నీలాంటి నువ్వు నాకు ఎదురుపడతావని సరదాకైనా ఊహించలేదు..ఎన్ని ఉదయాలు నువ్వు ఊదిన కొత్త ఊపిరితో నిదుర లేచానో..ఎన్ని తీరిక లేని రోజులు నీతో చెప్పాలనుకున్న మాటలు పేర్చుకుంటూ ఉవ్విళ్ళూరానో.. ఎన్ని మధ్యాహ్నాలు నీతో కూర్చుని కబుర్లాడుతూ ఆకలి సంగతి మరిచానో..ఎన్ని అందమైన సాయంకాలాలకి నువ్వూ, నేనూ కలిసి రంగులద్దామో..ఎన్ని అపరాత్రులు వెన్నెల [...]
ఎప్పుడెప్పుడు గబగబా వారాలు క్షణాల్లా గడిచిపోతాయా అని ఎదురుచూస్తుంటే ఎనిమిది యుగాల్లా గడిచినట్టనిపించిన ఎనిమిది నెలలు..అంతటి భారమైన ఎదురుచూపులకి అద్భుతమైన అర్థాన్నిచ్చిన అపురూప క్షణాలు.. పుట్టి బుద్ధెరిగాక అనుభవైక్యమైన భావాలన్నీ మొత్తం ఒక్కేసారి ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసి అసలే భావమూ లేదేమోనన్న వింత సరికొత్త మనఃస్థితిలో.. అప్పుడే పుట్టిన బుజ్జాయిని [...]
​అవునూ.. నాకో సందేహం!అసలు ఈ బ్లాగులూ, ఫేస్ బుక్లూ, గూగుల్ ప్లస్లూ, ట్విట్టర్లూ, ఇంకా బోలెడన్ని రకరకాల సోషల్ నెట్వర్కింగ్/ సామాజిక అనుసంధాన వేదికలు ఎందుకోసం?ప్రతీ మనిషి తన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలతో మొదలుపెట్టి కాదేదీ అనర్హం అన్నరీతిన తమ తమ వ్యక్తిగత ఆసక్తులని బట్టి తన ఇష్టం వచ్చినవన్నీ మిగతా ప్రపంచంచం ముందు ప్రదర్శించుకోవడానికేగా!'ఇష్టం వచ్చినట్టు' అంటే "నేను [...]
​ 2014 జనవరి నుంచి 2015 జనవరి దాకా పదమూడు నెలల పాటు 'కౌముది' సాహిత్య పత్రికలో ధారావాహికగా వచ్చిన 'చంద్రుళ్ళో కుందేలు' పూర్తి నవల 'e-పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి ​సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.​మొదటినుంచీ ప్రతీ నెలా అనుసరిస్తూ వ్యాఖ్యలు, ఈమెయిల్స్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేసి ప్రోత్సహించిన వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.​
అల్లంత దూరాన నీలవర్ణాన వెలిగిపోయే ఆకాశధామం నీ నివాసం..వినీలమైనా కారునలుపైనా నింగికి అద్దం పట్టే సాగరం నా నెలవు..దిగంతాల అంచుల దాకా ఎగరేసే విశాలమైన రెక్కలు నీ సొంతం..నీటి అలల తాటింపు తప్ప మరే విద్య నేర్వని చిన్ని రెక్కలు నావి..దివిసీమలనేలే స్వేఛ్ఛావిహంగానివి నీవు..జలతారు నీటివలలో బంధీనైన మీనాన్ని నేను..మింటి మెరుపులని వేటాడుతూ మరీచిలా సాగేవు నీవు..నీ క్రీగంటి చూపుకై [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు