‘నాకు PAN కార్డు ఉంది నేను ఓటు వెయ్యొచ్చా?’“కుదరదండి వోటర్ కార్డు కావాలి’‘నాకు వోటర్ కార్డు ఉంది దాని మీద రేషన్ దుకాణం లో సరుకులు కొనచ్చా?’‘కుదరదండి రేషన్ కార్డు కావాలి’‘రేషన్ కార్డు ఉంది గ్యాస్ దొరుకుతుందా?’‘కుదరదండి, ఆధార్ కార్డు కావాలి’‘ఆధార్ కార్డు ఉంది బ్యాంకు ఖాతా తెరవచ్చా?’‘కుదరదండి PAN కార్డు కావాలి’‘అయ్యా, నాకు PAN కార్డు కావాలి’‘మీ వద్ద ఆదార్ కార్డు [...]
గురువు ద్రోణాచార్యుడు కురుపాండవ సోదరులకు విలు విద్యలో పోటీ పెడతాడు. ఒక వృక్షం కొమ్మల మధ్య పక్షి బొమ్మను పెట్టి దాని కన్నుకు గురిపెట్టి  బాణం కొట్టమని ఆదేశిస్తూ, ఒకొక్కరిని విడివిడిగా  ఆ చెట్టుపై ఏం కనబడుతున్నదో చెప్పమంటాడు. “చెట్టు, కొమ్మలు, ఒక కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను.”“కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను”“పక్షి” ఆఖరుకు అర్జునుడి వంతు.“అర్జునా! ఏం కనబడుతోంది?” [...]
(ప్రస్తుతం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న నా పాత్రికేయ మిత్రుడు మాడభూషి శ్రీధర్ ఒకప్పుడు 'ఉదయం' దినపత్రికలో పనిచేసారు. దాసరిని స్మరించుకుంటూ, అలనాటి ఉదయపు రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఇలా) "ఉదయం దిన పత్రిక చైర్మన్ దాసరి నారాయణరావు గారి ఇంట్లో రాత్రి 12 తరువాత కీలకమైన సమావేశానికి రావాలని పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన [...]
(చంద్రబాబు మూడేళ్ళ పాలనపై ఈరోజు (08-06-2017) ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏపీ ఎడిషన్) లో నా వ్యాసం)“కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది”నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు [...]
నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.నేను అభిమానించే ఈ  కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! వస్తున్న కధల్లో రాశి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు