శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమాఉత్పలమాల: భూపతి నాదు మిత్రుడిట పూటకు పూటకు తిండి యత్నమేమాపటి దాక కూలి పని మానక  జేసిన పొట్ట నిండదే ! చూపుము దారటంచు  మరి శుధ్ధిగ పూజలు జేయ నిచ్చుగాశ్రీపతియే - దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా !
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - వనవాసం కోసం   కందము: అన్నగరి వీడి వనులకునాన్నయె జెప్పెననుచు జనె నారాముండేదన్నుగ నా జానకి జనెనన్నకు తా లక్ష్మణుండునండగ వెడలెన్. 
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 02 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - వనిత కదేల సిగ్గు ? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్. చంపకమాల: మనమున మెచ్చువాని నభి మానము జూపెడు వాని వేడుకన్ఘనముగ పెండ్లి యాడ మరి కార్యము లన్నియు సాగి మాసముల్దినములు దొర్లి పోగ నొక తీయని వార్తను చెప్ప బోవగావనిత కదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 02 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్కందము: త్రిజగములు బొజ్జన గల వనజ నాభుని రోట గట్ట నారన్ దెచ్చెన్నిజమెరుగక నందుని సతి"గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్".
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు