Sharada గారూ, మీరు ఉదాహరించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. vijay గారూ, పాఠకాదరణ పొందినవాటినే కాదు, వేరే రచయిత రాసిన ఏ కథనూ మరో రచయిత ‘మెరుగుపరుస్తా’నంటూ బయల్దేరకూడదనేది నా స్థిరాభిప్రాయం.ఔను, గీతాదత్- లతామంగేష్కర్ ల గురించి రంగనాయకమ్మగారు రాశారు, ‘మానవ సమాజం’ పుస్తకంలో. అది చదివాకే, ఈ విషయంలో నాలో ఉన్న ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది. మీ చివరి పేరా అర్థవంతం.
sharada గారూ, ఒకే విషయం మీద ఇద్దరు కథకులు స్పందించి కథగా మార్చారా? Very interesting! మీరు చెపుతున్న రెండు మూడు సందర్భాల్లో ఒకటైనా గుర్తుచేసుకుని చెప్పండి.మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ.
రామ్ గారూ, ‘దర్శకుల జన్మహక్కు’ను ఈ సందర్భంగా మీరు గుర్తు చేయటం బాగుంది. ధన్యవాద్.Sharma గారూ, మీ స్పందనకు వందనాలు.
Advaita TT , థాంక్యూ.సుజాతా, ‘రచన ఎప్పుడూ ఒరిజినల్ గానే ఉండాలి. తిరగరాయడాలు, కొత్త సువాసనలు అద్దడాలు పనికి రావు. అది వికటించి దుర్గంధమవుతుంది ’- నిజమే. థాంక్యూ. Naveen గారూ, మీ స్పందనకు థాంక్యూ.
K.Murali Mohan గారూ, మీరిచ్చిన లింకులు చూశాను. మొదట మీరు ఒరిజినల్ కథను ఇచ్చారు. తర్వాత క్విజ్ పెట్టారు. ఇది రచయితల వర్క్ ఫాపులో ఎక్పర్ పైజ్ లాంటిది. నేను చెపుతున్న సందర్భంలాంటిది కాదిది!
శ్రీవల్లీ రాధిక గారూ, ‘మునెమ్మ’ టపాపై మీ అభిప్రాయం తెలిపినందుకు కృతజ్ఞతలు!
Vijay గారూ, ‘మునెమ్మ’ నవలిక త్వరలో మీరు చదివి, మీ అభిప్రాయాలు చెప్పాలి. రచయిత ఉద్దేశపూర్వకంగానే మార్మికతను మిళితం చేశారనుకుంటున్నాను.సంచలనాత్మకం, చర్చనీయాంశం అవుతుందనే ఆకాంక్ష కారణమై ఉండొచ్చు. రచయితలు తమ రచనలపై వచ్చిన విమర్శలకు ఇంత తీవ్రస్థాయిలో అసహనంగా జవాబులివ్వటం తెలుగులో అరుదే!
BVJ శ్రీనివాస్ గారూ, ప్రభాకరన్ ను అలా సంబోధించింది జర్నలిస్ట్ శ్రీధర్ కృష్ణస్వామి అని మీరు గమనించేవుంటారు. నాకైతే ఆయనపై నిర్దిష్టంగా ఒక అభిప్రాయమేమీ లేదు!
@ తృష్ణ: @ ఆ.సౌమ్య:బాలచంద్రన్ విషాదాంతంపై మీ స్పందన సార్వత్రికమైనది. మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ !
బాలచంద్రన్ విషాదంపై నిన్న (ఆదివారం) హిందూ ఓపెన్ పేజీలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ కృష్ణ స్వామి రాసిన వ్యాసంలో కొంత ఇక్కడిస్తున్నాను. నా టపా - ఆయన స్పందన దాదాపు ఒకేలా ఉండటం విశేషం! ఇలాంటి అంశాల్లో ఒకే తరహా స్పందనలు సహజమే. “Did you see the picture of that little boy in The Hindu … he reminds me of my son who is only a few years younger. I am outraged,” thundered a
@ రామ్ : థాంక్యూ. టపా రాయటానికి హైదరాబాద్ పేలుళ్ళు కొంత నేపథ్యం, ప్రేరణ ఇచ్చినమాట నిజమే. మరింత విస్తృత పరిధికి దీన్ని అన్వయించవచ్చు. @ సుజాత: ‘విశ్వరూపం’ సినిమా సన్నివేశానికీ, బాలచంద్రన్ విషాదానికీ అనుకోకుండా లింక్ చేయొచ్చని ఎలా తోచిందో తెలీదు కానీ, రాశాక సరిగానే కుదిరిందనిపించింది. మీ అభినందనకు థాంక్యూ.@ విజయ్: ‘బాలచంద్రన్ ముఖంలో కనపడీ కనపడనట్లుగా ఉన్న ఆందోళన’
తప్పిపోయిన మృత్యువు గురించీ, వెంటాడి మరీ కలుసుకున్న మృత్యువు గురించీ మీరు రాసిన సంఘటనలు జలదరింపజేశాయి. సూరయ్య గురించి మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. అలాంటివాళ్ళు పట్టణాల్లో కనపడకపోవచ్చు కానీ, పల్లెల్లో తారసపడుతూనే ఉంటారు!
మీరు చెప్పింది నిజం.. నేను నిన్న TV లో చూసినప్పుడు 108 వాహనం అతి కష్టంగా ఆ traffic లో పోవడం …చాలా బాధేసింది … మన వాళ్ళు ఎవరైనె ambulance లో ఉంటె తప్ప …ఆ బాధ బయటి వారికి తెలియదు….. కొంత మంది మీరన్నట్టు సహాయం కోసమే వస్తారు …..Hats Off to them ! ఈ సందర్భం లో ఇంకో విషయం చెబుతాను….నేను రోజూ వెళ్ళే దారి లో కనీసం 2 ambulance లను చూస్తాను …అవి కూత పెట్టుకుంటూ అతి కష్టంగా….traffic లో సతమత పడుతుంటాయి [...]
అభినందనల జల్లు కురిపిస్తూ చివరికొచ్చేసరికి చక్కగా కడిగేశారు. కమల్ ని అడిగితీరాల్సిన ప్రశ్నే!
రామ్ గారూ, అర్థరాజ్యమనుకోండీ, అంగరాజ్యమనుకోండీ. అది కేవలం మీ అభిమానం. మీ దస్తూరీ పరిమళం ఈ టపాకు కళ తెచ్చింది!
I have forgotten the fact that it's an English blog. So I commented in Telugu.

Let me write my comment in English too.

I think, the artist is none other than the famous illustrator 'Chitra' of Chandamama. HIs real name is T.V. Raghavulu.
ఈ బొమ్మ వేసింది చందమామ ప్రముఖ చిత్రకారుడు ‘చిత్రా’ అనిపిస్తోంది. బొమ్మ తీరు అలాగే ఉంది. పైగా చిత్రా అసలు పేరు టి.వి. రాఘవులు. ‘వి’ అంటే వీర అనుకుంటాను!
Narayanaswamy గారూ, మీ ప్రశంస సంతోషాన్నిస్తోందండీ. థాంక్యూ!
తృష్ణ గారూ! నేను రాసిన టపాలపై మీ అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్యూ.

రామ్ గారి వ్యాఖ్యలను ఆయన చేతిరాతతో చూడటం మరీ బాగుంటుంది.:)
@ సుజాత: ఔను, రామ్ గారి టిపికల్ కామెంట్. @ తెలుగు అభిమాని: థాంక్యూ. >> ఈ చిత్రాలు చూచి ఎంతోమంది నాస్తికులు believers అయ్యారు మరి :O>> అదేమో కానీ, ఇలాంటి సినిమాలు మంచి భక్తులను మరింత మంచి భక్తులుగా మార్చే అవకాశం ‘కొంచెం’ ఉంది! (సి.రాఘవాచారి గారి సరదా వ్యాఖ్యకు అనుసరణలెండి). రామ్ గారూ! మీ దస్తూరికి బాగా ప్రశంసలు వస్తున్నాయండీ...
రామ్ గారూ! మయుడికీ, కరుణామయుడికీ పోలిక తెచ్చిన మీ చతుర వ్యాఖ్య అందంగా ఎంతో బాగుంది. నిజానికి ఈ పన్ నేను ఊహించి పెట్టింది కాదు,నిజంగా! టపాపై మీ అభినందనకు థాంక్యూ. మీరన్న బ్లాగు ఫ్రీక్వెన్సీ గురించి... ‘నెల తప్పకుండా’ఒక పోస్టు రాయటమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి!
ఎం.వి.ఎస్. రామ్ ప్రసాద్ గారు పంపిన వ్యాఖ్య- ‘‘మీ శీర్షికే గమ్మత్తుగా ఉంది! మనకింతవరకూ ‘మయుడు’ వేసిన సెట్టింగ్ లే famous- కరుణా‘మయుడు’ కూడానా :)(చూ: మయ సభ)..’’ మిగతా.. టపా చివర చూడొచ్చు ! రామ్ గారు పంపింది ‘దస్తూరీ’ తిలకం.jpg. ఇది వ్యాఖ్యల్లో ఒదగదు కనక నేరుగా టపాలోనే కలిపేశాను.
‘మన సిరివెన్నెల డాట్ కామ్’ నేనూ గతంలో చూశాను. కొన్ని పేజీలు నచ్చి ప్రింటవుట్ కూడా తీసుకున్నాను కానీ అవి పోయాయి. ‘శివపూజకు చివురించిన’ పాట వెనక గాధ గురించి మీరు ఇక్కడ నాలుగు jpg పేజీలు ఇవ్వటం బాగుంది. ఇవి అసంపూర్తిగా ఉన్నాయి. మధ్యలో ఒక పేజీ మిస్సయింది కూడా. అందుకని.. మీరు భద్రపరుచుకున్న html పేజీలను (కనీసం ఈ పాటవరకయినా) పబ్లిష్ చేయమని నా సూచన. (సినీ) సాహితీ అభిమానులు [...]
Surya Kumar, మీరన్నది నిజం. మైకేల్ మదన్ కామరాజ్, సత్యమే శివం సినిమాలకు బాలు డబ్బింగ్ ప్రత్యేకంగా పేర్కొనదగ్గది.
BVJ శ్రీనివాస్ గారూ, సంక్షిప్త చిత్ర కథలంటే బహుశా అవి ‘విజయ’ మాసపత్రికలో pullouts గా వచ్చి ఉండొచ్చు. >> కళ్ళకి వున్న కాటుక తప్ప, స్క్రిప్ట్ లో కాటుక, మీ పోస్ట్ లోనే మొదటిసారి గమనించాను నేను. >> భలే రాశారుగా!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు