భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న ప్రారంభమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించారు. ఆ రకంగా దేశ స్వాతంత్య్ర సమరానికి ఊపిరి... దేశ సంస్కృతికి ప్రతీకగా నూలు వడికే రాట్నం నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  తెలుగు [...]
అరకు ఆర్గానిక్ కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందంటే 'ఔనా!' అని ఆశ్చర్యపోయేవారే ఎక్కువ. ముఖ్యంగా మన తెలుగువాళ్ళు. అరకు కాఫీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి అవుతుందన్న విషయం కార్పొరేట్ సంస్థల అధిపతులకు తెలిసినంతగా రోజూ కాఫీ తాగే సగటు తెలుగు కాఫీ ప్రేమికులకు తెలియదు.  పారిస్ లో అరకు కాఫీ స్టోర్:      మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ [...]
మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యమాని ముఖాముఖి మాటలకు బదులు చాటింగ్ లు, బంధుత్వ పలకరింపులకు బదులు లైకింగ్ లు, అభిరుచి వ్యక్తీకరణకు లేదా భావ ప్రకటనకు షేరింగులు అలవాటయిపోయాయి. వ్యక్తులు ఎదురుపడితే మాట్లాడటానికి తెగ మొహమాట పడిపోయి, బింకంగా సిగ్గుపడుతూ, ముడుచుకు పోయే వారు సైతం సోషల్ మీడియాలో విభిన్న ఫోజుల్లో సెల్ఫీలు పెడతారు. 'lol' అంటూ డైనమిక్ గా మాట్లాడతారు. [...]
అది 1999వ సంవత్సరం. దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ ప్రాంతంలో ఓ రాత్రి పబ్ లో కూర్చున్నారు కొంతమంది మిత్రులు. వారి మాటల్లో పుట్టింది 'మొవంబర్' అన్న పదం. నవంబర్ నెల పొడుగునా మీసాలను కత్తిరించకుండా పెంచి, తద్వారా మిగిలిన డబ్బులతో పాటు, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బుల్ని స్వచ్ఛందంగా ఒక సామాజిక కార్యక్రమం కోసం దానమివ్వాలి. అదీ 'మొవంబర్' లక్ష్యం. [...]
నిను వీడని నీడను నేనే... !   ఒక మారుమూల అందమైన ప్రదేశానికి పని మీద వెళ్ళిన ఒకతను అప్పుడే హోటల్లో దిగాడు. భార్య కూడా ఆ ప్రదేశం చూస్తే బాగుండు అనుకున్నాడు. ఎలాగూ కొద్ది రోజులుగా ఇద్దరికీ కీచులాటలతో మనసు చికాకుగా ఉంది. ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా ఒకరినొకరు అరచుకున్నారు. ఈ సమయంలో ఇలాంటి చోట ఇద్దరం గడిపితే చికాకులు తొలగిపోతాయి. మనసులు ప్రేమతో రీఛార్జ్ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు