జైశ్రీరామ్.17) పెద్దవారిఁ గనుచు పిల్లలు నడుతురు  -  మంచి చెడ్డ లనున వెంచకుండ.    మంచి త్రోవ నడిచి మము నడిపించుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పెద్దవాళ్ళను గమనిస్తూ, వారి ప్రవర్తనా సరళినే మేమూ అనుసరిస్తాము. అందలి మంచిచెడ్డలను మేము పరిగణింపఁ జాలముకదా. అందుచేత మీరు మంచి మార్గంలో నడుస్తూ మమ్మల్నీ నడిపించండి.జైహింద్.
జైశ్రీరామ్.16) నవత భ్రాంతిలోన నడయాడుచును మీరు  -  పిల్లల విడుటేల? ప్రేమ లేదొ?    భవిత మాది. మదిని పట్టించుకొనరేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! నవ జీవన భ్రాంతిలో మీరు జీవిస్తూ, పిల్లలను అశ్రద్ధతో అక్కడా ఇక్కడా ఇతరులకు అప్పిచెప్పి విడిచి పెట్టుట యెందులకు? మాపై మీకు ప్రేమ లేదా? మా భవిష్యత్తును గురించి ఆలోచించుతున్నారా? మీరే [...]
జైశ్రీరామ్.15) శ్రద్ధఁ గొలిపి భవిత నర్థవంతము చేయు  -  భవ్యమూర్తి తండ్రి బ్రహ్మ మాకు.    నవత మరిగి మమ్ము నడిపించ మరచిరే !  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాలో శ్రద్ధ కలిగించి, మా జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దే తండ్రి మాకు బ్రహ్మయే. అట్టి తండ్రి ఈ నాడు ఆధునిక జీవన సరళిలో మమ్ములను పట్టించుకోవడం లేదుకదా! ఇది ధర్మమేనా?జైహింద్.
 జైశ్రీరామ్.ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారువ్రాసిన గవాక్షబంధ కందము తిలకించండి.శ్రీ హరి వీయస్సెన్ మూర్తిమాన్యులు కవివర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు ఈరోజు పరిచయము చేసిన రచనను చూచూటవలన కలిగిన స్ఫూర్తితో చేసిన ప్రయత్నము.వారికి నమశ్శతములు.సత్యత్యక్తుం డగునానిత్యము కరిరాట్ప్రసాదు నిర్మల దయతోభృత్యుడు నౌనా ప్రణతిన్సత్యైశ్వర్యాహరుండు శౌరీ [...]
జైశ్రీరామ్.13) శ్రవణ పుటములందు చప్పుళ్ళు పడుచుండ  -  చదువుచున్నఁగాని మదికి పోదు.    చదువుచున్న మాకు సహకరింపరదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే సమయంలో మీరు అవసరమున్నవాటిని గూర్చి, అవసరము లేనివాటిని గూర్చి మాటాడుకొంటూ ఏవేవో చప్పుళ్ళు చేస్తుంటారు. మా ఏకాగ్రతకు భంగం వాటిల్లుతోంది కదా? మాకు మీరు చదువుకొనేటందుకు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు