మనిషి తన లోటుపాట్లు తెలిసి కూడా తనను తాను ఇష్టపడటం మానడు. అవే బలహీనతలు ఎదుటివారిలో కనిపించినప్పుడు వారిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అదే ఈ సృష్టి విచిత్రం. 
ప్రతొక్కటీ తాత్కాలికమే.. నీ ఆలోచనలూ, భావోద్వేగాలూ, వ్యక్తుల పట్ల దృక్పథం.. వీటితో బంధం ఏర్పరుచుకొనే బదులు వాటిని అనుసరించడమే మేలు.. 
నీవు చేసింది సరైనదని అని నీకనిపిస్తే - ఇతరులు దాన్ని విమర్శిస్తారు, అరుస్తారు, బాధిస్తారు.. కానీ అవేమీ పట్టించుకోకు. ప్రతి ఆటలో చూసేవాళ్ళు మాత్రమే అలా చేస్తుంటారు..  ఆడేవాళ్ళు కాదు అని గుర్తుపెట్టుకో. నీమీద నీకు నమ్మకం ఉంచు.. నీవు చేసే పనిని మరింత బాగా చేసేలా శ్రమించు. 
ఏ బలహీనత లేని బలవంతుడిని ఆ దేవుడు ఇంకా సృష్టించలేదు..
కావ్యం లాంటి నా జీవితంలో -  కరిగిపోయే కాలానికి,  చెరిగిపోయే రాతలకి,  మిగిలిపోయే తీపి సంతకం నీతో నా పరిచయం.. 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు