దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసిఅరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం. అవునంటూ ఒక కొమ్మ ఊగింది.తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,పూలు రెమ్మలు గుసగుసలాడి  మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయిఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని [...]
ఏందుకో యీ యాతనా తపనా మనో వేదనా!ఇది ఇక ఎప్పటికైనా నన్ను వదిలి పోవునా?!విధి వికటించితలరాత పిచ్చిగీతలా తోచికాయం మానల్లే ఎండిగాయం పుండుగా మారిగుండె యాంత్రికంగా కొట్టే ప్రతి పోటూగునపంలా దిగుతుందిదిగులో బాధో విచారమో మరి పైత్యమోఎదైనాకానీ మందు ఒకటే లాగుంది.వేలు విడిచిన వివేకం చెప్తుంది.ఏడ్చినట్టుంది...మనిషికి మెదడుకి మందు పని చేస్తుందేమో కానీఇది మనసుకి పట్టిన [...]
ఆజ్ కల్ పావ్ జమీన్ పర్ నహి పడతే మేరే..అమ్మో నీ ముందే..?!ఆ చిందులన్నీ నీ వెనకే!అల్లాంటి క్షణాల్లో ఎన్ని తలపులో పలక మీద రాశుకున్నవి.నిను చూస్తే ఇలా.. నువ్వొస్తే అలా.. అని.మరెన్నో జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకానికో పాట. నువ్వో.. మరి నేనో.వెన్నెల పరుచుకున్న మేడ మీదో, బాల్కనీ మూల చీకట్లోనో, ఫోన్ బూత్ లోనో, ఖాళీ బస్టాప్ లోనో...బోలెడన్ని పలకరింపులు ప్రతి పలకరింపుకొక మెలిపెట్టే [...]
ప్రియమైన అక్కకి..ఎన్నో ఏళ్లు.. అలల్లా ఎప్పుడొచ్చి వెళ్లిపోయాయో!..కాలంతో పాటు.. మన మధ్య దూరం కూడా చాలా సహజంగా ఎదిగింది.చిన్నప్పుడు నువ్వంటే కోపం..ఎప్పుడూ చదువుకోవాలని.. ఆటలొద్దని.. తిట్టేదానివి.మనది పెద్ద కుటుంబం కావడంతో.. చిన్నప్పుడే నువ్వు బాధ్యతల్ని తీసేసుకొని.. నీ బాల్యాన్ని మా అందరి కోసం త్యాగం చేసావేమో!..నేనెప్పుడూ నిన్ను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం [...]
సుప్రభాత సమయంలో ఎగిరేప్పుడు పక్షుల్లో ఒక ఉత్తేజం కనిపిస్తుంది. ఈ రోజు నాకోసం ఏం  దాచిందో త్వరగా చూడాలి అన్న ఒక ఆత్రుత కనిపిస్తుంది.అవే పక్షులు చల్లని సాయంత్రం వేళ గూటికి బయలుదేరినప్పుడు ఎగిరే తీరు వేరుగా ఉంటుంది. మనసులో ఆత్మ సంతృప్తితో ముఖం పై చిరునవ్వుతో నడుస్తున్న ఒక జ్ఞాని లా కనిపిస్తాయి. అల్లాంటి ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం మమేకమై ఎవరో అజ్ఞాత వ్యక్తి మురళి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు