పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా [...]
డెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు.ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ కథలు మేము చదివేశాం, చాలా బాగా ఉంటాయి శీను" అన్నారు అక్కయ్యలు. మొన్న [...]
స్థలం: రియల్ డి కార్తే, మెక్సికో దేశం (సముద్ర మట్టానికి ఇంచుమించు 8000 అడుగుల ఎత్తులో)సమయం: వాచ్ తీసుకువెళ్ళలేదు, ఫోనులో చార్జు లేదు!సందర్భం: కొండ ప్రాంతంలో ఆగిపోయిన బైకు, ఎలా తీసుకురావాలో అలోచించకుండా మిగతావారితో కలిసి తందనాలు ఆడేవేళ... మెక్సికోలోకి వచ్చీరాగానే కొన్ని ఫోటోలతో ఫరూక్ చేసిన వీడియోని whatsapp లో చూసి హరి చరణ్ గారు ఫోన్ చేసి " Rj, నువ్వు డాలస్ తిరిగి వచ్చాక విజయ్ [...]
జనవరి 11వ తేది అంటే నాకు ఒక చేదు జ్ఞాపకం. నిండుగా ఉన్న పెళ్ళి పుస్తకంలో ఇంకా పేజీలు ఉన్నా మోడయిన రోజు. పూర్ణ చంద్రుడిని రాహుకేతువులు గుటకాయస్వాహా చేసిన రోజు. అపుడెపుడో చిన్నపుడు చదివిన మేర్లపాక మురళిగారి నవలలో లాగా "మచ్చల పాము అమాయకమైన లేత కప్పని ఆకలితో చప్పరించినలాంటి రోజు"! కాలకేయులు చూడ ముచ్చటగా ఉన్న మాహిష్మతి సామ్రాజ్యంపై దండెత్తినలాంటి రోజు. మళ్ళీ ఆ చేదు నిజం [...]
గత సంవత్సరం కాలేజీ రీయూనియన్ అపుడు మాకోసం రాసుకున్న జ్ఞాపకాలు. ఇపుడు మీకోసం కూడా...సెప్టెంబరులో ఒక రోజు. అతడు సినిమా మాటీవీలో మొదలయ్యి అరగంట అయింది.వచ్చే నెల అక్టోబరు 15 వారాంతంలో మాతోపాటూ నేదురుమల్లి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న స్నేహితులందరూ స్మోకీ పర్వతాలలో కలుద్దామని చాలా రోజుల నుండి అనుకుంటూ వచ్చాము. ఈ వారంలో ఆ ప్రయాణానికి ముందస్తుగా డాలాస్ నుండి బయలుదేరే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు