హనీ...ఏమని వర్ణించను నీ సోగకళ్ళ సోయగాలని...?  పేరుకి మాత్రం  కళ్ళే కానీ నిజానికి అవి...కలల పుప్పొడిని నింపుకున్న కలువ రేకుల్లా ఉన్న వలపు వాకిళ్ళు కృష్ణుని మేని వర్ణాన్ని కాటుకగా అంచులలో అద్దుకున్న వన్నెల పొదరిళ్ళు  లోకంలో ఉన్న శాంతాన్నంతా పోత పోసినంత ప్రశాంతంగా వెన్నెల నడయాడే లోగిళ్ళుఉత్సాహం ఉవ్వెత్తున ఎగసి పడుతూ కులుకులాడే కిన్నెరసాని కిల కిలల పరవళ్ళు కోడె [...]
అయినా 'మేరా భారత్ మహాన్'ఇక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం జనాలను విడతీయాలని చూస్తారు. టెర్రరిస్టులు మాత్రం తమ ఉగ్రవాద చర్యలతో  ప్రజలను సంఘటితం చేస్తారు.వన్ వే (ఒకే వైపు వాహనాలు వెళ్ళడానికి అనుమతి వున్నదారి) దాటడానికి జనాలు రెండు వైపులా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్తితి ఈ దేశంలోనే కనిపిస్తుంది.ఎవర్ని చూసినా ఏదో హడావిడిలో వున్నట్టు కనిపిస్తారు. కానీ [...]
రకరకాల రోగాలూ -సెక్సు బలహీనతలూడా. జి వి పూర్ణచందులైంగిక పరమైన ఇబ్బందుల్ని చాలామంది నరాల బలహీనతగా భావిస్తారు. శరీర శక్తికి, మానసిక శక్తికీ సంబంధం లేని శారీరక బాధల్ని రోగులు నరాల బలహీనతగా డాక్టర్లదగ్గర చెప్పుకుంటారు. ఆ ఒక్క మాటకి వైద్యులు చాలా విషయాలు అర్థం చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా లైంగిక విషయాలను సూటిగా చెప్పుకునేందుకు తగిన భాష మనకు లేదు. [...]
"నాన్నగారండీ!...... నాన్నారూ! ......నాన్నా!..... ఒరేయ్ నాన్నా!..... ఏరా నాన్నా!...... ఏం గురూ ఏంటి సంగతి మీ ఆవిడ అదేరా మా అమ్మ ఎలావుంది ? "
ఈ ఏడాది జూన్ రెండో తేదీన మునుపటి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది చారిత్రిక సత్యం.నిన్నటికి నిన్న ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో జరిగిన మిక్సడ్ డబుల్స్ లో భారత జోడీ సానియా మీర్జా, సాకేత్ మైనేని కలిసి మన దేశం ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చారు. సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్. సాకేత్ విశాఖ కుర్రవాడు. వీరిద్దరూ కలిసి [...]
లక్ష రూకలు.వెయ్యి రూపాయలు..ఏది విలువైన మొత్తంఒక డాలరు.ఒక రూపాయి.రెంటిలో దేని విలువెక్కువ?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియని వాళ్లెవరైనా ఉంటారా? నిరక్షరాస్యులైనా ఠక్కున సమాధానం చెప్పగలిగే ప్రశ్నలివి. ఎందుకంటే నోట్ల విలువ నోట్లపైనే కాదు, నోటిపైనా ఉంటుంది కనుక. ఈ కాలంలో డబ్బు విలువ తెలియని వాళ్లెవ్వరు?ధనం విలువ జనానికి బాగాబాగా తెలుసు. అందుకే -ఇలాంటివి చిక్కు [...]
గీతా రామస్వామి గారు తెలుగు నుంచి ఇంగ్లిష్ లోకి అనువాదం చేసిన దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథాత్మక నవల Life in Anantaram (ఊరు వాడ బతుకు) ఇప్పుడు Kinige dot com  వారి వద్ద కూడా లభిస్తుంది.  ఈ క్రింది లింక్ ద్వారా Life in Anantaaram పీడీఎఫ్ పుస్తకాన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొవచ్చు:http://kinige.com/book/Life+in+Anantharamఅనువాదం లోని కొంత భాగం మీకోసం ఇక్కడ ఫొందుపరుస్తున్నాం:…         …         [...]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొందరు ఆంధ్ర బహుజన మేధావులు, రాష్ట్రం విడిపోతే, రెండు రాష్ట్రాల లోనూ అగ్ర కుల ఆధిపత్యం తగ్గిపోతుందనీ, బహుజనులు అధికారానికి దగ్గరవుతారనీ, ఓ వాదన చేశారు. “ఈ వాదన కి ప్రాతిపదిక ఏమిటబ్బా?”, అని అప్పట్లో అనుకొని, “అంత మేధావులు చెప్పారంటే నిజమే అయి వుంటుంది లే!”, అనుకొని నా ఆలోచనలను నొక్కేసుకొన్నాను. వాస్తవం గా , 23 జిల్లాల పెద్ద రాష్ట్రం [...]
'రాత్రి రైల్లో నిద్ర పట్టక చాలా అవస్థ  పడ్డాను' ఏకాంబరం చెప్పాడు.'ఎందుకని''ఖర్మ! పై బర్త్ దొరికింది' 'కింద పడుకున్నవాళ్ళని అడక్కపోయావా?' 'ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా! అడగడానికి కింద బర్తుల్లో ఎవరయినా వుంటే కదా! రైలంతా ఖాళీ!''ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'ఆ కబురు విన్న అతడికి  మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో [...]
దేశంలో సంపన్న సెలబ్రిటీ షారూఖ్ ఖాన్ ఇల్లు మన్నత్  ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఎందుకంటే ఆ ఇంటి ఖరీదు అక్షరాలా రెండువేల కోట్ల రూపాయలు. ఆయన సినిమా రెండువందల కోట్ల రూపాయల వసూళ్ల రికార్డు సృష్టించింది. తన ఆదాయానికి తగ్గట్టు ముంభైలో రెండువేల కోట్ల రూపాయల ఖరీదైన ఇంటిలో నివసిస్తున్నారు. అదే ముంబైలో ఒకప్పుడు హిందీ సినిమా రంగాన్ని పాలించి, తన సినిమాల ద్వారా ఇప్పటికీ [...]
బ్రహ్మం చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. మనుషుల్లో ఇంత సంతోషం అరుదుగా కనిపిస్తుంటుంది. ఓ హీరో సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పుడు మరో హీరో అభిమానుల కళ్లలో కనిపించేంత సంతోషం అది. ఓ స్వామీజీ శృంగార రహస్యాల వీడియో బయటపడినప్పుడు ఆయన పోటీ స్వామీ కళ్లల్లో కనిపించే సంతోషం అది. డిపాజిట్లు గల్లంతయినప్పుడు గెలిచిన పార్టీ వారిలో కనిపించేంత సంతోషం అది. సంతోషానికి కారణం ఏమిటని [...]
ఓ ముక్కుపద్యం కథడా. జి వి. పూర్ణచందు“నానా సూన వితాన వాసనల నానందించు సారంగమేలానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకన్ దపంబంది యోషా నాసాకృతి దాల్చి సర్వ సుమనః సౌరభ్య సంవాసియైపూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్”          ఇది రామరాజభూషణుడి వసుచరిత్రలో కనిపించే ఒక చమత్కార భరిత పద్యం.రామరాజభూషణుడి అసలు పేరు భట్టుమూర్తి. కృష్ణదేవరాయల కాలానికి అతను చాలా [...]
అధికారం, హోదా, చదువు, డబ్బు, బ్యాంక్ బాలన్సులు ఇవి వ్యక్తుల స్తితిగతులకు కొలమానాలు కావచ్చు. కానీ అవేవీ వారిని ఈ ప్రపంచంలో పెద్దవారిని చేయలేవు. నిజానికి మనం యెంత చిన్నవాళ్ళమో, ఒకరకంగా చెప్పాలంటే పిపీలికాలమో తెలుసుకోవడానికి ఓ చిన్న చిట్కా వుంది. ఆకాశం నిర్మలంగా వున్న రాత్రి డాబా మీద వెల్లకిలా పండుకుని పైకి చూడండి. వేల కోట్ల మైళ్ళ దూరంలో వున్న నక్షత్రాలు మిణుకుమిణుకు [...]
(ఇంకో 'మాత్రమే' ఏమిటంటే 'ఇది' కేవలం అనువాదం మాత్రమే!) భార్య: ఏవిటి ఆఫీసు నుంచి పెందలాడే దిగడ్డారు?భర్త: మా బాసుకి నా మీద కోపం వచ్చింది. గో టు హెల్ అన్నాడు. అంతే! ఇంటికొచ్చేసా! డాక్టర్: మీ తలనొప్పి ఏమైంది ?పేషెంటు: నిన్ననే పుట్టింటికి వెళ్ళింది.మనిషికి నాలుగింటితో అసలు  తృప్తి అనేదే  వుండదు ఒకటి సెల్ ఫోన్, రెండోది కారు, మూడోది టీవీ, నాలుగోది భార్య ఎందుకంటె -ఎప్పటికప్పుడు [...]
"గ్రహరాశులనధిగమించిఘనతారల పథము నుంచిగగనాంతర రోదసిలో...గంధర్వగోళ తతుల దాటిచంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం - 'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట  మళ్ళీ ఈనాడు స్పురణకు వస్తోంది.దీనికి నేపధ్యం అంతరిక్ష పరిశోధనారంగంలో భారత్ తాజాగా సాధించిన అపూర్వ విజయం. 2014 [...]
పిల్లలలకు మంచి చదువు, పెద్ద ఉద్యోగం లభించాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేదు. అందుకోసం -ఏటా రెండు లక్షలు కట్టేసి ఎంసెట్‌తో కుస్తీ పట్టేందుకు కార్పొరేట్ కాలేజీల్లో కుక్కేస్తే సరిపోదు. విద్యార్థులు ఈ పోటీని తట్టుకోగలుగుతున్నారా? లేదా? అన్న విషయాన్ని పట్టించుకునే వాళ్లే లేరు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు అంతులేకుండా పోయింది. దీనిపై కదిలిన [...]
తెలుగు మీడియా కబుర్లు కాదు కాదు తెలంగాణ మీడియా కబుర్లు వారి జ్ఞాన . శూన్యానికి ఈ బ్లోగుపోస్ట్ పరాకాష్ట , ఈ బ్లాగును నడుపుతున్న మేతావులకు నా మాట. మన దేశం లో ఆతంకవాదులు 26/11 జరిపిన దాడి ని కొన్ని జాతీయ టి.వి. చానళ్ళు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపి పరోక్షంగా ఆతంకవాదులకు సహాయపడిన ఘటన దెశ ద్రోహానికి సమానం. అయిన మన భారత ప్రభుత్వం సదరు చానాల్లను నిషేదించలేదు. ఎందుకంటే [...]
" ఊరు వాడ బతుకు " ఆంగ్లానువాదం " Life in Anantaaram " ఉచిత పీడీఎఫ్ దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథాత్మక నవల "ఊరు వాడ బతుకు" తెలుగు పాఠకుల విశేషాదరణను పొందింది. పోలీసు యాక్షన్ పేరిట  ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో జరిగిన సైనిక చర్య ముందరి  తన బాల్య  జీవితం, అనంతారం, సూర్యాపేటల్లో కొనసాగిన తన చదువు, ఆనాటి గ్రామీణ జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం , రజాకార్ల ఆగడాల నేపధ్యంతో  సరళమైన తెలంగాణా [...]
మా వాచ్ మన్ కొండల రావుకి ఇద్దరు పిల్లలు. పండక్కి వాళ్ళ వూరు వెళ్లినప్పుడు వస్తూ వస్తూ ఇంకో 'పిల్లాడిని' వెంటబెట్టుకొచ్చాడు. పల్లెటూళ్ళో వేళపట్టున కూతబెట్టే ఆ కోడి పుంజు  నిద్ర ఎరుగని నగరంలో ఓ వేళాపాళా లేకుండా కూతపెడుతూ వుంటుంది. బహుశా జెట్ లాగ్ అయివుండవచ్చు. నాకు మాత్రం అది ఎన్నిసార్లు కూసినా మళ్ళీ ఓమారు కూస్తే బాగుండు అనిపిస్తుంది.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు