కాలేజ్ నుండి రూమ్ కి వచ్చిన తర్వాత కూడా నాకు కావ్య  మాటలే గుర్తొస్తున్నాయి.హేమంత్ తో ఇప్పుడెలా మాట్లాడాలి? ఏమి మాట్లాడాలి? కావ్య ముందైతే ఒప్పుకుని వచ్చాను కానీ ముందుకెలా వెళ్ళాలో అర్ధం కావటం లేదు. మొత్తానికి ఇప్పుడు నా ఆలోచనంతా హేమంత్ చుట్టూనే తిరుగుతుంది. వాడు ఎటు వెళ్తున్నాడు,ఏమి చేస్తున్నాడు అని వాడినొక నీడలా ఫాలో అవ్వటమే పనిగా పెట్టుకున్నాను.ఆ పనిలో [...]
మనసు మూగదైన తరుణాన జనని బిడ్డల ఆక్రోశము ఆలకించలేక మనకంటూ ఏది లేదని తలపోస్తూ జన పదంలో సమిధలమైనందుకు నిట్టూర్చుతూ కనలేని స్వప్న సౌధాలను కావాలంటూ నినదించే మది హోరులో కొట్టుకుపోతూ రానని మొరాయిస్తున్న బంధాలను వెనకేసుకొస్తున్న ఆత్మీయతలను తాన తందానని చెక్కభజన చేస్తున్న సహవాసాలను వెనకటింటి గుమ్మం నుండి దాటేస్తున్న కొత్త తరం మనమందరమూ ఒకటేనని జాతీయ [...]
కలల దొంతరలు..కనుమరుగౌతున్నవేలచీకటి దారుల్లో దిక్కు తోచనపరిగెడుతున్నాజ్ఞాపకాల ముళ్ళులు గుచ్చుకొంటున్నా ఎండిన పువ్వు శిధిలాల్లోకవిత ముసుగులో ఒదిగిననిలకడలేని నిజాలు తోడు రాలేని వసంతాలు...కన్నీటి తెరల మధ్యగా..ఆల పించిన మేఘమల్హరి..చెవులకు చేరేలోపే..జ్ఞాపకం కరిగి జారిపోయింది ..తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.
WALT WHITMAN—SONG OF MYSELF (1891 edition)పచ్చిక అంటే ఏమిటి? చేతుల నిండా పట్టి నాకు తెచ్చిస్తూ ఒక బిడ్డ అడిగాడుఎలా ఆ పిల్లవాడికి జవాబివ్వగలను?....వాడికి తెలిసినదాని కన్నా నాకు అదనంగా యేమీ తెలియదుఇది ఆశాజనకమైన పచ్చని పదార్థంతో నేసిన నా స్వభావానికి సూచిక అనుకుంటున్నానులేదా ఇది ప్రభువు చేతిరుమాలు అనుకుంటున్నానుమూలల్లో ఎలాగోలా సొంతదారు పేరు కలిగి,మనము చూసి గుర్తించి, ఎవరిదో [...]
అల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలోరాత్రి మరకల్ని కడుక్కున్న మరో ఉదయం ఎర్రగా తడిసిన మందారంలా, నిర్మలంగాబాహ్యాకాశంలో బరువుగా పూసింది కలల కౌగిలిలో వెలిగి ఆరినకంటి కాగడాల మధ్యవీర తిలకం దిద్దిన కాంతి నల్ల కాలాన్నీ కాళ్ళకు కట్టినాతొపాటు బారంగా లాగేస్తున్నాయి దరిలేని తీరాలు, తీరని దాహాలుఅలుపెరుగని అలల మధ్యఊతమిచ్చే మనస్సు కోసంఎదురు చూపులతో.. [...]
పగలు ఆ స్తంభం తాలూకు కదలికలుండవునిలువెత్తు శిలలా నిలుచున్న నీడలా నిశ్శబ్దం గా,పొగమంచు లో పరుగుపెట్టే ప్రపంచం లో ఒంటరిగా. విసుగెత్తని గాలులు అక్కడక్కడే దొర్లుతాయిచీకటి కమ్ముకొచ్చే సమయాల్లోపరిసరాల్లో నిదానం మొలుచుకొచ్చిదీపపు వెలుగులోకి దూసుకువస్తుంది.స్తంభం లో చలనం వస్తుంది-రెక్కలు రాల్చుకు ఒరిగే ఉసుర్లు ఉండవు కానీ,మంచు తునకలు సెగకి కరిగి [...]
పాపాయి  మంచి లీడరు ! మహానటి సావిత్రి గారి అభిమాని . ఈరోజు మిద్దెపైన ఆడుకుంటూ వున్నారు పిల్లలందరూ. నేనూ అక్కడే వున్నాను . నా మొబైల్ లో ఏదో చూస్తూ పాపాయి  పక్కనున్న అంజూ ని అడిగింది అంజూ నేనెలా వుంటాను ? అంజు: సావిత్రి లాగా అక్క.... రేయ్  హనుమోష్ నువ్వు చెప్పురా నేనెలా వుంటాను ? హనుమోష్ ముద్దుగా ,మందంగా మాట్లాడుతాడు . వాడు కూడా సావిత్రి లాగా ... అన్నాడు పాపాయి :ఊ ... ఇదంతా [...]
శశిధర్ పింగళినా కిప్పటికీ గుర్తే - ఆనాడు తడబడుతూ .. తలొంచుకునిమెట్టినింట పాదం మోపిన - క్షణం – బిడియంతో - బెరుకు బెరుగ్గా చూసిన – చూపులూ – ఈ చిన్ని హృదయానికి – రాణినిచేస్తానని ఇచ్చిన మాటా – అన్నీ గుర్తే – కానీ చిత్రంగా కాలం కాలుకడిపి – ఓ పదేళ్ళు ఇవతల పెట్టేసరికి – ఇలాతలంపట్టనంత – ఆశ్చర్యం వేళ్ళమధ్య నీళ్ళలా జారిపోయినకాలంతో పోటీపడిందో-ఏమో  అప్పుడు పెట్టిన – ఆ లేత పాదం [...]
1. కిటికీ పైకి లేపానుకాంతి ఈ కవితపై వాలింది.ప్రముఖ వీధిలో ఒక డాబాపై హింసించబడ్డ అతని పేరు మీద వాలింది.విరిగిన అతని కాలుకి ప్రతీకారం తీసుకొంటానని సూర్యకాంతిపై ప్రమాణం చేస్తున్నాను.2. కిటికీ పైకి లేపానుకాంతి ఈ వాక్యాలపై వాలింది(అసంపూర్ణ వాక్యాలవి)ముఖ్యంగా ఓ రెండు పదాలపై వాలిందివాటిని చెరిపేయాలి.ప్రముఖ వీధిలోఒక డాబాపై హింసించబడ్డఅతని పేరు అది.అతని సలహా [...]
1910 లో జరిగిన ఘటనలు అప్పటి పరిస్థితులకు అప్పటిలో జరిగిన వాస్తవాలు ..ఓ గొప్ప సాహితీ వేత్త "చలం" జీవిత విషేషాలతో అయన ఆత్మ కధ చదువుతున్నా నోచ్...మొత్తమ్మీద ఇన్నాళ్ళకు మళ్ళి ఓ మంచి పుస్తకం చదువుతున్నా..బుక్ మొత్తం చదివాక ఆ విషేషాలు మీతో పంచుకుంటాను  
పాపాయి తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టి దాదాపు ఆరు నెలలు అయింది . ఈ వారం రోజులుగా రోజుకు మూడు ఆటలు చొప్పున పాత సినిమాలు చూస్తూ వుంది . గోదారీ గట్టుందీ ,ఔనంటే కాదనిలే ,బొమ్మను చేసి ప్రాణము పోసి ,నీవు లేక వీణా ... వంటి పాటలు వింటూ వస్తూ వుంది . అందుకనేమో ఈ రోజు పాట  రాస్తానమ్మా అని చెప్పి ఈ పాట రాసింది . ప్రకృతి   చల్ల చల్లని గాలి వీస్తుంటే  నేను చెట్లు క్రిందట బానిసలా [...]
ఏదో భయం!నేను నేను కాకుండా పోతానేమోననినన్ను నన్నుగా నిలవనీయని నీజ్ఞాపకాలు ఏ భావోద్వేగంతోనోద్రవించి పోతూనే ఉన్నాఎక్కడో ఎదో అలజడిఏదో భయం!నన్ను నిత్యం వెంటాడుతూనే ఉందిఆ కల్లోల కాసారంలోనా కవితలన్నీతక్తపు ముద్దలై నన్ను నేను తుంచుకునేపశువులా మార్చేస్తున్నాయి నాలోనుంచి నేను బయటపడినన్ను తగుల పెట్టుకుంటానేమో అనిఏదో భయం!ఎంతదూరం పరుగెత్తినాఏకాంతమనేది [...]
కోయిల గొంతులో రక్తజీరజాతిని నిలుపుకోవటానికిఇదే చివరి పిలుపన్నట్లు.పచ్చదనంతో పోటెత్తిన పత్రాలుసూర్యుడ్ని పీల్చుకొంటాయిరేపుండదన్నట్లు.పువ్వులన్నీ పోటీపడతాయితుమ్మెద చుంబనానికైఈ రోజే ఆఖరన్నట్లు.గాలిపటం వెనుక ఆ పిలగాడువడివడిగా పరుగెడతాడుఅదే ఈ లోకపు చివరిదైనట్లు.చేతికందే ప్రతీక్షణమూకాలం అల్పత్వాన్నిగుర్తుచేస్తూంటుంది.బొల్లోజు బాబా
          ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు.   ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో  కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ.  ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.            ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు [...]
[శశిధర్ పింగళి]------------------ఒకప్పుడు వేయించిన విత్తనాల్లా విడివిడిగా వున్నవాళ్ళు కూడా ఇప్పుడు పాకంలోపడ్డ పప్పుగింజల్లా అతుక్కుపోతున్నారు...మనుషుల్ని దగ్గరచేసే మంత్రమేదో – తనకే తెలిసినట్లుచలి చెలరేగిపో తోంది !!
[శశిధర్ పింగళి]తీరంవెంబడి ఎంతనడిచినా - ఇంకాతీరని కోరికేదోబలంగా వినిపిస్తూనే వుంది!ఇప్పుడిప్పుడేఅర్దమవుతోంది - నువుసముద్రాన్ని చీల్చుకుని వస్తుంటేకర్తవ్యం బోధపడుతోందినిన్ను దర్శించాలంటేతీరికలేకుండా నడవటం కాదునిలకడగా నిలబడినిశ్చలంగా చూస్తే చాలని!!
ఇంటికెళ్లటం  ఒక వ్యసనంLSD ట్రిప్ కోసం పక్షులన్నీ సాయింత్రానికల్లాఠంచనుగా గూళ్లకు చేరుకొంటాయి.ఇంటికెళ్లలేకపోవటం ఒక విషాదంపెద్దపులిని నమ్మించలేకపోయిన ఆవు కోసం లేగదూడ జీవితాంతం అరుస్తూంటుంది.బొల్లోజు బాబా
నా చైన్ ప్రహసనం అయిన తర్వాత ఇంక మనుషులెవరినీ నమ్మకూడదని నిర్ణయానికి వచ్చాను.మామూలుగా కాలేజికి వెళ్ళోస్తున్నాం .పెద్దమాధవ్, హేమంత్,సోహైల్,దివాకర్ మూడో సంవత్సరం సబ్జెక్ట్స్ కష్టంగా ఉంటాయి కదా ట్యూషన్స్ పెట్టించుకుందామా అని చర్చించుకుంటున్నారు. సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి రకరకాల సబ్జెక్ట్స్ చదివి మానవశరీర భాగాల నిర్మాణము, శరీర అవయవ వ్యవస్థ,వాటి [...]
1.రాలిన పత్రాల్నిలోనికి లాగేసుకొనిపూవులుగా అందిస్తాయితరువులు2.ఏమివ్వాలో తెలీకరెండు పక్కటెముకల్నిఅక్కడ పెట్టినిశ్శబ్దంగావచ్చేసాను3.హింసించే ఈ బరువుల్నివదిలించుకొనిభారరహితమౌదామా?చూడుఆ సీతాకోకచిలుకఎంత తేలికగాఎగురుతోందో!4.నిత్యం నీ స్వప్నాలలోనీతో సంభాషించే అమ్మాయిఈ రోజు నా కల్లోకి వచ్చిముద్దిచ్చిన విషయంనువ్వేనాటికీ స్వప్నించలేవు5.ఒక సంఘటన ముక్కలు [...]
[శశిధర్ పింగళి]-----------------------భూమ్యాకాశాల మధ్యపరుగెత్తీ, పరుగెత్తీఅలసిపోయాను -అనుభవాలను ఆరబెట్టుకుంటూఅనుభూతులను యేరుకుంటూరాత్రంతానిద్దురలేకుండానే గడిచిపోయింది -ఎవరో తలుపు తడుతున్నారు...మళ్ళీ నన్నుతనవెంట తీసుకుపోవటానికిమరో ఉదయం వచ్చినట్లుంది !!------------------
ప్రముఖ కవి శ్రీ ఇస్మాయిల్ పై నేవ్రాసిన వ్యాసం సారంగలోhttp://magazine.saarangabooks.com/2014/12/31/%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D/భవదీయుడుబొల్లోజు బాబా
 "new year is one imaginary mark on time continuum" as a friend wrote...but for me 'Now' is an imaginary point between transcendentally ideal and empirically real. As Eliot said "The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality" - I have a long way to reach that quiet yet!అసలీ కవితకి మూలమైన భావావేశం నన్నింకా సుడులు చుట్టి ఊపుతుంది. అసలు కవితగా వెలికి తేవాలని క్లుప్తత, స్పష్టత సంకెళ్ళలో దాని ఆత్మని చంపేశానా? దెయ్యం పట్టిన మనసులా ఉంది స్థితి. అందంగా ముస్తాబు చేయాలని ముఖం కందేలా దిద్దానేమో. ఇప్పటికి ఇదే నా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు