క్రితం ఏడాదిలో అనుకుంటా మా అన్నయ్య Sacred Chants, Holy Chants సీరీస్ సీడీలు కొన్ని కొన్నాడు. ఫ్యూజన్ మ్యూజిక్ పధ్దతిలో చేసిన కొన్ని స్తోత్రాలూ, అష్టకాలు ఇందులో ఉన్నాయి. వినడానికి చాలా బావుండి, మనసులో అలజడిగా ఉన్నప్పుడు ప్రశాంతత నింపే విధంగా ఉన్నాయి సీడీలు. అన్నయ్య కొన్న చాలా రోజులకి ఈమధ్యనే అవి కాపీ చేసుకుని తెచ్చుకున్నా నేను. వాకింగ్ కి వెళ్ళినప్పుడు, వంటింట్లో పని [...]
image from - google సంగీత కళాశిఖామణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి సంగీత నివాళి.._/\_ సంగీత విద్వాంసులు ఉన్నారు..ఇంకా పుడతారు...  కానీ ఇటువంటి మహా విద్వాంసులు ఇక పుట్టబోరేమో...:( ఈ అద్భుతమైన కచేరీ వినిపిస్తూ, నేను వింటూ ఆనందించడం మినహా ఏమీ చెయ్యగలను... చాలా అల్పురాలిని! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో డా.పప్పు వేణుగోపాలరావు గారితో శ్రీ కృష్ణమూర్తి గారి సంభాషణ... చివరలో
image from google 1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా
భారతీయ తంత్రీవాయిద్యాలైన వీణ, సితార, సంతూర్ మొదలైనవాటికి తోడుగా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, గిటార్, మేండొలిన్ మొదలైన వాయిద్యాలను కూడా శాస్త్రీయ సంగీత వాదనకు జతపరిచారు మన భారతీయ సంగీతకారులు. విచిత్ర వీణ, సరస్వతి వీణ, రుద్ర వీణ మొదలైన రకరకాల వీణలను శాస్త్రీయ సంగీతకారులు ఉపయోగిస్తారు. పాశ్చాత్య వాయిద్యమైన హవాయీన్ గిటార్ ను కొద్దిగా మార్చి "మోహన వీణ" అనే పేరుతో [...]
నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు... సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు.  పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు