భావగీతం  చుక్కాని కరువైన చిరునావలోన  దిక్కేదొ తెలియని నా జీవితాన  వెలుగైతివే నీవు మెరుపైతివే  కనుతెరిచినంత కనుమరుగైతివే   నీవు చూసేచూపు నిశిరాత్రి వేళ  నిదురలేపీ నన్ను పలుకరిస్తుంది  నవ్వుతున్నా ఏరు నా తీరు చూడ  ఆకాశ అద్దాన జాబిలయ్యింది                "చుక్కాని " నీ నుదుట కుంకుమై నే నిలువగానే  సూరీడు ఈసుతో  నన్ను చూసేను  తెరచాప మాటునా నీవు [...]
పొగచూరిన జీవితాలు  అగచాట్లకు ఆనవాలు  పవరఫుల్ బైకులతో  లవ్వర్ తో రైడింగులు  మితిమీరిన గమనాలు  అతివేగపు సాహసాలు  కళాశాల చదువంటే  కులాసాల సంబరాలు  నిదురనుండి లేస్తూనే  సెల్లుఫోను గిల్లుకుంటు  ఏండ్రాయిడ్ మందిరాన  ఫేసుబుక్కు దర్శనాలు  ప్రేమంటే యాసిడ్లూ  ప్రేమంటే కత్తిపోట్లు  ఎదిరించే లేడి కూన  తెగనరికే కర్కశాలు   ఇదేనా ఇదేనా  పరుగెత్తే [...]
మోసపోయా ...  నీవు  దాహార్తితో  తపించినపుడు  నా వళ్లంతా  ఒయాసిస్సులే  నేను  జీవన కాసారానికై  నీ దరికొస్తే  నీ మనసంతా  మరీచికలే 
మనుషుల మధ్య దూరానికి మాటలే కారణమైనపుడుమనసుల మధ్య అంతరానికి మమతలే కరువైనపుడు గాయపడ్డ మనిషికి అరువిచ్చే చేతలు కరువువేదన చెందిన మనసుకి బరువుని తీర్చే మాటలు కరువు !అరువిచ్చే చేతలను బరువు తీర్చే మాటలను అనుసంధానించేదే పండుగ ప్రతి మనసుని స్పృశించి వారిలో ఆశా దీపాలు వెలిగించేదే దీపావళి పండగ !దీపావళి శుభాకాంక్షలతో..
నిరీక్షణ ఆమె ఎదురు చూస్తుందినిలువెల్లా పడిన ముడతలనేకళ్ళల్లో వత్తులు చేసుకొని ఆమె ఎదురుచూస్తుంది డాలర్లమేతకు వెళ్లిన వలసపక్షిఎన్నేళ్ళయినా కన్నవారినీ ఉన్న ఊరినీకడగంటైనా చూడనపుడువిరామమెరుగనిఎదురు తెన్నులే మిగిలాయి మస్తిష్కపు చరవాణి పంపినవేనవేలు సందేశాలుఅందే ఉంటాయన్న ఆశతోఆమె ఎదురుచూస్తుంది అనంత సాగారాలకావలఉజ్వలంగా వెలిగే స్వేచ్చా జ్యోతులనుతీసుకు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు