శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - పాశుపతమ్ము వేసి హరి పార్థుని జంపెను నిర్దయాత్ముడై. ఉత్పలమాల:  ఆశగబబ్రువాహనుడు యర్జున పుత్రుడు నశ్వమేధమున్  దేశములన్ని దాటి తన దేశము వచ్చిన యశ్వమంట నా  వేశముతోడ యుద్ధమని వెంటనె రాగను నాగబాణమౌ  పాశుపతమ్ము వేసి హరి! పార్థుని జంపెను నిర్దయాత్ముడై. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - మంచుమల యింద్రనీలమై మండుచుండె.  తేటగీతి:   పెనముపైనట్లు కొలిమిని పెట్టినట్లు  మండుటెండలు మేనుల మాడ్చుచుండె  వినుడు మనమంత యొకనెల వెడలవలెను  మంచుమల, యింద్ర! నీల! మై మండుచుండె.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - మరణమందు తోడు మాధవునకు. ఆటవెలది:  పుడమి బాధ దీర్ప పోరుకై వెడలగ  మరణమందజేయ నరకునకును  వెంట బడుచు వచ్చె నంటగా సత్యభా  మ, రణమందు తోడు మాధవునకు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 05 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - వనిత మీసమ్మునంటి తాబలికెనిట్లు. తేటగీతి:  కొడుకు వేషమ్ము వేయగా కోయవాని  గాను బడిలోన, వెడలెను కన్నతల్లి  "నటన నందరుమెచ్చాలి నాన్న వినుము "  వనిత మీసమ్మునంటి తాబలికెనిట్లు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 05 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - భరతుడంపె రాముని వన వాసమునకు. తేటగీతి:  ఎంతపనిని జేసితివమ్మ యెరుకలేక  తల్లితోగూడి జేసెను తనయుడనుచు  జనము జగమున నిట్లనుకొనును గాద భరతుడంపె రాముని వన వాసమునకు.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు