ఆత్మ కథ అంటే ఒక విధమైన స్వోత్కర్ష అనే అభిప్రాయం ఉండటం సహజం. కానీ ఒక ఆత్మకథ ఒక జీవన ప్రవాహంగా సాగటం చూశాక మన అభిప్రాయం మార్చుకోక తప్పదు. మన ముందు తరాల్లో ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలియకుండానే కొన్ని అభిప్రాయలని స్థిరంగా ఏర్పరుచున్న మనల్ని ఒక ఆలోచనా స్రవంతిలోకి అలా తీసుకుని వెళ్ళడం అన్నది ఒక విజ్ఞానజ్యోతిని మన అంతరంగాల్లో వెలిగించడమే. అలాంటి సమున్నతమైన రచనయే అక్షర [...]
నా తాళం చెవి తన ఇల్లుని పారేసుకుంది ఇల్లుల్లూ తిరిగాను దేనికీ సరిపోలేదువెదుకుతూనే ఉన్నాను ఇళ్ళన్నీ ముగిసే వరకూ బహుశా నా ఇంటికి ఎవరో కొత్త తాళం వేసినట్లున్నారు నా కాలం ముగిసింది వెదుకులాట ఆగింది తాళంచెవి కొనసాగుతుంది నా వారసుడి చేతిలో మరింత ఆశగా
గుడికెళ్ళినా బడికెళ్ళినా వేడుకైనా వేదికైనా ప్రముఖులంటూ మెహార్బానీ  చేస్తూ… సామాన్యుడి సమయాలకి ఎదురుచూపుల కళ్ళెమేసే రాచ బానిసల కార్యశీలతలో మాన్యుడు సామాన్యుడిలో కలిసేదెక్కడ? భుజాల మీద చేతువేసి తట్టగానే జీవితమే ధన్యమయ్యిందనుకునే అమాయక జీవాలకి,  ఉరుకుల పరుగుల జీవన యానంలో మనిషి మనిషియొక్క ప్రతి క్షణానికీ విలువ ఉందని తెలిసీ , ప్రముఖుల కోసమంటూ  రహదారులని [...]
Life is blended with Kitchen వాక్యాన్ని చెక్కుతుండగా కాఫీ ఇవ్వవే .. అంటావ్ అధికారం ధ్వనిస్తూ నిమిషాల్లో బ్లెండెడ్ కాఫీ పొగలు కక్కుతుంది కానీ వాక్యమెక్కడికో జారుకుంటుంది నిసృహగా కలల బరువుతో ఈ రెప్పలు బాధ్యతల బరువుతో ఆ రెక్కలు ఎన్నటికీ విచ్చుకోలేవని నిత్యం సరిక్రొత్తగా అర్ధమవుతాయి. తడిచిన కళ్ళతో పాఠం నేర్చుకుని మరీ ..భోదిస్తాం. అమ్మలూ... వంటిల్లు స్త్రీలకి కిరీటం ఎప్పుడైనా [...]
రమ్మంటే రాదు  ఎంత విదిల్చినా రాని సిరా చుక్కలా   తనంతట తానే వచ్చి  పాతదే అయినా మళ్ళీ సరికొత్తగా వొచ్చి  తిరిగి  పోనట్లు బెట్టు పోతుంది  రాలుతున్న ఆకుల రాగాన్ని  కొత్త చివురులందుకున్నంత గ్రాహ్యంగా  ఆలోచన పోగు అతుక్కోక తగని అవస్థలవుతుంటే  పడమటి సంజె  వెలుగులో సాగే పొడుగు నీడలా  పక్కుమంటుంది, సౌందర్య తృష్ణ మరీ రగులుకుంటుంది   గరిక కొమ్మ మీద నీటి పక్షిలా మనసు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు