శ్రీ వేదుల బాలకృష్ణమూర్తి గారు - వారి పేరు మీదుగా ఈ బ్లాగు ప్రారంభించబడింది. వారు సుమారు 95 సంవత్సరాల వయస్సులో నేటి సాయంకాలం శ్రీకాకుళంలో స్వర్గస్థులయ్యారని తెలియపరచటానికి చింతిస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ--- మల్లిన నరసింహారావు - పెద్దాపురం
  సమస్యాపూరణలు1. వేళ కాని వేళ వేంకటేశ2. ఉపయోగించని వరములు ఉచ్చై తోచున్ ఆ.వె.|| వేళకానివేళ వేంకటేశ హరి! నీ పాదపద్మములకు ప్రణతులొసగ వచ్చినాను; తెరను ప్రక్కకు తొలగించు మదిని కప్పి వున్నమత్సరమను ఆ.వె.|| సరసమాడుటకును సమయములున్నవి రేయి ఎల్ల గడచిపోయె; ఇపుడు మంగతోడ సరసమాడ విచ్చేసితే వేళకానివేళ
కం||     పేకాట వ్యసన పరులీ లోకంబును మరతురనెడి లోకపుతీరున్ లోకజ్ఞులు తెల్పవినమె; పేకాటాడుచు వివాహ పేరంటమెలా?     తే.గీ.||    దేహి తనకున్న కాంక్షలు తీర్చు కొరకు హరిహరి యనుచు శ్రీహరి శ్మరణ సేయ భక్త సులభుడు ఆశ్రిత వత్సలుండు దేవుడే దిగివచ్చును దేహమున్న
సమస్యా పూరణలు. దొంగ కాని వాడు దున్నపోతు ఆ.వె.|| నేర్పు విద్య యందు నిపుణతకై పని దొంగ కాని వాడు దున్నపోతు వలెను కష్టపడిన ఫలితము అనుభవించు బాలకృష్ణ మాట పసిడి మూట   ఆ.వె.|| దున్నపోతు నేల దున్నగ కష్టించు దొంగతనము చేయు దొంగ,  కాని వాడు దున్నపోతువలెను శ్రమించడు తెలుగు కవితలోని జిలుగులెవియె
సిలికానాంధ్రవారి సుజనరంజనిలో ప్రచురించబడ్డ నా సమస్యాపూరణ పద్యాలుఆ।వె|| స్కూటరెక్కి పోవుచుండెడి సమయానసెల్లుమ్రోగె; ఒంటిచేతి తోడబండి నడుప ఎదుటిబండిని ముద్దాడెసెల్లుఫోనువల్ల చేటువచ్చె కం|| పూరము రససంభరితముపారము లేనట్టిరుచిరభావార్ధవచోసారము తేట తెలుగు నుడికారమెయనిపించు తీపికలకండవలెన్ పుల్లెల శ్యామసుందర్గారిచ్చిన న్యస్థాక్షరికి -- వేదుల [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు