ఆకాశవాణి వారి సమస్యకు నా పూరణ ( కర్టెసీ :  సమస్య శంకరాభరణం బ్లాగునుండి గ్రహింప బడింది ) సమస్య : సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా  పూరణ:  సముచితబుద్ధి తోడ కడు సాహస వీరులు రామధర్మజ ప్రముఖులు సంధిగోర వినిరా? కడుదుర్మతులైన వారి చి త్తము సడలింప సాధ్యమె విధాతకునైన, చరిత్ర చూడగన్ సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా
సంక్రాంతి శుభాకాంక్షలు సీ|| సంక్రాంతి యింటింట సకల సౌభాగ్యములందించ వచ్చె, పొలముల పంట క్రాంతియై నట్టింట కళకళ లాడె, నవవధూవరుల తొలి పండగయ్యె తిగ్మాంశు గతిమారి దీర్చె గృహస్థుల కోర్కెలెల్ల ఁగరము కూర్మితోన శుభదినమిదె మనసు కలతబాసి యానంద పరవశమ్మున మునిగినది తే.గీ|| భాగ్యమందితి కోర్కెలు బాపుకొందు కాంత కోర్కెయు బిడ్డల కష్టములను క్షయము నందించి మమ్ముల గాచిన జను లు [...]
నూతనవత్సరంబవని నొక్కటి జేసి ప్రజాళి పాపకా ర్యాతిక్రమార్హులై సకల రాజ్యము లొర్ధిలు గాక రేబవల్ ఖ్యాతిన, శాంతిసౌఖ్యము సుగంధ నభోగజమై సకాల వ ర్షాతిశయంబునన్ ప్రణయ రాగము వర్షిలు గాక పృధ్వినన్
భారతంలో కుంతీ,పాండురాజుల సంవాదం వలన మనకు ఆనాటి అనగా భారతకాలం నాటి సమాజ వ్యవస్థ, పెండ్లి అనే కట్టుబాటు, మాతృస్వామ్య వ్యవస్థ అప్పటి ప్రజల్లో వీటిపైన నెలకొన్న భావాలు స్థూలంగా అర్థమవుతాయి. పాండురాజు యుద్ధాలతో కురురాజ్యానికి దగ్గర దగ్గర రాజ్యాలన్నింటిని జయించి సామంతరాజులుగా చేసుకొని కప్పం కట్టించుకుంటూ ఇద్దరు భార్యలతో సుఖసంసారం చేసినప్పటికీ పిల్లలు కలుగరు. బహుశా [...]
సందర్భం: చేది దేశ రాజైన ఉపరిచరమహారాజుకు ( వసువు )  శుక్తిమతీ నది కోలాహలం అనే పర్వతం వల్ల కలిగిన కొడుకూ,కూతురినీ యిస్తుంది.కూతురు పేరు గిరిక, కొడుకు పేరు వసుపదుడు. గిరికను ఉపరిచరమహారాజు పెండ్లి చేసుకొని వసుపదుని తనసేనాపతిగా చేసుకుంటాడు.కొంతకాలానికి గిరిక సమర్త అవుతుంది. అప్పుడామెకు మృగ మాంసం తెచ్చిపెట్టమని తల్లిదండ్రులు చెప్పటం వల్ల వసురాజు అడవికి వెళ్తాడు. ఈ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు