జీవితాన్ని ఇష్టపడిన నేను నిన్ను అంతే ఇష్టపడుతున్నా పక్కనే ఉంటూ పలకరిస్తావు పర్లేదు రమ్మంటే పారిపోతున్నావు అలసిన మదికి సాంత్వనగా అక్కున చేర్చుకోవాలన్న ఆరాటం నీది విడివడని అనుబంధాల నడుమ విడవలేని అగచాట్లు నావి జ్ఞాపకాల తాయిలాలు ఊరిస్తూ గతమూ ఘనమైనదని వాపోతున్నాయి నువ్వు చేరువౌతున్నావంటే వాపోయే కన్నీటి పలకరింపుల పలవరితలు రెప్పలార్పే క్షణాల రెక్కల [...]
ప్రేమ పారవశ్యంలో అనురాగ మధువులు గ్రోలుతూ సాన్నిహిత్యపు సంతసంలో సరాగాల మధురిమల సుస్వర వేణునాదపు మైమరపులో ప్రణయ ప్రబంధ ప్రియలాలసులు రాధామాధవులు..!!
కథలెందుకో కలలెందుకో మరులెందుకో మమతలెందుకో కనులెందుకో కన్నీరెందుకో మాటలెందుకో మౌనమెందుకో భయమెందుకో భారమెందుకో వలపెందుకో వలలెందుకో పాటెందుకో పగుగెందుకో ప్రేమెందుకో పగలెందుకో మనసెందుకో మరపెందుకో జీవమెందుకో జీవితమెందుకో గతమెందుకో జ్ఞాపకామెందుకో ఎందుకో నీకెందుకో ఈ తపనెందుకో ....!!
నేస్తం,           స్నేహం చాలా విలువైనది, తీయనైనది. 1977 లో మొదలైన చిన్నప్పటి స్నేహం 2017 కి .. ఇప్పటికి అలానే ఉందంటే నిజంగా అదృష్టం అనే చెప్పాలి.  36 ఏళ్ల క్రిందట చూసిన చిన్ననాటి మిత్రుడు మొన్నీమధ్యన వచ్చి వెళితే ఆ ఆనందాన్ని పంచడానికి కాస్త సమయమే పట్టింది.        గత రెండు నెలలుగా జరిగిన కొన్ని సంఘటనల మూలంగా స్నేహంలో అతి హేయమైన కోణాన్ని చూసిన నా మనసు కుదుటబడటానికి చాలా సమయమే [...]
నేస్తం,        అహం అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనచుట్టూ ఉన్న కొందరిని చూస్తుంటే అహానికి అర్ధం తేటతెల్లంగా తెలిసిపోతుంది. నేను అని అనడంలోనే అహం రూపం తెలిసిపోతుంది. ఆత్మాభిమానం మనలో ఉంటే అది ఎదుటివారిని చిన్నబుచ్చదు. అదే అహంకారమనుకోండి ఎదుటివారి లోపాలు ఎట్టి చూపడమే లక్ష్యంగా ఉంటుంది. మన గత అనుభవాలు, ఎదురు దెబ్బలు, కష్టాలు, కన్నీళ్లు ఏమి గుర్తుండవు. నిన్ను [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు