అధిపత్య హిందువుల నుండి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న.. “మీరు హిందూమతాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవుల పాపాలు కనపడవా? ముస్లిముల దురాగతాలు కనపడవా?” అని. కానీ లెఫ్టిస్టులు లేదా వామపక్షవాదులు అని పిలవబడేదేదే వారు మైనారిటీల గురించి, మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతారని. వాళ్ళు మతాన్ని బట్టి మైనారిటీలు అవ్వవచ్చు, కులాన్ని బట్టి అవ్వవచ్చు లేదా [...]
"పంచాంగానికేం ఈ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా. పాడింది పాటా. యంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి?" అంటూ సిద్ధాంతి మీద చిందులు తొక్కుతాడు రామప్పంతులు - లుబ్దావధాన్లు పెళ్లి కోసమని తాను పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని పిలుచుకుని వచ్చేసరికే ఆ పెళ్ళి కాస్తా అయిపోవడం చూసి. తెల్లవారి నాలుగు ఘడియలకి ముహూర్తమని చెప్పిన సిద్ధాంతి, రామప్పంతులు అటు వెళ్ళగానే శుభ [...]
చదువుకీ, లోకజ్ఞానానికీ సంబంధం లేదు అనడానికి ఉదాహరణ వెంకమ్మ. ఆమె చదువుకోలేదు. కానీ లోకం పోకడని ఆకళింపు చేసుకుంది. తన భర్త ఎంతటి మూర్ఖుడో ఆమెకి బాగా తెలుసు. అతడితో కాపురం చేస్తూనే తనకి కావాల్సినవి సాధించుకుంది. కొడుకుని ఇంగ్లీషు చదివించడం కావొచ్చు, చిన్న కూతురి పెళ్లి సంబంధాన్ని తప్పించడం కావొచ్చు.. అన్నీ వెంకమ్మ ఇష్టప్రకారమే జరుగుతాయి చివరికి. అమాయకపు గృహిణిలా [...]
వెంకటేశానికి చెగోడీలంటే మహా ఇష్టం. గేదె పెరుగన్నా, జామపళ్ళన్నా కూడా ఇష్టమే. గొట్టికాయలు, కోతిపిల్లి కర్ర ఆటల్లో వెంకటేశాన్ని కొట్టేవాడు లేదు. వీటన్నింటికన్నా పొగచుట్టలు కాల్చడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశం. తండ్రిలా సంస్కృతం కాకుండా, పట్నంలో ఉండి ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. అసలే ఇంగ్లీషు చదువులు దేశంలో [...]
సత్యమూర్తి అనే పేరుగల మహానుభావుడు అసత్యం తప్ప మరొకటి ఆడకపోవచ్చు. భీముడన్న పేరు కలిగి గాలేస్తే ఎగిరిపోయేంత అర్భకంగానూ ఉండొచ్చు. అందరూ అలాగే ఉంటారా అన్న ప్రశ్న రాకుండా ఉండడం కోసం, పేరుకు తగ్గట్టుగా.. ఇంకా చెప్పాలంటే ఆ పేరు తనకి అతికినట్టు సరిపోయేలా ప్రవర్తించే వ్యక్తి లుబ్ధావధాన్లు. ఈ రామచంద్రపురం అగ్రహారీకుడు ముందు పుట్టాడా, పీనాసితనం ముందుగా పుట్టిందా అని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు