గా దినాల్ల అయిదరాబాద్ ఆర్ టి సి బస్సుల మినిముం టికెట్ ఏడు పైసలే . సికింద్రాబాద్ కెళ్ళి లాలాపేట శాంతి నగర్ మినిమం ల పోవచ్చు. జేబిలో పైసలుంటే గుండె నిండ ధైర్యం .ఫుల్ ధైర్యంతో ధీమాగా నడుస్తున్న. మరి నా కాడ నలభై అయిదు పైసలున్నై మరి .అవనీకి నాకాడ రూపాయుండే.గానీ గా కీసర పోరడు కనపడకుంటే మంచిగనే వుంటుండే.గాడు సేయబట్టి యాభై అయిదు పైసలయిపోయినై వుత్త పున్నేనికి.గాంధీ ఆస్పతల్ [...]
ఆశ -ఆనందంనడుమ అనంతానంత అగాధం ఆనందపు అనుభూతిని అందుకొనుట ఎంత కష్టంఅంతటా కంటకాలు కందకాలు, అడ్డంకులు నిరాశ, నిస్పృహ దుఖం , బాధ, క్రోధంఅత్యాశ- అహంకార మదపూరిత, మాస్తార్యంఆ అడ్డంకులు ,ముళ్ళపొదలుఅన్ని... అన్నింటిని అగాధాన నెట్టి వైచి త్రిప్తి అనే వంతెన తో !ఆవలి తీరం చేరుకో !అనుభవించు అనుభవించు ఆనందపు లోకమదే !!!అంతా నీకొరకే. రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేది :౧౮-౦౨-2009
నీటి లోతు తెలుసుకొని ఈత కొరకు దిగు గాని అన్తెరుగని కొలనులోన తలమునకలు కాబోకు.వ్యాపారం వ్యవ హారం అంతా అనుభవ సారంఆను పాను తెలియకుండ అందులోన అడుగెయ్యకు రచన: నూతక్కి రాఘవేంద్ర రావు , కూర్పు-మార్పు తేది:౧౮-౦౨-2009
అందుబాటులో వున్నపూవు కోసుకో గానిచిట్ట చివరి కొమ్మ నున్నపండు కొరకు పాక బోకు.దొరికిన దానితోనేసంతృప్తి ని పొందు కానిదొరక నట్టి దానికొరకువేసటపడి భంగ పడకు. రచన: నూతక్కి రాఘవేంద్ర రావు ,మార్పు తేది:౧౮=౦౨-2009
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు