1987 లో మాస్కో వెళ్ళేవరకు మా ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు.  అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా మరచిపోగలం!చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. సూర్యుడు ఎటు పొడిచినా సరే మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలు, ఆరోజు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ [...]
  గత కొద్ది రోజులుగా పట్టిన ‘వార్తల ముసురుతో’ తెలుగు రాష్ట్రాల్లో మీడియా తడిసి ముద్దవుతోంది. ఒకదాని వెంట మరో వార్త ఎవరో తరుముతున్నట్టు వస్తూ ఉండడంతో మీడియా ఉడ్డుగుడుచుకుంటోంది.మరో రెండు రోజుల్లో, అక్టోబరు రెండో తేదీన  పదవీవిరమణ చేయబోతున్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కొద్ది రోజుల వ్యవధానంలోనే అతి ముఖ్యమైన అంశాలలో కీలకమైన పలు [...]
(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON SUNDAY, 16-09-2018)రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు వుంటాయి. అయితే గణిత శాస్త్రంలో మాదిరిగా ఇవి స్థిరంగా వుండవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారుతుంటాయి. లెక్కల్లో రెండును  రెండుతో  కలిపితే నాలుగు అవుతుంది. అది మారదు. కానీ రాజకీయాల్లో అలా కాదు. ఆ  ప్రశ్నకు జవాబు నాలుగు కావచ్చు, కాకపోవచ్చు. అయినా రాజకీయులు గణితాన్నే నమ్ముకుని ముందుకు [...]
డాక్టర్ చెబుతున్నది వింటుంటే నాకెందుకో పాత సంగతులు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. అది చూసి ఆయన మరోలా అనుకున్నాడు.‘చూడమ్మా! నేను చెప్పేది కాస్త సీరియస్ గా తీసుకో, చెప్పింది చెయ్యి’నేను తలూపాను. కానీ మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలని ఆపుకోలేక పోయాను. మా వాడు కార్లో ఇంటికి తీసుకువస్తున్నప్పుడు తోవ పొడుగునా అవే. నేను కాపురానికి వచ్చి అరవై ఏళ్ళు అయింది. అత్తారింటికి [...]
భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001  సెప్టెంబర్ పదకొండవ తేదీన. కారణం, అమెరికా గడ్డమీద ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్ ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధిచెందిన దేశంగా, అన్ని దేశాల్లో తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు