"యోగాసనాల వల్ల ఉపయోగం వుందా?" పేషంట్లు తరచుగా అడిగే ప్రశ్న ఇది.  "చేస్తే చెయ్యండి. చేసినందువల్ల నష్టం లేదు." ఇది నా స్టాండర్డ్ సమాధానం.  నేనెప్పుడూ ఆసనాలు వెయ్యలేదు. అప్పుడెప్పుడో టీవీలో ఒకసారి చూశాను. ఒక వృద్ధుడు వివిధభంగిమల్లో కాళ్ళూ చేతులూ మడత పెడుతూ, ఘాట్టిగా గాలిపీల్చి వదుల్తున్నాడు. ఆయన అలా చేయడాన్ని ఆసనాలు అన్నాడు గానీ, అవి కేవలం స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు [...]
ఉదయం తొమ్మిది గంటలు, హిందూ పేపర్ తిరగేస్తున్నాను. పఠాన్ కోట్ సంఘటనపై పాకిస్తాన్‌కి మరింత సాక్ష్యం కావాల్ట! "మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.  "కూర్చో సుబ్బూ! ఈ పాకిస్తాన్‌ వెధవకి బుద్ధి లేదు, వొళ్ళు మండిపోతుంది!" అన్నాను.  "మనకి పాకిస్తాన్ వార్తలెప్పుడూ అంతేలే!" అంటూ నవ్వాడు సుబ్బు.  "అంటే పాకిస్తాన్ దేశం వొక శాంతికపోతం [...]
పుట్టినవాడు గిట్టక మానడు, చావు పుట్టుకలు ప్రకృతి సహజం అంటారు. అయితే - కొన్ని మరణాలు చరిత్ర సృస్టిస్తాయి, మనలోని మనిషిని కొరడాతో చెళ్ళుమని కొట్టి ఉలిక్కిపడేలా చేస్తాయి. రోహిత్ మరణం అనేక ప్రశ్నల్ని మనముందుంచింది. ఒక విద్యార్ధి మరణం దేశవ్యాప్తంగా ఇంత సంచనలం సృష్టించడం ఈ మధ్య కాలంలో జరగలేదు (ఎమర్జెన్సీ సమయంలో రాజన్ అనే కేరళ విద్యార్ధి encounter కూడా ఇలాగే తుఫాను [...]
అనగనగా ఒకానొకప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్ధి సంఘాలు వుండేవి. SFI, AISF, RSU, ABVP, NSUI అంటూ హడావుడి రాజకీయ వాతావరణం వుండేది. ఇప్పట్లా కులసంఘాలు వుండేవి కావు. విద్యార్ధి సంఘాలు ప్రధాన రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలు కావున, తరచూ వీటిమధ్య గొడవలు జరుగుతుండేవి. వాతావరణం అప్పుడప్పుడు ఉద్రిక్తంగానూ వుంటుండేది.  కాలక్రమేణా ఎర్రజెండా ప్రాభవం కోల్పోయింది. ఎర్రజెండా [...]
ఆమె ఎప్పటిలాగే ఉదయం నిద్రలేచింది ..   నాన్న తో కలిసి కాఫీ  తాగింది ..  తమ్ముడితో కలిసి టీవీ చూసింది ..  అమ్మతో కలిసి గుడికి వెళ్ళింది ..  తాతయ్యతో కలిసి బజారుకి వెళ్ళింది ...  అమ్మమ్మతో కలిసి పేరంటానికి వెళ్ళింది ...  యధావిధిగా ఆ రోజు కూడా కాబ్ లో ఆఫీసుకి వెళ్ళింది ..  మర్నాటి ఉదయం ఊరి చివర కాలవలో శవమై తేలింది ..  ఒక అబ్బాయికి అంతా బాగున్నప్పుడు ఒక అమ్మాయికి ఎందుకు ఇలా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు