మహ్మద్ కులీ కుతుబ్ షా తన ముద్దుల ప్రేయసి భార్య ఐన భాగమతి కోసము కట్టిన ఊరు ఈ భాగ్యనగరము. అందరు ఒక హిందు స్త్రీ పేరు పెడతావా అని గుస్సా చూపించారు . ఆయన ఏమైన తక్కువ తిన్నాడా! వెంటనే భాగమతిని హైదర్ మహల్ గా మార్చి , భాగ్యనగర్ ని హైదరాబాద్ గా మార్చేసారు. అది మన హైదరాబాద్ ప్రేమకథ. దీనిమీద యం . యల్.  ఏ సినిమా లో“ఇదేనండి ఇదేనండి భాగ్య నగరం మూడుకోట్ల ఆంద్రులకు ముఖ్యపట్టణం, ” [...]
రామప్ప - కోట గుళ్ళు"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో "ఏ శిల్పి చేతిలో నుంచి రూపు దిద్దుకున్నాయో! తొమ్మిది శతాబ్ధాలుగా ఎన్ని చరిత్రలు చూసాయో! వాటికే నోరు ఉంటే ఎన్ని కథలు చెపుతాయో! ఐనా ఈ శిల్పాలకు నోరు అవసరము లేదు కళ్ళ తోనే భావాలు పలికిస్తున్నాయి! రామప్ప దేవాలయము లోని శిల్పాలు చూస్తుంటే నాలో కలిగిన భావాలు ఇవి.వయ్యారం, ఆగ్రహం,కరుణ నవరసాలు [...]
ఈ తిరుమలగిరి కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట కు దగ్గరలో వుంది . ఇక్కడ వున్న వెంకటేశ్వరస్వామి మా ఇంటి ఇలవేలుపు.మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్ కు రాక ముందు ,మా ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ ఇక్కడే జరుపుకునేవారట.చాలా సంవత్సరాల నుంచీ అనుకుంటూ వుంటే ఇప్పటి కి ఇక్కడకు రావటానికి వీలయ్యింది .ఇక్కడ వెంకటేశ్వరస్వామి పుట్టలో నుంచి వచ్చినట్లుగా వుంటారు . విగ్రహం ఏదీ వుండదు. పుట్ట [...]
మావారు పని వుంది నేను రాలేను , నువ్వే వెళ్ళి చూసిరా అన్నారు . ముందు ఒక్క దాన్నే తెలియని ప్లేస్ లో వెళ్ళేందుకు సంశయించాను . కాని ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్ లో ఔరంగాబాద్ చూసేందుకు బయిలుదేరాను . ఔరంగాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ . కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే వున్నాయి . ఇక్కడ ముఖ్యం గా చూడవలసినవి , ' పంచక్కి ' , ' బీబీ - కా - మక్బారా ' , ' [...]
శివ శివ మూర్తివి గణనాథానువు శివుని కొమరుడవు గణనాథాఈ మద్య హైదరాబాద్ లో కాలనీ లలో పెట్టిన వినాయకుని దగ్గర మనము పూజ చేసుకునేందుకు , పూజారిని, పూజ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు . అలా ఔరంగాబాద్ లో ఏమైనా వీలుందా అని మావారు వెతికారు . కాని లేదట. సరే అనుకొని , ఔరంగాబాద్ కు 30 మైళ్ళ దూరము లో నున్న , ఎల్లోరా వద్ద , వేరూళ్ గ్రామం దగ్గర , శివాలయ్ అనే తీర్థ స్తానం లో ఘృష్ణేశ్వరుని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు