వెలుతురు బాకు సృజనలో .. ఆలోచనా కెరటాలు  విరిగిపడ్డ   మనసు తీరాన   ఉనికిని వెతుక్కుంటూ..నాలోపటికి నేనే వంతెన వేసుకుంటూ ..   ఏవేవో అస్పష్ట భావనలు మోస్తూ మోస్తూ  నేనలసి పోతాను, అక్షరీకరణలొను సొమ్మసిల్లి పోతాను పొద్దంతా అదే పనైతే  రేయంతా ఇంకో రకం సడి కవితాలాలస జడి అనుకుంటా బాహ్యాంత సంఘర్షణల మధ్య  నేనొక ఒంటరి యోధురాలిని నన్ను నేను వ్యక్తీకరించుకోలేనప్పుడు వేరొక [...]
 కల నిజమాయే  ఎన్నో యేళ్ళ కల యిది.  వాయిదా పడుతూ యిప్పటికి నిజమైంది  నా కవితా సంపుటి " వెలుతురు బాకు " టైటిల్ యిది. 22/07/2018 సాయంత్రం విజయవాడలో ఆవిష్కరణ సమీపంలో గల మిత్రులందరూ రాగలరని ఆశిస్తూ ..
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రాముని సుతుఁడర్జునుండు రావణు గెలిచెన్. కందము:  సోమూ!కుశుడెవ్వడురా?  భీమునితమ్ముండెవడుర? భీమ రణంబున్  రాముండెవరిని గెలిచెను?  "రాముని సుతుఁ- డర్జునుండు- రావణు గెలిచెన్."
అభివృద్దికి ఆనవాలు అమరావతి హోరులో యిరవై  యేళ్లుగా నాన్చుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం నట్లు కొట్టుకుంటూ సాగుతూ వుండటం వల్ల .. విజయవాడ చివరన వున్న మేము కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో  చిక్కుకోక తప్పడంలేదు. అనుకున్న చోటికి సరైన  సమయానికి  చేరుకోవాలంటే అడ్డదారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గూగుల్ మ్యాప్ ని శరణు వేడితే మా ఇంటికి వాయువ్య మూలనుండి కేవలం రెండు పర్లాంగుల [...]
continued.. behind her smile... ప్రేమా పెళ్ళి రెండూ శిక్షే హృదయం ఒక పద్మ వ్యూహం ప్రవేశించడమే నీ తొలి వ్యూహం మనఃఫలకంపై  ఏనాటివో అస్పష్టమైన గీతలు కాలాన్ని యుగాలుగా కొలవడమెందుకు నీ  జీవితకాలంతో కొలిస్తే చాలంటావ్ కదా సంధ్య రంగులని అరువుతెచ్చుకుని నీ కాలంతో నువ్వెంతగా మమేకమై ప్రవహించావో అదొక నీటిపై రాత ఇచ్చేది ఏదైనా హృదయంతో ఇస్తే అనేక అనుమానాలతో పుచ్చుకోవడం ఇవ్వాల్సి వస్తే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు