శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్ కందము:  గురువారమ్ముపవాసము  సరి నీరే ముట్టు తాను, ఛాత్రుండొకడే   మరియారోజే విందుకు  గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను. తే.గీ:  నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు? ఏమిజేసెను తా మేనమామ నపుడు? తోడు వీడకరక్షించె వాడెవరిని?  పార్థసారథి-పరిమార్చె- పాండవులను.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద. తే.గీ:  మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు  మత్తులోనుండ వలదన మాన దలచి  తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ  మత్తు, మందు సేవించుట మంచిదె కద.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది - అరిసె,గారె,పూరి,వడ...రామాయణార్థంలో.   కందము:  అరి సెగలు గ్రక్కు శరమును  గురిజూచుచువేయ వడకె కోతులు, చెమటల్  మరిగారె, రామ శరణని  పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 07 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య: సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ కందము: ప్రీతిగ మేనున సగమున చూతుముగా యుమను భవుని సోయగమొప్పన్ రీతిగ సతియన నామెయె  సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ! 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు