"నాకు ఆడవాళ్ళంటే మిక్కిలి గౌరవం." "మరి నీ భార్యని పుట్టింటికి పంపించేశావెందుకు?" "మాట తప్పే మనుషులంటే నాకు అసహ్యం. ఇస్తానని ఒప్పుకున్న కట్నాన్ని పెండింగ్ పెట్టాడు మా మామ దరిద్రుడు. ఆ కట్నం వసూలయ్యేదాకా నా భార్యని ఇటు రావొద్దన్నానే గానీ - నాకు నా భార్యంటే మిక్కిలి గౌరవం." "బయట టాక్ వేరేలా వుందే! నువ్వు కట్నం బాకీకి పదిరూపాయిలు వడ్డీ కట్టి, ఆ వడ్డీకి [...]
కుటుంబరావు టైమ్‌కు ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఎప్పటి మాదిరిగానే క్యాంటిన్‌కు వెళ్లాడు. అక్కడ తన కన్నా ముందే మిత్రులు చేరుకున్నారు.బ్రహ్మచారి భాస్కరంను ఎందుకొచ్చావని ఎవరూ అడగరు! అతను ఇంట్లో కన్నా క్యాంటిన్‌లోనే ఎక్కువ సమయం ఉంటాడు కాబట్టి!ఈ దేశానికి మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది భాస్కరం ఆశావాదిలా అనేశాడు. [...]
చాలా కాలం నుంచి నాకొక ఆలోచన ఉన్నది.ఇన్నన్ని న్యూస్ చానెళ్ళు, న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా వీటిలో వచ్చేది అంతా న్యూసేనా లేదా వ్యాపార ప్రకటనల మధ్య  వీలు చూసుకుని చోటు నింపే వ్రాతలా/కూతలా, అని. ప్రింటులో కనిపిస్తే చాలు నిజం అని నమ్మేసే అంతటి  నమ్మకం ఒకప్పటి ప్రింటు మీడియా ప్రజల్లో తీసుకు రాగలిగింది. కాని, ఎలెక్ట్రానిక్ మీడియా అంతటి అదృష్టానికి కూడా  నోచుకోలేదు [...]
హుషారున్నరగా కోతి కొమ్మచ్చిలాడుతూ మూడు భాగాల్లో ఆత్మకథను విలక్షణంగా చెప్పుకొచ్చిన రమణ... ఆ తర్వాత ‘రాయడానికి ఉత్సాహంగా లేదండీ’ అంటూ వాయిదాలు వేస్తూ , ‘విషయాల్లో స్పైస్ లేనప్పుడు ఏం  రాస్తాం? ఫ్లాట్ గా వుంటుంది కదా?’ అని వాదిస్తూ వచ్చారు. రాయాల్సింది ఇంకా ఎంతో ఉండగానే 2011 ఫిబ్రవరి 23న కన్నుమూశారు.   ఆ లోటు తీర్చడానికి చేసిన ఆయన కుటుంబ సభ్యులూ, స్నేహితులూ, అభిమానులూ [...]
                         పదవ అంతస్తు లో పరాగ్గా పడుకున్న నన్ను రవి కిరణాలు బ్లైండ్స్ ని పొడుచుకుంటూ వచ్చి గుచ్చి గుచ్చి లేపాయి  చిరాగ్గా. తప్పక లేచి ఫోన్ దేవుడికి దండం పెట్టుకుని ఈ మెయిల్స్ ఫేస్బుక్ ట్విట్టర్ చెక్ చేసి బ్లైండ్స్ పూర్తిగా తెరిచా. కిటికీ నుంచీ డియర్ బార్న్ స్టేషన్ లో ఎర్రని క్లాక్ టవర్ ఉదయ కాంతిలో మెరిసిపోతోంది. టైం పది. కిందకి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు