కవిలోని భావుకత్వాన్ని. గళం లోని మాధుర్యాన్ని , ప్రవర్తనలోని సున్నితత్వాన్ని  మాటలో చురుకుదనాన్ని, కల్మషంలేని నవ్వులని  నడకలో ఠీవిని, స్వార్ధంలేని ప్రేమలని  స్నేహ గుణంలో ఉన్న స్వచ్చతని  ఏ మాత్రం సంకోచం లేకుండా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది వ్యక్తులని కాదు గుణాలని ప్రేమించాలనిపిస్తుందిఅందుకనేమో .. మనకి ఇష్టమైన జాబితాలో ఎంతోమంది చేర్చ బడుతూనే ఉంటారు. అలా నా ఇష్ట [...]
నమ్మకమీయరా స్వామీ  నిర్భయమీయరా స్వామీ సన్మార్గమేదో చూపరా స్వామీ .. సుజ్ఞాన సూర్యున్ని మాలో.. వెలిగించరా చెడుకు ఎదురు పోరాడే  మంచినెపుడు కాపాడే  పిడుగుదేహమీయరా.. ప్రభూ.. ప్రేమతో పాటు పౌరుషం పంతము తేజమూ  రాచ గుణమూ ప్రభూ .. వినయం విలువలనీయరా  నమ్మకమీయరా స్వామీ లోన నిజం గుర్తించే  పైన భ్రమను గమనించే సూక్ష్మ నేత్రమీయరా.. స్వామీ .. సర్వమందించు నీ ప్రియ [...]
పదునారు కళల చంద్రుడు తన వెన్నెల కుంచెతో రాత్రిని చిత్రించాలని యుగాల తరబడి జాగారం చేస్తూనేవున్నాడు. వాక్య గుచ్ఛం ముడివిప్పితేవిడివడిన అనేక పదాల్లోనిండిన భావ పరిమళమేనేను అనబడే నా కవిత్వం  లోపం లేని చిత్రం చింత లేని జీవనంపరిపూర్ణమని భావించే జీవితంఅవి అసత్య ప్రమాణాలేకేవలం కవుల కల్పనలేజీవితమంటేనే......అనివార్యమైన ఘర్షణ మనిషి చెట్టుకి [...]
కథలో ఇంతకు ముందు ఏం జరిగిందో  మీ ఊహకే వదిలేస్తూ .. ********************** అతనక్కడ  అలా ఆగిపోయాడు, ఆమె ముందుకు ప్రవహిస్తూ ఒకసారి వెనుతిరిగి చూడాలనుకునే బలీయమైన కోర్కె ని బలవంతంగా అణిచి వేసుకుంది . అతననుకున్నాడిలా .. " అనుభవంలోనూ  అనుభూతిలోనూ  జీవితం ఉంది, సంక్లిష్టతలని అర్ధం చేసుకుంటూ జీవించడంలోనూ ఉంది. కుముదకి జీవించడం అనే విద్య బాగా తెలుసు " అని. అతను యింటికి వెళ్ళాక భార్య యెలా [...]
ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛగా యెగిరే పక్షినవ్వాలనో, ఓ స్వచ్చమైన  సరస్సులో క్షణం కూడా ఖాళీ లేకుండా అల్లనల్లగా యీదులాడే వో చేపనవ్వాలని, పచ్చని తోటలో రంగుల సీతాకోక చిలకనవ్వాలని అలా పుట్టి వుంటే బాగుండేది కదా అని తలంపులు  యెన్నో యెన్నెన్నో లోలోపల. ఇవన్నీ కాకున్నా  ప్రవరుడిలా  దివ్య లేపనం  పూసుకుని హిమాలయాల్లోనూ , అందమైన కాశ్మీరంలోనూ తిరిగి వచ్చే లేపనం అయినా  పొంది [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు