చవితి పండుగను సవ్యమైన పద్ధతిలో జరుపుకుంటే [...]
ఒంటి చెవితోడ విను - విన నోపినంత!ఒంటి చేతితో కార్యంబు లొనరజేయు!ఒక్క చేయి, చెవి మొబైలు కొప్పజెప్ప -అంగ వైకల్య మబ్బె నే డందరి కయొ!!
                                   జ్ఞాపకాల ప్రేమ పొంగుల వరద గోదారి ఈ గుండెల్లో గోదారి...!!        మాడిశెట్టి శ్రీనివాస్ మనసుని పుస్తకంగా మలచి అక్షర నివేదనగా అందించిన ఈ " గుండెల్లో గోదారి.."  మనతో పంచుకున్న అనుభూతులను మనమూ ఆస్వాదిద్దాం.       చివరి మజిలీ వరకు మదిలో భయంగా దాచిన భావాలను ఎంత ప్రేమగా చెప్పారంటే " నా గుండెల్లో పవిత్రంగా దాచుకున్న పాదముద్రలే నీవైనప్పుడు నువ్వెక్కడుంటే [...]
రాష్ట్ర మందు గల్గు ప్రజలందరి చూపుమెరుగుపరిచి, ఎంతొ మేలు గూర్చు"కంటి వెలుగు" పథక కర్తకు జోహారు!ముఖ్యమంత్రి దెంత ముందు చూపు!!
విమానం మోతవరంగల్‌ ఎ.వి.హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ అమితాబచ్చన్‌లా సన్నగా, ఆరడుగుల ఎత్తున్న ఓ తెలుగు టీచర్‌ వుండేవారు. తెల్లని పంచె కట్టుకుని, పొడుగు చేతుల కమీజు వేసుకుని, నుదుట నిలువు నామం దిద్దుకుని చక్కగా పెళ్లికొడుకులా తయారై స్కూల్‌కి వచ్చేవారు. పాఠాలు కూడా అరటి పండు వొలచి చేతిలో పెట్టినట్టు బాగా చెప్పేవారు. అంత సాత్వికంగా కనిపించినా ఆయనంటే చాలామంది [...]
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి  వెలుగు నీడలు (1961) సినిమా కోసం "శ్రీ శ్రీ" గారు రచించిన ఈ పాట ఆనాటి ఆపాత మధురాల్లో ఒకటి.ఇదే ట్యూన్ తో ఈ పాట హిందీలో కూడా ఉంది "Naya Sansar (1959)" సినిమాలో "చందా లోరియా సునాయే" అనే జోలపాట.. చాలా బాగుంటుంది.నాకు ఈ హిందీ పాట వరకే తెలుసు.బ్లాగర్  "నీహారిక" గారు ఇదే పాట తమిళ్,గుజరాతీలో కూడా ఉందని చెప్పారు.అన్ని పాటలు కలిపి ఒకేచోట ఉంచితే [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు