డా.భువన్ సంకలనం చేసిన ఇరవై మంది కథకులు అయిదయిదు కథల - వెరసి వంద కథల, వైవిధ్యభరిత కథాసంకలనం ‘కథానందనం’. గతంలో పదిమంది రచయితల కథలతో ‘తెలుగు కథనం’ వెలువరించిన వారే ఇప్పుడు పది మంది రచయిత్రులు, పదుగురు రచయితల కథలతో ఈ ప్రయోగానికి తలపడ్డారు.  సోమరాజు సుశీల, వాసా ప్రభావతి, వడలి రాధాకృష్ణ వంటి ప్రముఖులతోపాటు ఎండ్లూరి మానస, వడ్లమన్నాటి గంగాధర్ వంటి నవతరం రచయితల కథలున్న ఈ [...]
దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు .  ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు [...]
                 ప్రేమంటే గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకోవటాలు,                               కాఫీ షాపుల్లో కాలక్షేపాలు చేయటమే కాదు                 నీ ధ్యాస మరచి తన ధ్యాసలో పడటం కూడా ప్రేమే..!!                                       -నందు
ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.అందువలన యాదవులు  మేఘాలకు [...]
దీపావళి సందర్భంగా మళ్ళీ నా కథ, మా కథ, మా వూరి కథ చెప్పక తప్పదు. నిజం చెప్పాలంటే దీపావళి అన్నది ఓ పండుగ అనీ, నరకాసురుణ్ణి సత్యభామా దేవి చంపిన రోజు అనీ కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా మాత్రమే నేను తెలుసుకున్నా. నేనేం పద్దెనిమిదో శతాబ్దం గురించో, పందొమ్మిదో శతాబ్దం గురించో చెప్పటం లేదు. డెబ్బై, ఎనబైవ దశాబ్దాల గురించి చెబుతున్నా. పోనీ మా వూరేమయినా అడవుల్లోని ఓ గిరిజన తండానా [...]
కరిమబ్బుదొంతరల తెరనుదీసి,చిరువానతుంపరల చినుకుల్లకురిసి, కోటిదీపాలకాంతుల్ల వెలుగుల్లమెరిసి సిరిమువ్వ అందియల ఘల్లఘల్లనుచు సిరులుదోసిటబోసి, చిరునవ్వు కలబోసి, ముంగిళ్ళరంగుల్లముగ్గల్లె మురిసి, ఆనందహరివిల్లై వెల్లివిరిసి తరలొచ్చె సిరిలచ్చి పసిడిపాదాలా.. సిరులొచ్చి ప్రతిఇంట పొంగిపొరలేలా.... అందరికీ దీపావళి శుభాకాంక్షలతో....                      . .  శ్రీమణి.
హృదయానికి బాధ కలిగినప్పుడు కళ్ళలోంచి కన్నీళ్లు కారతాయి - అది ప్రేమ.  కళ్ళనుండి కన్నీళ్లు కారినప్పుడు హృదయం నొప్పి పెడుతుంది - అది స్నేహం. 
ఆజ్ కల్ పావ్ జమీన్ పర్ నహి పడతే మేరే..అమ్మో నీ ముందే..?!ఆ చిందులన్నీ నీ వెనకే!అల్లాంటి క్షణాల్లో ఎన్ని తలపులో పలక మీద రాశుకున్నవి.నిను చూస్తే ఇలా.. నువ్వొస్తే అలా.. అని.మరెన్నో జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకానికో పాట. నువ్వో.. మరి నేనో.వెన్నెల పరుచుకున్న మేడ మీదో, బాల్కనీ మూల చీకట్లోనో, ఫోన్ బూత్ లోనో, ఖాళీ బస్టాప్ లోనో...బోలెడన్ని పలకరింపులు ప్రతి పలకరింపుకొక మెలిపెట్టే [...]
తటవర్తి జ్ఞానప్రసూనగారు త్రైమాస లిఖిత పత్రిక "మందానికి" లో నా కథ, "బుచ్చిబాబులాంటి మొగుడొద్దన్నాను కానీ. . . "బుచ్చిబాబు లాంటి మొగుడొద్దనుకున్నాను కానీ . . . . ."అత్తయ్యా ఇంక సద్దుకోవటము కాలేదా ?" అని అడుగుతూ లోపలికొచ్చాడు మా మేనల్లుడు."అంతా అయ్యిందిరా .ఇదిగో ఈ మందులే హాండ్ బాగ్ లో సద్దుతున్నాను." అన్నాను. "ఏమిటీ అన్ని మందులు హాండ్ బాగ్ లో సద్దుకుంటున్నావా? ఎందుకు?" [...]
ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ [...]
తటవర్తి జ్ఞానప్రసూనగారు తీసుకువస్తున్న త్రైమాసిక లిఖితపత్రిక "మందాకిని" అక్టోబరు సంచికలో నా కథ "మా వదిన కామన్ సెన్స్." మా వదిన కామన్ సెన్స్..     మా వదినా మేమూ కూడా “స్వాతిసదన్ ”అపార్ట్ మెంట్స్ లోనే వుంటాము. ఆ అపార్ట్‍మెంట్స్ కి సెక్రటరీగా వున్న వదిన ప్రతి పండగకీ, పబ్బానికీ అందరికీ పోటీలు పెట్టేస్తుంటుంది. సాధారణంగా  పిల్లలకి క్విజ్ పోటీలు, ఆడవాళ్లకి వంటల, [...]
1.  వయసుడిగినా అందమే_ఆత్మీయత నిండిన జీవితాల్లో...!! 2.  ధనాత్మకమైనాయి_అరువు తెచ్చుకున్న అనుబంధాలు..!!
ఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు [...]
M.Tech  కెమికల్ ఇంజనీరింగ్ లో నా స్పెషలైజేషన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ కెమికల్స్. రెండు సెమిస్టర్లయిపోయి మూడవసెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి. అందులో భాగంగా రిలయన్స్ మా కాలేజీకి క్యాంపస్ ఇంటర్వ్యూ కు వచ్చింది. టెస్ట్ పెట్టారు. వ్రాశాను కానీ సెలక్ట్ కాలేదు. ఆ సందర్భంగా అప్పుడు నా డైరీ లో వ్రాసుకున్న ఆనాటి నా భావాలు :)  ఇప్పుడు [...]
ఈరోజు మహారాష్ట్రలో గోవత్స ద్వాదశి పండుగను జరుపుకుంటారు.  ఇది ధన్తేరాస్ కు  ఒకరోజు ముందు జరుపుకుంటారు. గోవత్స ద్వాదశి పూజ హిందువులు జరుపుకునే పండుగ . మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు.  మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న  సహాయంకు  కృతజ్ఞతలు చెప్పటమే  .  ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' [...]
తెలుగురక్షణవేదిక ఆధ్వర్యంలోఅనంతపురంలో కళారత్నశ్రీపొట్లూరిహరిక్రృష్ణగారిసారధ్యంలో అంగరంగవైభవంగా నిర్వహించిన 33గంట44నిమిషాల55సెకన్ల ప్రపంచరికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని సాహితీప్రముఖుల చేతులమీదుగా ఘనసత్కారం అందుకొన్న శుభతరుణం.....శ్రీమణి
ముఖపుస్తక మిత్రురాలు గాయిత్రి కనుపర్తి గారి ఇట్లు...  నీ... పుస్తకం గురించి చెప్పాలంటే.. ముందుగా పుస్తకాన్ని చూడగానే ఆకర్షించే ముఖ చిత్రంతో కనిపించింది. కాస్త లోపలి పేజీలు తిరగేయగానే అందమైన చిత్రాలతో అర్ధవంతమైన కవితా భావజాలాలు ఆర్తిగా పలకరించాయి. ఇట్లు... నీ... అన్న పేరులోనే అంతర్గతంగా పరిచిన ఓ ఆత్మీయత, ప్రేమపూర్వక అక్షరాల అక్షింతలు మనకు కనిపిస్తాయి. మొదటి కవనంలోనే [...]
1.  ధ్యాసంతా నీపైనే ధ్యానానికి తావీయక...!! 2.  మనసు చెమ్మ మదిని తాకింది....!! 3.  నాకెప్పుడూ నీ ధ్యాసే మరలనీయని మనసు కళ్ళెంతో...!!
నీలో నుండుట నాకునునాలో నుండుటయె నీకు నప్పును విధిగానేలోయీ దాపఱికము,లే లోటుల నెంచి చూడ నేమి ఫలమ్మో!ఇప్పుడు గాదన్నవినుము,ఎప్పటికైనను కలువక నెటు పోయెదమీతప్పుల నెంచుట మానినయొప్పగు కూరిమి నిలువకనుండునటోయీ!రూపము, నామాదులలోతాపము తొలగించు శక్తి తరగనిదంచున్కోపము లేకుండఁ , దెలుపు.నా పాలిటి దైవమవుగ నమ్మితినోయీ.పలుకుల చక్కెర గుళికలనొలుకుచు నుండిననదెట్లు నొచ్చును [...]
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిద్దాం. డీల్లీ బాటలోనే మన హైదరాబాద్‌...దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...పర్యావరణాన్ని కాపాడుకుందాం...
శార్దూలవిక్రీడితముకర్మంబందునఁ దక్క నే ఫలములన్ కాంక్షించలేదెన్న, డే దుర్మార్గంబుల క్రుంగుటల్ కనద, వే దుర్వ్యూహముల్ తోచినన్ మర్మంబుల్ సడలంగ జీరు తన సమ్మానంబు వర్ధిల్లగా. ధర్మంబియ్యది నిల్చియున్నది సదా దైవాంశ కన్పట్టగా తీర్మానమ్ముగ నెల్ల వారి శుభముల్ దృక్కోణమందుండగా. అలాగే ఈ ప్రసంగం కూడా వినదగ్గది.https://www.blogger.com/blogger.g?blogID=4174482763145446746#editor/target=post;postID=924532607569542971
సీ. చినుకులెల్లను జేరి చిటపట రాలగ వాన వచ్చెనదిగొ వైభవముగ, పనులు చెడిననేమి పంటలు పండును గాన మెచ్చిరిలను కలలు పండ, ధనమును ధాన్యము తమకు దక్కుననుచు చాన తలపులెవ్వొ మనము నిండె, తనకును తనవారికనలేని రైతన్న దానదక్షిణలిడు దరికిఁ బిలిచి. ఆ. నేల మీద నేడు నింగి ప్రతిఫలించె నీటి యద్దమందు నిలిచెనిదిగొ నింగిఁ గానరావు నిక్కు చుక్కలవెల్ల నీటి చుక్కలల్లె నేలఁ జేరె. ---------లక్ష్మీదేవి.
జిల్లెళ్ళపాడు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా లోని ఒక కుగ్రామం. కనిగిరికి దరిదాపు 22 కి.మీ దూరంలో పట్టణవాతావరణం మచ్చుకైనా లేని గ్రామం. ఊరు రెండు భాగాలుగా విడిపోయి వుంటుంది. "పాతూరు", "కొత్తూరు" అని. పాతూరికి కొత్తూరికి మధ్యన కొంతపొలం వుంటుంది. నడిచి వెళితే ఓ పదినిమిషాలు పడుతుంది. పాతూరికి ఓ ప్రక్కగా మాల,మాదిగ పల్లెలుండేవి. అన్నింటిని కలిపి జిల్లెళ్ళపాడు అని అంటారు.  [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు