శ్రీరామనవమికి అమ్మ చేసే ఈ వడపప్పు మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మామూలుగా కూడా సాయంత్రాలు సలాడ్ లాగ చేసుకుని తినచ్చు.. ఎలాగంటే.. * అరకప్పు మామిడి కోరు * ముప్పావు కప్పు కొబ్బరి కోరు * కప్పు నానబెట్టిన పెసరపప్పు * తగినంత ఉప్పు, కారం లేదా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు * అరచెంచా నూనెలో అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ ఇంగువ వేసిన పోపు. పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో బాగా [...]
winter melon, ash gourd లేదా white gourd అని పిలవబడే బూడిదగుమ్మడి కాయతో మనం ఎక్కువగా ఒడియాలు పెట్టుకుంటాం కదా. దానితో కూర, పప్పు, హల్వా, సూప్ మొదలైనవి కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ బూడిదగుమ్మడి కాయను ఈ విధంగా రకరకాల వంటల్లో వాడతారని నాకు బొంబాయిలో ఉన్నప్పుడు తెలిసింది. అక్కడ మార్కెట్లో కూరలతో పాటూ బూడిదగుమ్మడికాయలు, కట్ చేసిన ముక్కలు బాగా అమ్మేవారు. నేను మినప్పిండి కలిపి అట్టు
మ్యాగీ మంచిది కాదు, వద్దు... అని వింటున్నా అప్పుడప్పుడు నెలకొకసారి తినేలా ఒక పేకెట్ కొనేదాన్ని మా పాప కోసం. వెజ్ ఆటా నూడుల్స్, ఓట్స్ నూడుల్స్ అంటూ ఏ రకం కొన్నా అవన్నీ కూడా మంచివి కాదనే ఆర్టికల్ ఒకటి చదివాకా, రెండేళ్ళుగా మ్యాగీ అనేది పూర్తిగా కొనడం మానేసి ప్లైన్(ఎగ్ లెస్)  నూడుల్స్ కొని పాపకు చేసి పెడుతున్నాను. మ్యాగీ కన్నా బెటర్ అయినా అది కూడా నెలకు ఓ రెండు సార్లు [...]
శరీరాన్ని చల్లబరిచే గుణమే కాక అరుగుదలకూ, ఎసిడిటీకీ కూడా మంచి మందైన పుదీనా అకులను ఏదో విధంగా భోజనంలో include చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పుదీనా రైస్, పుదీనా పచ్చడి, పుదీనా నిలవ పచ్చడి, పుదీనా కారం, పుదీనా రైతా మొదలైనవి నేను చేస్తుంటాను. ఇవాళ చాలా సులువుగా చేసుకునే పుదీనా కారం గురించి చెప్తాను.కావాల్సినవి:రెండు కట్టలు పుదీనా రెండు, మూడు పచ్చిమెరపకాయలుతగినంత [...]
టూ మినిట్స్ మ్యాగీ కన్నా సులువు ఈ పచ్చడి చెయ్యడం. కరెంట్ లేదు.. మిక్సీ లేకుండా పచ్చడి ఎలా చెయ్యడం అన్న దిగులు ఉండదు. మిక్సీలో తిప్పాల్సిన అవసరం లేని ఈజీ అండ్ సింపుల్ పచ్చడి ఇది!ఎలాగంటే:* ముందు ఓ చిన్న చెంచా నూనెలో ఆవాలు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా కట్టేసే ముందు అర చెంచా కారం వేసి బాగాకలిపి స్టౌ ఆపేయాలి. (కారం ఇష్టం లేకపోతే ఒక పచ్చిమిరపకాయ, [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు