ప్రభుత్వానికి ఒక ఎక్సైజ్ విధానం అనేది ఉంటుందని, ప్రజలు తాగే మద్యంమీద పన్నులు విధిస్తూ ఆదాయం సంపాదించడమే ఆ విధాన లక్ష్యమని తెలిసిన మధ్యతరగతిలో సాధారణంగా రెండు రకాల ప్రతిస్పందనలు ఉంటాయి. ఒకటి, ‘మరి ప్రభుత్వానికి పాలన నడపడానికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు అవసరం కదా, వీలయిన అన్ని మార్గాలలోనూ పన్నులు వసూలు చేయాలి గదా, లేకపోతే ఇంతమంది [...]
