చిన్నప్పటి మాల్గుడి డేస్, స్వామీ సిరీస్ లు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో చూసినప్పుడు , ఈ కాలంలో వచ్చిన దమ్ లగాకే హైసా మొదలైన చిత్రాలు చూసినప్పుడు మన తెలుగు చిత్రాల్లో ఇలాంటి వైవిధ్యత ఎప్పటికి వస్తుందో అని చాలా సార్లు అనిపించేది. కానీ ఇటీవల మన తెలుగు చిత్రాలు కొన్నింటిని చూస్తున్నప్పుడు, ఆ ఆశ నిజమౌతోందే అని ఆనందాశ్చర్యాలు కలుగుతున్నాయి. అనుకోకుండా నిన్న చూసిన ’c/o [...]
కొన్ని సినిమాలు చాలా బావుంటాయి. చూసేసి ఇంటికి రాగానే ఎవరికైనా చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ కొన్ని సినిమాలు చూశాకా అసలేమీ మాట్లాడాలనిపించదు. అలా మౌనంగా చాలా సేపు ఉండిపోవాలనిపిస్తుంది. పునర్జన్మలు, ఋణాలు, పాపాలు, కర్మలు... ఇలా మనం ఎన్ని కబుర్లు విన్నా, ఎంత విద్యని సంపాదించినా, ఎంత తెలివైనవారైనా మనిషిగా పుట్టాకా ఎప్పుడో అప్పుడు అజ్ఞానానికి లొంగిపోయి, జీవితమనే [...]
"హృదయమెంత తపిస్తే... బతుకు విలువ తెలిసింది.  గుండెనెంత మథిస్తే... కన్నీటి విలువ తెలిసింది.  చీకటసలే లేకుంటే... వెన్నెలకేం విలువుంది.  నిన్న ముగిసిపోయాక... నేటి విలువ తెలిసింది" చాలా రోజులకి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసానన్న ఆనందంతో కుర్చీలోంచి లేవబోతూంటే స్క్రోలింగ్ టైటిల్స్ తో పాటూ మొదలైన ఈ పాట మళ్ళీ కూర్చోపెట్టేసింది.. అప్పటికే తుడిచి తుడిచి చెమ్మగిల్లి ఉన్న కళ్ళు [...]
ఎన్నిరాత్రులు ... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు ..  నీవు వస్తావని ....  కలలన్నీ ఆవిరిలా  కరిగిపోయాయి ....   నా కన్నీటిని అందులో కలిపేసుకుని.... ఆకాశానికి ఎగిరిపోయాయి .  నిట్టూర్పులు వాకిట్లో దీపాలు పెడుతున్నాయి...  కళ్ళు కలువరేకులై, సూర్యుని తాపానికి తాళలేక వసివాడిపోయాయి ...  ఎన్నిరాత్రులు... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు ..  నీవు వస్తావని ....  ఆశెల బాసలను మోసుకొచ్చే
తెల్లవారుఝామున ఎప్పుడో ... చటక్కున మెలకువ వచ్చేసింది. ఎదురుగా గాజు కిటికీ..... అందులోనించి గుడ్డి దీపాల మసక మసక వెలుతురు.. ఆ వెలుతురులో చమక్కు మంటున్న  నల్లటి చెట్ల చేతుల్లో తెల్లటి గులాబి మొగ్గలు. ఎలా? ఇది ఎలా? కళ్ళు నులుముకుని చూద్దును కదా!.... మంచు పూల వాన.. ఆగుతూ ... కురుస్తూ... చూస్తుండగానే... సన్నని ముత్యాలై.. తళతళ తళుకులీనే తగరపు కాగితాలై.. విరజాజులై.. సన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు