అజ్ఞాత గారికి, మీ పేరు తెలుపలేదు. సుందరకాండ పారాయణ చెయ్యాలి అన్న ఆలోచన రావడమే చాలా శుభకరమైన విషయం. మీరు ఏ టపాని ఉదహరిస్తూ ఇది రాసారో తెలియదు. మీరు నాకు ఒక మెయిల్ పంపినట్లైతే మీకు అవసరమైన వివరాలు అందించగలను.
మాస్టరు గారు, మీరు ఇచ్చిన లింక్ పని చెయ్యడం లేదు, డైరెక్ట్ గా మెయిల్ లో ఉన్న్ లింక్ కాపీ పేస్ట్ చేసినట్టున్నారు. మీరు ఆ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుని లింక్ ఇవ్వండి.మనస్ఫూర్తిగా నమ్మిన వారిని స్వామి అభయహస్తంతో కాస్తూనే ఉంటారు. పట్టివిడువరాదు నా చెయ్యి అని పెద్దలు అన్నది అందుకేనేమో.
శుభం, సముద్ర లంఘనం పూర్తి చేసారు.అదృష్టవంతులు. సరిగ్గా వసంత నవరాత్రులకు ముందురోజే సముద్రం దాటడం ఆయన సంకల్పమెమో. ఈ రోజు మీరు రాసిన దానిలో ఒక విశేషం ఉంది. హనుమని మింగబోయే సింహిక చంద్రున్ని మింగే రాహువులా ఉంది అని చెప్పారు మహర్షి. రాహువు ఎంత చంద్రున్ని మింగాలని చూసినా మళ్ళీ గ్రహణాన్ని ఛేధించుకుని చంద్రుడు మళ్ళి బయటికి వస్తాడు. అలాగే స్వామి బయటకు వచ్చారు/వస్తారు అని [...]
మీకింకా మేలు. నాకైతే ఒకటే సినిమా రెండురోజుల్లో నాలుగైదు సార్లు చూపించాడు. నా ఖర్మేమంటే, వెళ్ళేటప్పుడూ అదే సినిమా, వచ్చేటప్పుడూ అదే సినిమా.కాకుంటే కొంచెం మంచి సినిమా కాబట్టీ బతికిపోయాను
క్షమించాలి, మీరు మానసిక వైద్యులు కాబట్టి మీ కోణంలో మీరు ఆలోచిస్తారు. బాపురమణలు రామభక్తులు కాబట్టి వారు ఆ కోణంలోనే పరిష్కారాన్ని ఆలోచిస్తారు, సూచిస్తారు. కళాతపస్వి కాబట్టి విశ్వనాధ్ గారు ఆ విధంగానే ఆలోచిస్తారు. ఎవరి నేపధ్యాన్ని బట్టి వారు సూచించే సొల్యూషన్ ఉంటుంది. మీరు ఎగతాళిగా అంటున్నారో లేక మామూలుగా అన్నారో తెలియదు. రామకోటి రాయడమంటే ఒక జీవితకాలపు కమిట్మెంట్ [...]
అదృష్టవంతులు. నాకు కూడా ఇలాగే జరిగింది. ముందు సుందరకాండ ఒక్కటి విందాం అనుకుని తర్వాత రామాయణం మొత్తం విన్నాను. ఆ తర్వాత వారి ప్రవచనాలు చాలావరకు వినే అదృష్టం కలిగింది.