మహోగ్రరూపం,మహాగ్రరూపం
మహా ప్రతాపం,మహాప్రతాపం
మరుభూమిని తలపిస్తూ...
ప్రకృతి మ్రోగించిన
మరణమృదంగం ...
మలయాళనేలపై మహాగంగమ్మ ప్రళయతాండవం
బ్రద్దలయిందేమో...
భళ్ళునఆకాశం....
వరుణుని భీకర ప్రకోపానికి....
చిగురుటాకులా ....
వణికిపోతున్న మలబారుతీరం
ఎక్కడ చూసిన....
ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్న
వాగులు,వంకలు
కుప్పకూలుతున్న
నిలువెత్తు కట్టడాలు [...]