మౌనవీణ రాగాలేవొ తీగసాగి నేడుకోరుకోని దూరాలేవో కమ్ముకొనెను చూడుమోహజలధి దాటిన భ్రమలు వీగిపోయెనేలో, సాహసమును చూపగలేని బింకమింక ఏలో!గారవించి ఎంతో, ఎడద పరచు వేళాస్వాగతించలేను సాగనంపలేనుమూగమనసు బాధ ఏరి కెఱుక సామీ,పెదవి గడప దాటని పాట నాకు నొసగితేమీ?-----లక్ష్మీదేవి.
కవ్వించు మనసునకుకల వంటి తలపులకుఒక ప్రాయమే సొంతమా?సరిలేని ఊహలకుగురి లేని ఊసులకుఒక ప్రాయమే సొంతమా?దరిజేరు ఆశలకుస్పందించు మమతలకుఒక ప్రాయమే సొంతమా?ఎదురొచ్చు ప్రేమలకుకుదురైన జంటలకుఒక ప్రాయమే సొంతమా?సూదంటు రాయి వలెలాగేయు పలుకులకుఒక ప్రాయమే సొంతమా?--లక్ష్మీదేవి.
నే రాసిన తెలుగు గురించి నాలుగు మాటలు ఈరోజు ఆంధ్ర ప్రభ వార్తాపత్రిక లో చోటు చేసుకున్నాయి. దానికి కారణమైన సుబ్రహ్మణ్యం గారికి,  వారిని పరిచయం చేసిన సూర్య ప్రకాశరావు  గారికి, సంపాదక  వర్గానికి నా ధన్యవాదాలు..... http://epaper.prabhanews.com/m5/1439603/Hyderabad-Main/22.11.2017-Hyderabad-Main#page/4/1
                        ఊరికో ఇంటికో దూరంగా ఉన్న కొలనును ఇష్టపడి చూడడానికి వెళ్ళినపుడు, నిశ్చలంగా నిలిచి మనసును తాకే నీరు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో కదా.కలువపూల నవ్వులు అందంగా విరియగా,  గాలితరగ కరములతో సుతారంగా కురులు సవరిస్తుంది.           అక్కడే ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. ఎప్పుడూ వెళ్ళాలనీ అనిపిస్తుంది. అంత మాత్రాన [...]
మేఘమాలను నింగినిఁ  గాంచిన నెమలి సలుపు నొక నాట్యారాధనజంటను వీడదుగా! సూర్యుని వైపే తిరిగే గుణమణిసూర్యకాంతమను పూబోణిభూమిని వీడదుగా!మాటలు చెప్పని మర్మములేకవితలు పలుకునులే,భావన చాలు కదా!ఆరాధనలను అభిమానాలనువ్రాసి ఇవ్వగలమా?మమతను తెలిసి మసలిన చెలిమిది, వ్రాతలు అవసరమా?-----లక్ష్మీదేవి.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు