నికృష్టుడి ఆత్మకథ  -- నికృష్టుడి ఆత్మకథ...కినిగె లంకెనికృష్టుడి ఆత్మకథ -- ఈ టైటిల్ చదవగానే ఇదేంటబ్బా  ఇలా ఉంది  అనిపించింది ప్రివ్యూ చదివాక ఆసక్తికరంగా తోచింది .... వెంటనే పుస్తకం చదివేయ్యాలి అనిపించిందినేను కినిగేకి కొత్త .... స్నేహితురాలి సహాయంతో ఎట్టకేలకు పుస్తకం డౌన్లోడ్ చేసుకోగలిగాను .... అందుకు స్నేహితురాలికి ధన్యవాదములు ఈ ఆత్మకథ లోకి వస్తే .... చదవటం [...]
మొదట్లో శనివారాలు,ఆ తరువాత కొన్నాళ్ళు మంగళవారాలు,ఆ పై కొన్నేళ్ళుగా శుక్రవారాల్లో దాదాపు 14 సంవత్సరాలు ఆంధ్రభూమి దినపత్రిక ఎడిట్ పేజ్ మిడిల్ కాలమ్‌ గా నేను నిర్వహిస్తూ వచ్చిన 'సం.సా.రా.లు' (సంస్కృతి-సాహిత్యం-రాజకీయాలు ) కాలమ్‌ నేటితో పరిసమాప్తమవుతోంది.ఇన్నేళ్ళుగా నాచేత ఈ కాలమ్‌ రాయించిన ఆంధ్రభూమి సంపాదకులు , గౌరవనీయులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారికి,పత్రికా [...]
‘ ‘తల నిటారుగా నిలపలేకపోతున్నా! మెడ వాలిపోతోంది. చెయ్యి విపరీతంగా లాగేస్తోంది’’ అన్నాడు సన్యాసి. ‘‘ఎక్స్‌రే తీయించావా’’ అడిగాడు ప్రసాదు. ‘‘నువ్వు కాంగ్రెస్ వాడివి కాదుకదా! కాంగ్రెస్ పరిస్థితి చెబుతున్నావేంటి’’ నవ్వుతూ అన్నాడు రాంబాబు. ‘‘నీకు నవ్వులాటగా వుందేం?’’ అన్నాడు సన్యాసి. ‘‘ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక, మహాఘనత వహించినదిగా [...]
"‘సమాజంలో ఒక అవసరం, ఒక సందర్భం సాహిత్య సృజనకు హేతువు కావచ్చు. సమకాలీన సామాజిక స్పృహ లేకుండా సార్వకాలిక విలువలకు కట్టుబడి రచనలు చేసేవాడే గొప్ప అని నేనూ అనడం లేదు. కానయితే ఆ అవసరం, ఆ సందర్భం తీరాక ఆ సృజనకారుడు తనను తాను సార్వకాలిక, సమష్టి విలువలవైపు మరల్చుకుని కలం సాగించలేకపోతే చరిత్రలో మహా అయితే ఆ ఒకప్పటి సమయ సందర్భాల ప్రసక్తి వచ్చినపుడు తలుచుకోబడతాడేమోగానీ లేకుంటే [...]
‘‘ ‘ఓడిపోయినవాడు బాహాటంగా ఏడిస్తే- గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడ్చాడని’ ఓ సామెత! సరే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయన్నది వాస్తవం. తమ ఓటమికి కారణాలేమిటని ఓ పక్క సమీక్షా సమావేశాలయితే మరోపక్క ఎవరూ ఏడ్చిపోకుండా ప్రభుత్వం ఏర్పరచడం ఎలా అని గెలిచిన పార్టీ అధినేతల కసరత్తు మొత్తానికి ఓ రకంగా ఇది ‘సమీక్షా కాలం’’ అన్నాడు శంకరం. ‘‘గెలుపులో కూడా ఉద్వేగం ఉంటుందోయ్! అందునా [...]
years ago chiru promised people that he will do the  needful to see the end of congress as a Praja rajyam party president...and after 5 years he done it...as a congress man....
:) ofcourse the tag will be there....but ...
'ఆలులేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడని ఒక సామెత. అలాగ పాపం! రాజకీయ పార్టీల అధినేతలు కొందరు తమదే గెలుపు అనీ, ప్రభుత్వం తామే స్థాపిస్తామనీ ఆశపడుతూ- అప్పుడే తాము ఏర్పరచబోయే మంత్రివర్గం గురించి ‘కేబినెట్ కసరత్తు’లు మొదలుపెట్టారట’’ అన్నాడు ఎగతాళిగా ప్రసాదు. ‘‘అందులో తప్పేముందోయ్! ముందస్తు ప్రణాళికలు మంచివేకదా! ఇవాళ సాయంత్రానికి ఫలితాలు మొత్తం [...]
‘ ‘మొన్నటితో మొత్తానికి ఓ యజ్ఞం పూర్తయింది. ‘ఓ పనైపోయింది బాబూ!’అని నిమ్మళించడానికి వీలయింది’’ అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ సుందరయ్య. ‘‘ఏం ఇంట్లో ఆవకాయ, మాగాయ గట్రా ఏవన్నా పెట్టారా ఏమిటి? తెలుగిళ్ళల్లో పచ్చళ్ళు పెట్టడం కూడా ఓ యజ్ఞంగా భావిస్తూంటాం కదా! ఎలావుంది షూటు? బాగా ఊరిందా’’అన్నాడు నవ్వుతూ ప్రసాదు. ‘‘ఘాటుకేం బ్రహ్మాండంగా వుంది. ఊరిందా అన్నదీ, ఎలా [...]
  నువ్వు వేసినవాడు గెలుస్తాడన్న నమ్మకం అతనికిగానీ నీకుగానీ లేనప్పుడు ఓటేయడం దండగ కదుటోయ్! ఎలాగూ సాంప్రదాయిక పార్టీ అభ్యర్థి ఎవరో మందీ మార్బలం సపోర్ట్‌వల్ల గెలుస్తాడు. నీతి, నిజాయితీగల అభ్యర్థి అని నువ్వనుకున్నవాడు అంత బలగం లేనివాడు అయినప్పుడు నీ ఓటు వృథాయే గదా!’’ అన్నాడు సన్యాసి .‘‘అమ్మమ్మమ్మ! అలా అనకు. అసలు ఆ ఆలోచనే తప్పు. నువ్వు ఓటు వెయ్యడం అంటే నీ [...]
‘‘సినిమా అనేది అయితే దర్శకుడి చేతిలో లేదా హీరో చేతిలో వుంది. అంటే ‘అంతటా’ పెత్తనం అన్నమాట! ఎప్పటికైనా సినిమా రచయిత చేతిలోకి రావాలని శ్రీశ్రీ అభిలషించాడు. అలాగే రాజకీయాలను కూడా సృజనకారులు శాసించగల స్థితి వస్తే బాగుంటుంది కదా!’’ అన్నాడు శంకరం. ప్రసాద్ నవ్వాడు ‘‘అవేవీ జరిగే సంగతులు కావులే! రాజకీయాల్లో మంత్రి పదవుల్లో సాహితీవేత్తలెవరున్నారు చెప్పు. ‘‘పొయట్స్ ఆర్ [...]
  రామరాజ్యం స్థాపిస్తాను’, ‘రామరాజ్యం స్థాపిస్తాను’ అని అధినేతలు అంటూంటారు గానీ, రాముడు సింహాసనం అధిష్ఠించాక, ధర్మం పేరుతో సీతను అడవులపాలు చేశాకే; ఎక్కువ కాలం రాజ్యపాలన చేశాడనుకుంటాను! అధికారంలో వున్నప్పుడు భార్య (ప్రమేయం) లేకపోతేనే, పాలన బాగా సాగుతుందేమో! భార్య సహితంగా పరిపాలన చేయడానికీ, ఒంటరిగా పరిపాలన చేయడానికీ బోలెడు తేడా వుంటుంది కామోసు! అన్న ఎన్టీఆర్‌గారు [...]
    ‘‘పొ త్తు అనగానేమి?’’ అని ప్రశ్నించాడు శంకరం.  ‘‘నిఘంటువు అర్థాల సంగతి చెప్పుకోగలంగానీ ఇవాల్టి రాజకీయ వాతావరణంలో ‘అనగానేమి’అంటే చెప్పడం కష్టమే. ఇద్దరి ఇష్టంతో పొత్తు ఏర్పడుతుందనుకుంటాం గానీ ఇష్టంలేని బలవంతపు పొత్తులూ వుండవచ్చు అనిపిస్తోంది మరి’’ అన్నాడు సన్యాసి .‘‘అదే మరి నా ప్రశ్న కూడానూ. బలవంతపు అన్నాక ఇంక పొత్తు అనేది ఎలా సంగతమవుతోంది, సంభవమవుతుంది [...]
‘‘ఎన్నికల్లో ఎవరయినా పోటీ చేయవచ్చుకదా! మరి రాజకీయాల మీద ఆసక్తితో యువత ఎవరయినా రంగంలోకి దిగచ్చు కదా! ఉద్యోగానే్వషణకు బదులు రాజకీయ రంగప్రవేశం చేయవచ్చుగా’’ అన్నాడు సన్యాసి. ‘‘భలేవాడివే! ఎవరయినా పోటీ చేయవచ్చు అనడంలోనే ‘పోటీ’అనే దానిని సరిగా అర్థం చేసుకోవాలి. ఉద్యోగానికి కోరే క్వాలిఫికేషన్స్ మాత్రమే రాజకీయాలకు వర్తిస్తే ఎప్పుడో ఎందరో పోటీపడేవారు కానీ ఎన్నికల్లో [...]
కాలం అఖండంగా సాగిపోతూ ఉంటుంది.  కానీ తమాషాగా ఒక్కోసారి చరిత్ర పునరావృత్తమవుతూంటుంది.  అఖండమైన కాలాన్ని అరవై సంవత్సరాలుగా విభజించుకుని ‘గణన’ చేసుకుంటున్నాం. అందువల్ల సంవత్సరాది పేరు అరవై ఏళ్లకోసారి పునరావృతమవుతుంది. తాను పుట్టిన పేరిటి వత్సరాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. నూట ఇరవై ఏళ్లు ఎవరు బ్రతకగలరు? అరవై ఏళ్లు జీవించి - పుట్టిన [...]
‘‘ ‘మాకు తగిన బలం వుంది. ఒంటరి పోరుకు మేం సిద్ధం’ అంటూనే ప్రతి పార్టీ, పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతుందంటావ్? పైగా ‘మాతో ఎవరైనా పొత్తుకు వస్తే అభ్యంతరం లేదు మేం మాత్రం అడగం’ అన్నట్లు ఫోజు ఒకటి!’’ అన్నాడు ముఖం చిట్లిస్తూ ప్రసాదు. ‘‘అదే మరి రాజకీయం! దీనినే ‘ఎత్తుగడ’ అంటారు. అన్ని స్థానాల్లో తాము గెలవలేమన్న సంగతి పార్టీలకన్నింటికీ తెలుసు. తాము గెలవగల తావుల పట్ల [...]
జయ నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు..ఏదైనా కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది కాని స్నేహం పాతబడినప్పుడే...ప్రతి కొత్తదనం ఎన్నో పాత జ్ఞాపకాలను, కొన్ని కొత్త ఆశలను ఇస్తుంది. మీకు ఈ నూతన సంవత్సరం కొన్ని పాత జ్ఞాపకాలను, ఎన్నో కొత్త ఆశలను ఇవ్వాలని, మీ పాత ఆశలు కూడ ఈ  సంవత్సరం  లో నిజం కావాలని ప్రార్దిస్తూ… జయ నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు..మీవిసు
పొద్దున్నే ఎందుకో ఈయన గుర్తొచ్చాడు...ఆయన గుర్తుకురావడంతొనే ఈపాట గుర్తొచ్చింది...ఆ పాటవింటే ఆయన వేదన వినిపిస్తుంది ..బాధేస్తుంది.. గగుర్పోడ్స్తుంది...మూలల్లో నిద్రపోయున్న మన లోపలి మనిషిని-ఉంటే మనసును తట్టిలేపటంలో ఆయన సిద్ధహస్తుడు...గోరేటి వెంకన్న గారికి అభివాదాలతోపల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రలకుమ్మరి వామిలో [...]
‘రాజమండ్రిలో అప్పారావుగారు బస్‌స్టాండ్‌కు వెళ్ళి, ఊరెడదామని టికెట్ కౌంటర్‌లో టికెట్ అడిగారట. లోపలి మనిషి ఆశగా ‘‘కాంగ్రెస్ టికెట్ ఇమ్మంటారా సార్!’’ అని అడిగాడట అని చెప్పి శంకరం భళ్ళున నవ్వాడు. ‘‘సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి- పోటీచేయడానికి అభ్యర్థి దొరకని, దారుణ పరిస్థితిలో పడిందనడానికి ఇంతకంటే వేరే జోకేం కావాలి! దిగ్గజాల్లాంటి కాంగ్రెస్ నాయకులు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు