మనిషి తన లోటుపాట్లు తెలిసి కూడా తనను తాను ఇష్టపడటం మానడు. అవే బలహీనతలు ఎదుటివారిలో కనిపించినప్పుడు వారిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అదే ఈ సృష్టి విచిత్రం.
నీవు చేసింది సరైనదని అని నీకనిపిస్తే - ఇతరులు దాన్ని విమర్శిస్తారు, అరుస్తారు, బాధిస్తారు.. కానీ అవేమీ పట్టించుకోకు. ప్రతి ఆటలో చూసేవాళ్ళు మాత్రమే అలా చేస్తుంటారు.. ఆడేవాళ్ళు కాదు అని గుర్తుపెట్టుకో. నీమీద నీకు నమ్మకం ఉంచు.. నీవు చేసే పనిని మరింత బాగా చేసేలా శ్రమించు.