ఈ సారి నవరాత్రికి వాట్సాప్ లో,  భువనైకమాత పలురూపాలను వివరిస్తూ స్నేహితులు పంపిన సమాచారాన్ని ఆధారం చేసుకొని - రోజుకొక పాదం చొప్పున సీసపద్యము, పదవరోజైన విజయదశమినాడు ఎత్తుగీతి వ్రాసాను.భగవదాంకితమైన ఈ పద్యములో సంస్కృతనామాలు ఉన్నవి, వాటిలో ఎవైనా వ్యాకరణబద్ధంగా లేనిపక్షాన తెలియజేయండి, సవరిస్తాను.నమస్సులు,నవరాత్రి ౨౦౧౭ నవపాదసీసము.1. కఠినపర్వతరాజు కందువపట్టివి, దురు [...]
ఈ రోజు రసధునిలో, ఛందస్సులో రవిప్రసాద్ గారు ఇచ్చిన సమస్య ఇదిబే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్సమస్యని ఇవ్వడంలో కూడా ఆయన చక్కటి ప్రతిభను కనబరచినారు. బే ను బు+ఏ గా విడిదీసినప్పుడు కూడా కవీశ్వరుని అనే పదము కవి+ఈశ్వరుని అని విడుతుంది కనుక యతి చెల్లేవిధంగా, అలా కాకుండా బే ను బే గానే విడిచి పూరించిన వారికి కూడా అఖండయతి చెల్లే రీతిలో ఉన్నది.ఇక నేను పూరించినది [...]
ఫేస్బుక్కులో రసధుని సమూహములో రూపనగూడి సుగుణగారి టపా ఇది.  అందఱూ చదివి ఆనందింతురు గాక.-- ఈ పద్యము పింగళి సూరన గారి కళాపూర్ణోదయము లోనిది. పద్యము,శ్లోకముల అర్థములను అడిగినవెంటనే వివరించి పంపిన గురువుగారు శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారికి హృదయపూర్వక నమస్కారములు, మరియు ధన్యవాదములు. తా వినువారికి సరవిగ/ భావనతో నానునతి విభా వసుతేజా/ దేవర గౌరవ మహిమన/ మా వలసిన కవిత మరిగి [...]
ఈ వారం ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య - బుద్ధలేని వాడె బుద్ధు డనగ.దీనిని మందుగా గొతమబుద్ధునికి జ్ఞానోదయం కాకముందు ఆయన అనుభవించిన సుఖాలను ఒకప్రక్క, వాటిని విడిచిన వెళ్లిన వైనం మఱొక ప్రక్క వ్రాద్దామని ఆలోచిస్తూ  - అప్పటికే రాజ్యలక్ష్మితో మొదలుపెడదామా, లేక వంశపారంపర్యముగా వచ్చిన సంపదతో మొదలుపెడదామా అని సతమతమవుతున్న నాకు అంగుళిమాలుని పేరు గురుతువచ్చింది. [...]
కంది శంకరయ్యగారి సమస్యకు నా పూరణకం.  మొరపెట్టిన భగినీవాచరములఁ గురుతుపడిన విచారింపగ తా పరిభవ మొందిన స్వయంవరమే పదితలలవాని ప్రాణముఁదీసెన్మొరపెట్టిన భగినీవాచరముల అంటే కష్టముచెప్పుకున్న చెల్లెలి పరితప్తవాక్కులలో అని అర్థం.మరి ఆమె చెప్పుకువచ్చిన కథవల్లనే కదా రావణునికి శివధనుర్భంగప్రయత్నసమయాన తనకు జరిగిన గర్వభంగము జ్ఞప్తికి వచ్చింది.అదీ సంగతి.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు