అమెరికా తూర్పు తీరం-రోజు-1 సెలవుల్లో ఎక్కడికైనా వెళదామని పిల్లలు ఒకటే పేచీ. తలా ఒక ప్లేస్ సజెస్ట్ చేసేరు. వరు హవాయ్ దీవులకు వెళదామని గూగుల్ లో రీసెర్చి చేసి, ఒక కాగితమ్మీద వివరాలు ప్రింట్ చేసుకుని మరీ తెచ్చింది. “కానీ ఇన్ని రోజులైంది, అసలు అమెరికా ఈస్ట్ కోస్ట్ కి వెళ్లలేదన్న” అసంతృప్తి నాలో … చదవడం కొనసాగించండి →
రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion [...]
నేడు మన పట్టణాలలో వీధికో సాఫ్ట్ వేరు సారువాడు ఉన్నట్టు ఒకానొకప్పుడు అనగా గౌతమ బుద్ధుడు పుట్టడానికి పూర్వమట - వీధికో ఫిలాసఫరు బయలు దేరాడట. ఎవడి సిద్ధాంతం వాడితే ఎవరి ఫాలోవింగు వాడిదే. మనిషన్నవాడికి కొట్టుకోడానికి ఆ మాత్రం కావాలి, అదే కాలమైనా. అప్పటి కాలాన్ని భావతీవ్రోష్ణతాయుగమని చారిత్రకులు పేరు పెట్టారు.ఈ సిద్ధాంతాలను స్థూలంగా 62 రకాలుగా కొందరూ, 364 రకాలుగా [...]
భయము అనగానేమి? భయమనగా ఉద్వేగకారకచిత్తవికల్పము. కొందరికి నల్లి యన్న భయము. మరికొందరికి బల్లియన్న భయము. ఇంకొందరికి బొద్దింకను జూచిన యొడలు గంపించును. మా ఊరియందు నొకఁడు గలడు. వానికి నీరనిన భయము. మానవుల చిత్తములు బలు విధములు. ఒక కవి "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను" అని నుడివెను.(ఈ రోజే బహుళపంచమి) వెన్నెలకు భయపడువాడు కవి యేనా? కావచ్చును, కాకపోవచ్చును. అదియొక [...]
తత్పూర్వదినంబునఁ రాతిరి కతికిన రెండెండు రొట్టెలు దక్క మరేమియునూ యుదరంబున నుండుట లేమి జేసి యాతని దైన్యము నివ్వటిల్లి మానసము మిక్కిలి వెక్కసమందెను. ఈ దినంబుననైనఁ జీకటవుటకు ముందుగ నేమైననూ ప్రాపించవలె, కానియెడ కాళ్ళు కడుపునందు జొనపవలసి వచ్చును.ఓటికుండయందు పటుతరంబైన రాలు వ్రేసి మ్రోగించునట్టు వికృతస్వనంబుతో ఒక లాండ్ రోవర్ వాహనము తన ముందుఁ జని దూరంబుననున్న పానశాల [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు