ఈ మధ్యన ఏమీ తోచక ఉంటే - అటూ ఇటూ చూసినప్పుడు కొన్ని చెక్క ముక్కలు కనిపించాయి. అవి -ఉపయోగించగా మిగిలిన ముక్కలు. వాటితో ఏమైనా చేసుకుంటే - వాటి రద్దీ పోతుంది కదా.. అని అనుకున్నాను. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తే - కాగితాలు, ఉత్తరాలు, కవర్లూ.. దాచుకొనే స్టాండ్ Wall Hanging Cover box చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. సరే అని ముందుగా నాకు ఏ విధముగా ఉండాలో, ఎలాగా నాకు ఉపయోగపడాలో వివిధ ఆలోచను చేసి, ఒక [...]
నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తీ, ఇప్పటికీ నిన్ను ఇష్టపడేదీ -  నీ స్నేహితుడు మాత్రమే.. 
కొన్నిసార్లు కొన్నింటిని వదిలి పెట్టడం కష్టమనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలని చూడటం వల్ల - నువ్వు జీవితంలో ఇంకేమీ చెయ్యడానికి వీల్లేకుండా అవి నీ చేతుల్ని కట్టిపారేస్తాయి. కాబట్టి కాస్త బాధగా ఉన్నా, కొన్నింటిని వదులుకోవడమే మంచిది. 
ప్రక్కవాడికి వందసార్లు సహాయం చేయ్..  వాడికి అవేమీ గుర్తుండవు..  కానీ - ఒక్కసారి "కాద"ని చెప్పు !  వాడు ఆ మాటని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు.. 
విభూతి  సిరిసంపదలు, అహంకారం, మమకారాలు, అందచందాలు.. అన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించక తప్పదు. అగ్ని అన్నింటినీ శుద్ధి చేస్తుంది . శుద్ధి అయి - చివరకు విభూతి సిద్ధిస్తుంది. అప్పుడు అన్ని పదార్థాలూ సమానం అవుతాయి. చివరకు మిగిలేది ఈ విభూతే. నుదుట రాసుకునేదీ అదే.. 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు