హరిని స్మరిస్తూ హరినే మదిలో ధ్యానిస్తూ హరినే శరణుజొచ్చిన జీవుని యమభటులు ఏమీ చేయలేరు. ఆ జీవుని ఏ పాపాలూ అంటవు. ఇందుకు తార్కాణంగా నీకు  అజామిళుని  కధను  చెబుతాను  విను  అని  శుకుడు పరీక్షిత్తుకు ఆ చరిత్రను వినిపించాడు...కన్యాకుబ్జం అనే నగరంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆతడు శాంత స్వభావముతో ధర్మ సుశీలుడై సకలవేదములు చదివినవాడై, ఎల్లప్పుడూ గురువులను, [...]
 శ్లో" చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో2 ర్జున !     ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీ చ భరతషభ ! !!(7అ - 16శ్లో)మనిషికి కోరికలు అనేకం. ఆ కోరికలే తోటివారిని నిందించేట్టు, లేదా హింసించేట్టు అనేక సందర్భాలలో వారిని మట్టు పెట్టాలి..నిర్మూలించేట్టు కూడా చేస్తూ ఉంటాయి. మనిషిలో ఉండే అత్యాశే  తన తోటి వారిని హింసించడానికి కారణమవుతోంది. ప్రతీ వస్తువును తయారుచేయడంలో ఒకరిని [...]
ఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు [...]
 ఓం శ్రీ సాయినాధాయ నమ:ఆత్మీయత అనేది అంతరంగ భావం. జనన కాలం నుండి ఆత్మీయానురాగాలను మనం పొందుతాం.మనమూ ఆస్వాదిస్తాం. అది ఒక కుటుంబ పరంగా కావచ్చు ..స్నేహం కావచ్చు..మరేదైనా బంధం కావచ్చు. అందరినీ ఆత్మీయులుగా భావించి పరస్పర అవగాహన మేరకు సంభాషణలు చేసుకుంటాము. కానీ "ఆత్మీయత"కు నిర్వచనం ఏమిటి? అంటే చెప్పగలమా...అది అనుభవిస్తేనే ఆ మధురత తెలుస్తుంది. "రెండు వేరు వేరు నదులలోని [...]
దైవానికి ప్రతిరూపం "తల్లి జగన్మాత" . అమ్మ అయినా అమ్మలగన్న అమ్మ అయినా నిష్కల్మష హృదయంతో పరితపించగలిగితే ఆ పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. అందుకు మన హృదయం పసిహృదయంలా పరితపించాలి. 'యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!..యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!.. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!'సకల గుణాల సంయుక్త అయిన ఆ జగన్మాత సర్వజీవుల్లోనూ విరాజిల్లుతోంది. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు