చేరరావే ప్రియా!హృదయం ముంగిట స్నేహమనే ముగ్గు వేసిప్రేమ అనే పేరంటానికి ఆర్తి అనే ఆహ్వానాన్ని పంపి ఎద సాక్షిగా ఎదురుచూపు చూస్తున్నా -మబ్బుల మాటున మాట మాత్రంగా నైనా చెప్పకుండా మరుగున పడిన మసక వెన్నెలలా నువ్వు,మేఘాల అప్పగింతల నుండి వెలువడిచినుకెపుడు తన దోసిట చేరుతుందా అని తల పైకెత్తి చూసే ముత్యపు చిప్పలా నేను -ఇలా ఇంకెంత కాలం ప్రియా ఈ విరహం?ఇదే శాశ్వతమై పోతే [...]
నువ్వు-నేను-ఈ ప్రపంచంప్రియా!ఈ ప్రపంచాన్ని నే మరచానంటేనా ప్రపంచంలోకి నువ్వొచ్చినట్టునా ప్రపంచంలోకి నువ్వొచ్చావంటేనన్ను నేను మరచినట్టు 
పొంగిపొర్లు నదిని ముంచి, బిందెల తోడ         నీరు తెచ్చుకొనెను నీదు తాత!బావిని త్రవ్వించి బక్కెట్ల కొలదిగా         నీరు తోడుకొనెను నీదు తండ్రి!"నల్లా" ను పెట్టించి, బిల్లులన్ చెల్లించి,         నీరు పట్టుకొనెను నీదు భ్రాత!పంపు బోరున దింపి, నింపి వాటరు ట్యాంకు,         నీరు వాడుకొనును నీదు తరము!నీటి బాటిల్సు కొను నింక - నీదు సుతుడు!ఇంత కింతకు నిది యింక [...]
నచ్చిన, నచ్చకున్న - సుత నచ్చిన వానికి కట్టబెట్టి, తానిచ్చయె తీరనందులకు నించుక దూరము నుండు తండ్రినిన్మెచ్చు జగంబు! కాని ఇటు మీరిన ద్వేషము తోడ అల్లునిన్మ్రుచ్చులతో వధించుమను మూర్ఖ పిత న్నురి దీయగావలెన్!ప్రణయ్ హత్యోదంతాన్ని నిరసిస్తూ ...- డా. ఆచార్య ఫణీంద్ర
ఒంటి చెవితోడ విను - విన నోపినంత!ఒంటి చేతితో కార్యంబు లొనరజేయు!ఒక్క చేయి, చెవి మొబైలు కొప్పజెప్ప -అంగ వైకల్య మబ్బె నే డందరి కయొ!!
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు